🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
సహజముగా మనమంతా ఆత్మస్వరూపులము, ఆనందస్వరూపులము. కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం.
మనం ఆనందం గురించి బయట ఎక్కడో వెతుక్కుంటున్నాము. అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాం.
ఇదే ఆశ్చర్యం.
ఆధ్యాత్మిక విద్య కేవలం వినడం తోనే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టినపుడే పూర్తిగా అవగతమౌతుంది.
తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది. అలాగే సారవంతమైన భూమిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది.
సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది.
ఆత్మ అనేది అవ్యక్తము. కనపడదు. వినపడదు. తాకబడదు. ఇంద్రియములకు, మనసుకు అతీతమైనది. సూక్ష్మమైనది.
ఆత్మ దర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి. ఆత్మ గురించి విచారణ చేయాలి. పురాణేతిహాసాలను, గ్రంధములను చదవాలి సద్గురువును ఆశ్రయించాలి. సరైన సాధనలు చేయాలి. తద్వారా ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి. అపుడే నిజమైన మనశ్శాంతి, ఆత్మానందము.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment