🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
14/11/25
1) అనుభవంలో నుంచి శాస్త్రాలు వచ్చాయే గాని శాస్త్రాల వలన అనుభవం కలుగదు.
2) నీ మనసు దిగంబరం అయితే నీవే అవధూత.
3) జనన మరణాలనేవి లేవని తెలుసుకోవడమే జనన మరణ రహస్యం.
4) నీతో సదా ఉండేది ఆత్మ ఒక్కటే. 'ఆత్మ బంధువు' అంటే ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.
5) జీవస్థితి నుండి దైవీస్థితికి చేర్చే వంతెనలాంటిది ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం శాశ్వతంగా ఉండాలనుకోవడం వంతెనపై ఇల్లు కట్టుకోవాలని అనుకోవడం లాంటిదే.
6) అనంతమైన జీవాన్ని మనం ఈ దేహం వఱకే పరిమితం చేశాం. ఇదే జీవసమాధి.
No comments:
Post a Comment