*భగవాన్ స్మృతులు - 6*
🪷
రచన: గుడిపాటి వెంకట చలం
*సాధుని శాంతమ్మ అనుభవాలు - 3*
*వంటింట్లో*
నేను వంటింట అధికారిణిని ఆనాటినుంచి. ఎల్లప్పుడూ భగవాన్ నా వెంట వుండి కూరలు తరగడమూ, అందివ్వడమూ, వంటకి సహాయము చెయ్యడమూ, ఎట్లా వండాలో చెప్పడమూ, వండి చూపించడం —అంతకన్నా ఏం కావాలి నాకు?
అట్లా స్వామి సన్నిధిలో గడిచింది కాలం. ఎంతపని చేస్తున్నా ఏమి లక్ష్యం వుండేది కాదు. అంతసేపూ ఈశ్వరుడి సమక్షంలో ఈశ్వరుని సేవ చేస్తూ ఉన్నాననే భావమే హృదయాన్ని ఆనందంలో నింపేది. ఏ పూర్వ సుకృతమో నన్ను పరమేశ్వరుడి సన్నిధిలో నిలిపింది అని ఆశ్చర్యపడేదాన్ని.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
భగవాన్ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. వంటింటిలో పనికాక, కర్రలు చెక్కడం, కట్టెలు కొట్టడం, పొట్టు తీయడం, అటుకులు ఏరడం, విస్తళ్లు కుట్టడం-లాంటి పనులు చేస్తూనే మాకు యెన్నో కబుర్లు, ఉపదేశాలు చెప్పేవారు. పనుల్లోంచే మాకు వేదాంతం చూపేవారు. అన్ని గంటలూ నా మనస్సు సులభంగా భగవాన్ మీదే నిలచేది. ఎప్పుడూ ఆయన సమక్షంలో ఉండడం వల్ల ఏదోవిధంగా దృష్టి ఆయనపైన ఉండక తప్పదు. ఎప్పుడూ ఆయన సేవే, ఆయన ఆజ్ఞలే, ఆయన బోధనలే కావడం వల్ల ఆయన నుంచి మనస్సు చెదరడానికివీల్లేదు. మా ప్రయత్నాలు, ఉద్దేశాలు, ఆలోచనలూ అవసరంలేదు. ఆయనే చూసుకుంటారు. నేను చేసే సేన ఈశ్వరుడికి: ఈశ్వర భక్తులకే కదా?
📖
*స్టోర్*
చిన్నస్వామి ఆశ్రమాధికారి కాగానే అన్నారు: “ఇంక మంచి భోజన సామగ్రి తెప్పించి నిలన యుంచి భగవాన్ కి మంచి భోజనం పెట్టించాలి” అని. ఆ మాటలు భగవాన్ చెవినిపడ్డాయి, “ఇంకేం? తెప్పించు, తెప్పించు. నెల్లూరి నుండి బియ్యం, వీడుపట్టు నుంచి పప్పు అన్నీ తెప్పించు" అని అన్నారు. నాటి నుండి యెన్నడూ తరగని సామాను కొట్టు ఏర్పడ్డది ఆశ్రమములో.
*దేవీపూజ*
ఆ మరుసటి సంవత్సరం నేను దసరాకి దేవీ పూజలు చెయ్యాలని రామనాధపురం వెళతానన్నాను. కాని, చిన్నస్వామి నన్ను వెళ్ళడానికి వీల్లేదన్నారు. అయినా వెళ్లాలనే కోర్కె నాలో బలంగానే పనిచేస్తోంది.
మర్నాడు నేను భగవాన్ హాల్లో ధ్యానంలో కూర్చుని ఉండగా వెళ్ళాను, ఆయనకీ నా కోర్కెను తెలియజేయాలని. నాకు అక్కడ భగవాన్ మాయమై, ఆయన కూర్చున్న స్థానంలో దివ్య తేజస్సుతో రెండేళ్ళ పిల్ల కనిపించింది. ఆమె, నేను పూజ చెయ్యడా నికి రామనాధపురం వెళ్లాలనుకునే ఆ దేవి పరమేశ్వరిలా అనిపించింది. ఆనాటి నుండి వేరే దేవతల్ని కొలవవలసిన అవసరం నా లోంచి పోయింది. అందరు 'దేవతలూ ఎవరినుంచి ఉద్భవించారో, ఆ ఈశ్వరుణ్నే ప్రతిదినము సేవిస్తుంటే ఇంకా వేరే పూజా విధానంతో దేవతల్ని కొలవవలసిన అవసర మేముంది?
