Tuesday, August 12, 2025

 *_🍌 అరటి పండులో సహజ సిద్ధమైన చెక్కెరలు, పీచు పదార్ధాలు సంవృధిగా ఉంటాయి._👇🏼*
 *_🍌 అరటి పండులో సహజ సిద్దమైన చక్కెరలు, పీచు పదార్ధాలు సమృద్దిగా వుంటాయి. గంటన్నర శ్రమకు తగిన శక్తి రెందు అరటి పళ్ళు అందిస్తాయి. మనం టివిలో తరచూ చూస్తుంటాము ప్రపంచ టెన్నిస్ ఆగటగాలళ్ళు ఆటమద్య విరామ సమయములో రెందు పళ్ళు తినటం శక్తినివ్వటమే కాదు, అనేక రోగాలను నిరోదించే గుణం కలది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి లోనైన వారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రసాంతంగా ఉంటుంది. ఇందులో వుండే బి6 విటమిన్ రక్తంలోని చక్కర మోతాదుని నియంత్రిస్తుంది. దీనిలో ఇనుప ధాతువులు రక్తంలోని ఎర్రకణాలను వృద్ది చేస్తాయి. దీనిలో వుండే అధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని అదుపులో వుంచి పక్షవాతం రాకుండా ఆపుంది. దీనిలోని అధిక పీచు పదార్ధం వలన మలబద్దకాన్ని నివారిస్తుంది. దీనిని ప్రతిరోజూ ఏదో ఒకసమయంలో భుజించుట వలన మెదడుకి చురుకుదనం పెరుగుతుంది._* 

*_🍌 ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణ శక్తిని పెంపోందిస్తుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. వేవిళ్ళలతో బాధపడె మహిళలు వీటిని తింటే చాలా ఉపశమనం కలుగుతుంది. దోమకాటు వలన వచ్చే వాపు, మంటకు పరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దితే తక్షణం వుపశమనం కలుతుంది.దీనిలో ఉండే బి విటమిన్ నాడీమండలానికి మేలు చేస్తుంది. చిప్సు, చాక్లెట్లు తినడం మాని అరటిపండ్లను తినడం వల్ల మానిసిక ఒత్తిడిని తగ్గించటమే కాకుండా ఊబకాయాన్ని నివారిస్తుంది. కడుపులో పుండ్లను (Ulcers) నివారించుటలో మేటిఫలం. మానసిక ప్రశాంతత కలిగించుటలో ఈ పండును మొదట చెప్పుకోవాలి._*

*_🍌 ధాయ్ లాండ్ దేశంలో గర్బిణి స్త్రీలు విధిగా వీటిని తినటం ద్వారా పుట్టబోయే పిల్లలు సాత్విక స్వభావులుగా వుంటారని నమ్ముతారు. ఋతువుల మార్పువలన వచ్చే అనేక సమస్యలకు విరుగుడు ఈఫలమే! పొగ తాగే అలవాటుని మానిపించుటలో అరటి పండును గురించి ఆలోచించాలి. ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామ సమయంలో చిరు తిండిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినే వారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ఉలిపిరి కాయలను నిర్మూలించాలంటే అరటి పండు తొక్క లోపలి భాగం ఉలిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మాంసకృత్తులు, రెట్టింపు పిండి పదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, ఐదురెట్లు విటమిన్ -ఎ కలిగివుంది. మీ కాలి బూటు మెరుపు తగ్గిందా.. అరటి పండు తొక్క లోపలి భాగంతో రుద్దండి ఆ తరువాత పాలిష్ చేయండి, మెరిసి పోతూ ఉంటుంది._*

No comments:

Post a Comment