Wednesday, September 4, 2024

 “నిరంతర సాధన కుదరటంలేదు, గుర్తుకొచ్చినప్పుడే వీలవుతుంది ఎలా?"

బయటి వ్యవహారాలు తగ్గించుకుని, అంతర్గతంగా ధ్యాస నిలుపుకుంటే క్రమంగా కుదురుతుంది. 

అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేవారు, రోజంతా ధ్యానంలో నిమగ్నమైవుండేవారు, నిరంతరం దైవనామస్మరణతో గడిపే మహాభక్తులు, ఇలా కఠోర సాధన చేసేవారు ఏకొద్దిమందో ఉంటారు. 

మనంకూడా ధ్యానం,పూజ,తపస్సు, నామస్మరణ, భజనలు, కీర్తనలు ఇలా ఏదో ఒకదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. 

అయితే అది నిరంతరం చేయటం మనకు సాధ్యంకావటంలేదు. 

కానీ దైవదర్శనానికి నిరంతర సాధన అవసరం. అలాంటి సౌలభ్యం ఒక్క ధర్మాచరణలో మాత్రమే ఉంది. 

నిద్రనుండి మేల్కొన్నది మొదలు తిరిగి పడుకునే వరకు మనకు జీవన వ్యవహారాలు తప్పవు. 

ఆ జీవన వ్యవహారాల్లో మనం ఎలా ఉండాలో అలా ధర్మంగా ఉండటం అలవర్చుకుంటే అదే మనకు నిత్యసాధన అవుతుంది !    

No comments:

Post a Comment