*ఆచార్య సద్బోధన*
*~~*
ఆధ్యాత్మికత అనేది చిన్నవయసు నుండే అలవాటు చేసుకోవాలి.
పాపంపై భయం, దేవునిపై ప్రేమ, సమాజం పట్ల సేవా దృక్పథం వంటివి లేత వయసులోనే నాటుకోవాలి.
లేతవయస్సులో మన పంచేంద్రియాలను కామ క్రోధాదులనే రాక్షసులకు అర్పితం చేసి, వృద్ధాప్యంలో ఏడుస్తూ కూర్చుంటే వచ్చే ఫలితమేమి?
కనీసం ఇప్పుడైనా మేల్కొని భగవచ్చింతనతో సమాజసేవలో జన్మను సార్థకం గావించుకోవడానికి కృషి చేయాలి.
ఈనాడు నీవు పెద్దవాడవు కావచ్చు, విద్యావంతుడవు కావచ్చు, ధనవంతుడవు కావచ్చు, అధికారివి కావచ్చు.
కానీ,
ఈ స్థాయి ఎవరివలన వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు.
*ఆచార్యదేవో భవః*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
No comments:
Post a Comment