Sunday, August 10, 2025

 


*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️భక్తుడు : భగవాన్ ! భక్తి అంటే ఏమి ? శరణాగతి అంటే ఏమి !?_*
*_🦚 మహర్షి : భగవంతునికి శరణు చెందు. ఆయన కనిపించినా, కనిపించకపోయినా సరే ఆయన ఇష్టానికి తలవంచు. ఆయన సంతృప్తికై వేచియుండు. నీవు కోరినట్లు ఆయనను చేయమనడం శరణాగతి ఎలా అవుతుంది ? అది ఆయనను శాసించడమే అవుతుంది. ఒకవైపు నీ ఆజ్ఞలను ఆయనను శిరసావహించమంటూనే మరొకవైపు నీవు ఆయనకు శరణాగతి అయ్యాను అని అనటమా ?_*
*_ఏది మంచిదో , ఏది చెడో , ఏది ఎప్పుడు ఎలా చేయవలెనో ఆయనకు తెలుసు. సర్వమూ సంపూర్ణంగా ఆయనకే వదిలివేయి. నీ మీద ఏ భారమూ పెట్టుకోవద్దు. నీ భారం ఆయనది. నీకు ఏ కోరికా లేదు. నీ కోరికలన్నీ ఆయనవే. ఇలా ఉన్నప్పుడు నీ  మనసంతా ఆయనే నిండిపోతాడు, వేరే ఏమీ ఆలోచించలేము. ఇదే భక్తి , ఇదే శరణాగతి !!_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment