ఒకసారి ఇద్దరి వ్యక్తుల నడుమ విశ్వాసము సడలిపోతే వారిని కలుపడం చాలా కష్టం.
ఇరువురు స్నేహితులని విడదీయడం ఎంత కష్టమో, మనస్పర్థలు కలిగిన వారిని కలుపుట కూడా అంతే కష్టం. స్నేహం చెదిరిన తరువాత ఇద్దరు తిరిగి కలిసినా వారి ప్రేమానురాగాలు పూర్వమునకు వలె ఎన్నడూ ఉండవు.. కనుక ఒకరి మీద నింద వేసే ముందు, విడిపోయే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడం ఉత్తమ లక్షణం.. ఈ ఆలోచన లేని ఆవేశపరులతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదం..
దుష్టుల లక్షణం : ఇతరుల గురించి వారి వెనుక ఇతరులతో చెప్పడం, ఇతరుల విజయం పట్ల ఈర్ష్య కలిగి ఉండటం, ఇతరుల గొప్పదనం తన సమక్షంలో వెళ్లడించినప్పుడు అసూయకి లోనుకావడం, ఆవేశంతో రాగిపోవడం, పెదాలు కొరుక్కోవడం, తల అడ్డంగా తిప్పడం, ఇతరులని దూషించడం, పదేపదే వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవడం ఇవి దుష్టుల లక్షణాలు..
No comments:
Post a Comment