Tuesday, August 12, 2025

 *_🌸నీరసం , నిస్సత్తువ...🌺_*

*_మామిడి పండ్లు దొరికే సమయంలో మంచి రకం, పూటకో రకం తినటం వలన త్వరగా నీరసం పోయి శరీరానికి మంచి పుష్టి కలుగును._*

*_రోజుకో లేత కొబ్బరి బోండం లోని నీరు తాగుతూ ఆ కొబ్బరిని భక్షిస్తూ ఉన్నచో నీరసం తగ్గును._*

*_అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది._*

*_రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది . జబ్బుతో ఉన్నప్పుడు ఈ కషాయాన్ని లోపలికి ఇవ్వడం వలన త్వరగా కోలుకుంటారు._*

*_ఖర్జూరం కాయలు రోజూ తినటం వలన శరీరానికి మంచి పుష్టి కలుగును. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగినచో శరీరానికి మంచి రక్తం పట్టి కాంతి , రంగు వచ్చును._*

*_తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్కు లాంటిది . ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి బలం వచ్చును._*

*_తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును. దీనిని "నీర " అని పిలుస్తారు._*

*_రోజుకో వెలగపండు బద్ధ తింటూ ఉంటే నీరసం పోయి బలం వచ్చును._*

No comments:

Post a Comment