📖
ఒకరోజు ప్రొద్దున్న ఒక యూరోపియను జట్కాలో నుంచి ఆశ్రమం ముందు దిగి, సరాసరి భగవాన్ దగ్గరకు వచ్చి కాగితం పైన ఏదో వ్రాసి చూపాడు. దానికి భగవాన్ ఏ జవాబు చెప్పక రెప్ప వాల్చకుండా ఆయన వంక చూచారు. ఆ చూపు తగలడంతో ఆయన చూపు భగవాన్ పైన దీక్షగా నిలిచింది. భగవాన్ కళ్లు మూసేశారు; అతని కళ్ళూ మూతలుపడ్డాయి, కదలకుండా అట్లా ఇద్దరూ కొంతసేపు వుండిపోయినారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
పదకొండు గంటలయింది. భగవాన్ భోజనానికి లేచే వేళయింది. మామూలుగా విస్తట్లో అన్నం వడ్డించి, సాంబారు గిన్నె పట్టుకుని మరీ పిలుస్తాము, భగవానుని భోజనానికి. వెళ్లి భగవాన్ కమండలాన్ని పట్టుకుంటాడు మాధవ స్వామి. అదే పిలుపు, ఆనాడు భగవాన్ దగ్గరకి పోవడమే భయంగా ఉంది. పెదిమలు బిగించి, కళ్లు మూసికొని ఆయన కూర్చుని ఉంటే, ఆయన ముఖం గొప్ప జ్యోతితో వెలిగిపోయింది. ఎవరమూ దగ్గరికి వెళ్ళ సాహసించలేదు.
పొద్దెక్కిపోయింది. చివరికి మాధవ స్వామి వెళ్ళి కమండలాన్ని ఎత్తినా భగవాన్ కదల లేదు. భోజనం చల్లారిపోయింది. వడ్డించిన విస్తళ్ళ ముందు కూర్చున్న ఆశ్రమవాసులు అట్లానే కూర్చుని వున్నారు. చిన్నస్వామి ఇటు అటు తిరుగుతున్నాడు. ప్రొద్దెక్కిందని బిగ్గరగా అంటాడు. చెంబులు పడేసి గట్టిగా చప్పుడు చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి పనులు చెప్పుతాడు. మాధవ స్వామి కూడా వెళ్లి కమండలము ఎత్తి చూచాడు, కాని, భగవాన్ కదల్లేదు.
చివరికి గడియారం పన్నెండు కొట్టినప్పుడు విని భగవాన్ కళ్లు తెరచారు. ఎర్రగా చింత నిప్పులవలె మండిపోతున్నాయి ఆయన కళ్లు. ఆ సంగతి ఎట్లా తెలిసిందో ఆ వచ్చిన ఆయన కూడా కళ్లు తెరచాడు. అదే సమయాన మాధవ స్వామి కమండలం చేత పట్టాడు. భగవాన్ లేచారు. దొర -భగవాన్ కి సమస్కరించి లేచాడు. ఆయనని గూడా భోజనానికి ఉండమన్నారు. ఉండనని చెప్పి తలవూపి జట్కా ఎక్కి వెళ్లిపోయినారు. ఆయన వూరూ తెలీదు, పేరూ తెలీదు, మళ్ళీ యీ నాటికీ కనపడలేదు.ఆశ్రమంలో అందరూ అతనెవరో, ఎంత అదృష్టవంతుడో భగవాన్ అంత శ్రద్ధచూపి సద్యోదీక్షని ఇవ్వడానికి ఎంత పుణ్యాత్ముడో అని ఆశ్చర్యపడ్డారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment