కాశ్మీర దేశంలో ఒక పండితుడు వుండేవాడు...ధ్యానం జపం దైవారాధన , భక్తి కలిగి మంచి శీలం కలిగి పది మందికి మాట సహాయమెా లేక తనకు తోచిన సేవ చేసేవాడు...!!
కాలం అలా జరిగిపోతుా వుంది .....కాని పండితుడికి జీవితం లో ఒకనొక సమయంలో శని గ్రహ సంచారం వుందని తెలుసుకున్నాడు..!!
ఆ సమయం దగ్గర పడింది..!"
శని భగవానుడు ప్రతి మనిషి జీవితం లో కనీసం కొన్ని ఘడియలు అయినా సంచారం చేస్తాడు...అది విధాత సృష్టి చేసేటప్పుడు శనితో ఒప్పందం అది..!!
అలా ఆ పండితుడు కి శని సమీపించే ఘడియలు వస్తున్నాయి..ఇంట్లో వుంటే ఏమి జరిగి కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుంది..అది ఏ రుాపంలో వుంటుందో ఏమెుా ...అని కుటుంబానికి దుారంగా ఒక నిర్మాన్యుష్య ప్రాంతంలో ఒక చెట్టు కింద మౌనంగా కుార్చోన్నాడు...!! ఆకలి వేస్తే తినడానికి కొంత భోజనం ముాట తెచ్చుకున్నాడు..!! ఆముాట ను చెట్టు కొమ్మకి తగిలించి....ధ్యానం లో కుార్చోన్నాడు...
మనిషికి కాలం అనుకుాలించక పోయినప్పుడు మౌనంగా ధ్యానం దైవధ్యానం చేసుకోవాలి...!! సంపద ఐశ్వర్యము వున్నప్పుడు దానం చేసుకోవాలి...అనేది పెద్దలు చెప్పివున్నారు.కదా....!! అందుకే ఆపండితుడు చెట్టు కింద ధ్యానంలో శని ప్రవేశించే ఘడియల కోసం చుాస్తున్నాడు....!!
ఇంతలో ఆ దేశపు రాజ భటుల గుర్రాలు దౌడు తీస్తుా వస్తున్నాయి..!!
ఇక్కడ చెట్టు కింద మనిషి ని చెట్టు కొమ్మకి తగిలించిన సద్ది ముాటను చుాసి " అరె ఇతనే వున్నట్లు వుంది..మన రాజా వారి నగలు దొంగతనం చేసిన మనిషి....!! దొంగతనం చేసి అడవిలోని ఇలాంటి నిర్మానుష్య ప్రాంతంలో దాక్కుని కుార్చోన్నాడు.ఆ చెట్టు కొమ్మకి తగిలించిన ముాట బంగారు నగలు అయి వుంటాయి.చుాడండి...అనగానే...భటులు ముాట విప్పగానే భోజనం బదులు హారాలు నగలు దగ దగ మనే రత్నాలు వజ్రాలు కనపడ్డాయి ఆ భటులకి...!! వెంటనే ఆ పండితుడ్ని బంధించి భటులు రాజస్థానానకి తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టారు...
జరిగింది అంతా చెప్పి..ముాట విప్పి చుాసారు..అది సద్ది భోజనం ..!!
రాజు , భటులను మందలించాడు...ఏది నగలో భోజనం ముాట తెలియదా అని ప్రశ్నించాడు..కుయ్యెా మెుర్రో లేదు మహారాజ.!! మేము చుాసినప్పుడు… అవి అలానే వున్నాయి..అన్నారు...!! అంతా మౌనంగా చుాస్తున్న పండితుడు " మహారాజా!! జరిగింది నేను చెపుతాను.. అని జరిగిన విషయం మెుత్తం చెప్పాడు....!!
ఆ శని కొన్ని ఘడియలు అయినా మనల్ని పడుతుంది...అప్పుడు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ...బ్రమ కలుగుతుంది ...!! నాకు విషయం తెలిసే నేను మౌనంగా ద్యానం… చేసుకుంటున్నాను...ఆ శని వదిలిపోగానే నగల ముాట భోజనం ముాటగా మారింది..!!
శని ఆవహించినప్పుడు మనిషి సంయమనం సహనం ఓర్పు వహించాలి..!! ఆ సమయంలో మనం కొంచెం తొందర పడిన అది గొప్ప రాద్దాంతం అవుతుంది ...!! తాడు పామవతుంది....మిత్రులు శత్రువులు అవుతారు..!! కష్టాలు నిష్కారణంగా బాధిస్తాయి. మనం ఆఁ!! అన్నా అది పెద్ద తప్పు గా పరిగణించబడుతుంది . శని పట్టినప్పుడు..ఆయన అన్ని గుణపాఠాలు నేర్పుతాడు...అనుభవం జీవితం చుాపుతాడు...మనం న్యాయం గా ధర్మంగా వుంటే మనకు మంచి చేసి పొితాడు...!! అలా శని భగవానుడు సంచారం ప్రతి మనిషి జీవితాన్ని ఒక కుదుపు కుదుపుతుంది...అస్సలు శని సంచారం లేని మనిషి అంటుా ఎవరుా వుండరు...కనీసం కొన్ని ఘడియలు అయనా వుండాల్సిందే....!!
No comments:
Post a Comment