*దైవ నామ స్మరణ మహిమ*
ఒకసారి హనుమంతుడి ఉదయం కాలకృత్యాలు కోసం ఒక పోదలోకి వెళ్లారు అక్కడ మలబద్దకంతో ఒకతను చాలా కష్టంగా మూలుగు తున్నాడు చాలా ఇబ్బంది పడుతూ రామరమరమ రామా అంటూ అరుస్తున్నాడు చాలా సేపు హనుమంతుడి అసహనంగా వింటున్నాడు ఇంకా గట్టిగా అతను రామ రామ అంటూ అంటూనే ఉన్నాడు ఇంక కోపం అపుకో లేక హనుమంతుడు అతని దగ్గరకు వెళ్లి లాగి పెట్టి చెంప పైన కొట్టి నువ్వు చేస్తున్న పని ఏంటి పలుకుతున్న నామం ఏంటి అని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు... ఉదయం రాముడి దర్శనానికి వెళ్ళగానే రాముడి దవడ బాగా కుమిలి పోయి ఉంది ఇంక హనుమంతుడి గుండె ఆగి నంత పని అయిపోయింది.. ఏమైంది స్వామి అని అడగగానే... నువ్వే ఇలా కొట్టవు హనుమ అని స్వామి వారు ఆంటారు... స్వామి పైన ఈగ కూడా వాలకుండా కపుకాసే హనుమంతుడి కి ఆ మాట వినగానే కన్నీళ్లు ఆగలేదు నాపైన ఇంత నిందఎలా పడింది స్వామి అని అడిగారు, ఉదయం ఒక భక్తుడు బాధతో రామరామ అని బాధతో అరుస్తుంటే అతన్ని కొట్టావు కదా ఆ దెబ్బ నాకు తగిలింది, భగవంతుడు ని తలుచుకోవడానికి సమయం ,సందర్భం, వయసు, వ్యత్యాసం,ప్రదేశం ,చేస్తున్న పని దేనితోను సంబంధం లేదు మనసుపూర్తిగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా నామ స్మరణ చేయవచ్చు..అని చెప్పారు... అప్పుడు హనుమంతుడు క్షమించండి స్వామి.. ఇంక ఎవరు రామనామాన్ని జపించిన వారి కష్టంలో తోడుగా ఉండి సహాయపడతాను అని మాట ఇచ్చారట.....
నామ స్మరణ అంత గొప్పది, పూజతో సంకల్పంతో ,ఆచార వ్యవహారాలు తో, ఏదీ స్వామి కి అవసరం లేదు కూర్చుని చేస్తున్నపుడు కన్నా ఏ పని చేస్తున్నా నామ స్మరణ చేస్తుంటే... అదే ఆత్మ నివేదన గొప్ప సాధన కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను ఏమీ చేస్తున్నాను అని ఆలోచన కాకుండా ఎక్కడ ఉన్నా నామ స్మరణ అపకండి.. అప్పుడు భగవంతుడు మీకు సదా తోడుగా మీ కర్మలకు తానే సాక్షిగా రక్షగా ఉంటారు...
No comments:
Post a Comment