Wednesday, September 4, 2024

****నన్ను నేనే సరిచేసుకోవటము. కాదు తగ్గను అన్నా, అనుకున్నా సృష్టి అన్నీ నేర్పుతుంది. అందుకే ఇంత పొడుగైన జీవితం.

🌹గుడ్ మార్నింగ్ 🌹 రోజు అవసరాలు - కోరికలు - ఇష్టాలు - అయిష్టాలు - ప్రయత్నాలు - జయ - అపజయాలు - లాభ, నష్ట - అనుభవాలు - మొత్తముగా సుఖ దుఖాలతో సాగే జీవితం. ఇది ఎప్పటికి ఇలాగే ఉంటుంది. ఇక్కడే కొద్దిగా మన లోపలకు వెళ్లి గమనించుకుంటే ఇవన్నీ భావరూపాలు. అంటే ఎక్కువ శాతం మనసులో భావరూపములో అనిపించేవే. ఓటమి - వ్యతిరేకత - బాధ - అయిష్టము - నష్టము కలగని మనిషి భూమి మీద ఉండదు. కొద్దిగా జ్ఞానముతో గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. జననము అంటే పుట్టుక లాభమయితే - మృత్యువు నష్టము. ఇది సృష్టి విధానము. ఇలాగే ప్రతి లాభానికి సమానమైన నష్టము - ప్రతి సుఖానికి సమానమైన కష్టము అంటే దుఃఖము తప్పక ఉంటాయి. అలా అని బ్రతకాలంటే కనీస కర్మలు చేయక తప్పదు - వాటి ఫలాలు అనుభవించక తప్పదు. ఇది శరీర విధానము. మొత్తం 50 - 50 సిద్ధాంతము సృష్టిలో నడుస్తూ ఉంటుంది. తప్పించుకోలేము. మొత్తం సృష్టి ఇలాగే ఉంటుంది. ఇది మీ జీవితాన్ని, మీకు బాగా తెలిసిన వారి జీవితాలను కొంచెం లోతుగా ఎక్కువ కాలం పరిశీలిస్తే మీకే అర్ధమవుతుంది. ఇది అర్ధమయితే విషయాలను, జీవన పరిస్థితులను అంగీకరించే మానసిక స్థితి ఏర్పడుతుంది. కర్మ విధానము తెలుస్తుంది కనుక మంచిగా మాత్రమే జీవిస్తాము. అనుభవాలు అధికముగా అన్నీ భావరూపములో లోపలే అనుభవించేది కనుక అర్ధమైన సృష్టి జ్ఞానము - తెలుసుకుంటున్న ఆత్మ జ్ఞానము అంతరంగములో శాంతిగా ఉండేలా భావాలు తీవ్రముగా ఎగిసిపడని జ్ఞాన వైరాగ్యాన్ని కలిగించి నిశ్చల మానసిక స్థితికి డోహదపడతాయి. ఆలోచించండి... పరిశీలించండి. అర్ధం చేసుకోండి. అంతరంగాన్ని శుద్ధముగా - శాంతిగా ఉంచుకోండి. బయటి కదలికలు లోపల ఎక్కువగా కడదిపివేయకుండా ఉండేలా ప్రశాంత జీవితం గడపటం మన చేతిలోనే వున్నది. గెలుపు ఓటములు ప్రధానము కాదు. ఒక్కొక్కసారి ఓటమి శాంతిని ఇవ్వవచ్చు. గెలుపు గుర్రాలుగా నిరంతరం అన్ని విషయాలలో - అందరి వద్ద లాభం కోరుకుంటూ, అనుకూలతలే ఆశిస్తూ, ఆహాన్ని పెంచుకోక - ఓటమి - ఫెయిల్యూర్ అనే స్థితిని కూడా అంగీకరించటం నేర్చుకుంటే జీవితములో శాంతి ఉంటుంది. మన ఆశాంతికి - సర్వ అనర్ధాలకు మన అహమే కారణం. తగ్గితే తల రాలి పడిపోదు. జీవించటం తెలుస్తుంది.ఇదే ఆధ్యాత్మికము. నన్ను నేనే సరిచేసుకోవటము. కాదు తగ్గను అన్నా, అనుకున్నా సృష్టి అన్నీ నేర్పుతుంది. అందుకే ఇంత పొడుగైన జీవితం. 🌹god bless you 🌹


 Source link - http://youtube.com/post/Ugkxin2-OjFMc2k5vOEpaUEge3APv6mWkKjR?si=uP7118TdPNgS03C1

No comments:

Post a Comment