*కాఫీ విత్... యండమూరి వీరేంద్రనాథ్.2778
(ఈరోజు యండమూరి వీరేంద్రనాథ్ గారి
పుట్టిన రోజు ..)
*అక్షరాలను..లక్షలు చేసే కిటుకు తెలిసిన
కలం మాంత్రికుడు…యండమూరి.!!
*ఆయన ఆల్..ఇన్..ఒన్….!!
*రచయితే కాదు..ఆర్థిక నిపుణుడు కూడా..!!
*క్షుద్ర సాహిత్యానికి "కాద్రా.."..యండమూరి.!!.
యండమూరి వీరేంద్రనాథ్. అక్షరాల్ని లక్షలుగామార్చ
గల కిటుకు తెలిసిన కలం మాంత్రికుడు. ఆయన చెప్పే విజయానికి అయిదు మెట్లు వుండొచ్చు కానీ,
ఆయన " ఎక్కని మెట్లు లేవు. " రాయని రాతలూ లేవు.మాట్లాడని మాటల్లేవు.ఓ పక్కనవలా రచయిత
గా..ఇంకో పక్క వ్యక్తిత్వ వికాసనిపుణుడిగా యండ
మూరి అందరికీ సుపరిచితమే.అలాగే ఆయన నవలలు ఎన్నో హిట్స్ సినిమాలకు కథలయ్యాయి.
పనిలోపనిగా చిరంజీవి సినిమాకు దర్శకత్వం కూడా చేసేశాడు.అఫ్ కోర్స్..ఆ సినిమాఅట్టర్ ఫ్లాప్.అది వేరే
సంగతి. అలాగే సినిమాల్లో నటుడిగా కూడా కనిపిం
చాడు.సో…యండమూరిఅంటే..".ఆల్ ఇన్ ఒన్ ".గా ప్రూవ్ చేసుకున్నాడు.!!
*రచయితగా…!!
ఒక్క నవల చాలు లక్షల ప్రతులుఅమ్ముడు పోవడా
నికి. కథల కనికట్టు, నవలల మాయాజాలం,నాటికల చేతబడి తెలిసినవాడు. డైలాగులు, స్క్రీన్ ప్లేలతో సినిమాల్ని హిట్లు కొట్టించినవాడు. 20 సంవత్సరాల
పాటు, యండమూరి ఏంరాస్తే అది చదివారు తెలు
గు ప్రజలు ,లక్షలాది పాఠకులఆరాధ్య రచయిత...
అయ్యాడు.
యండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగం చేస్తుండ
టం వల్ల ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడి
చింది.ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రిలోనూ,
ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగ
తి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిదితరగతు
లు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చది
వాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.తన పొట్టితనం న్యూనతా అనిపించేది.దాన్లోంచే కసి ,
పట్టుదల పెరిగి గొప్ప రచయితగాఎదిగాడు.సెలబ్రిటీ హొదాను సొంతం చేసుకున్నాడు.
*కొన్ని పుస్థకాలు...
*"నల్లంచు తెల్ల చీర".
*కాసనోవ 99 ,
*తులసి దళం,
*అష్టా వక్ర
* "డేగ రెక్కల చప్పుడు"
" "ఒక వర్షాకాలపు సాయంత్రం"
*అభిలాష
*ప్రార్థన
*తులసి
*వెన్నెల్లో గోదావరి
*పర్ణశాల
*అతడే ఆమె సైన్యం
*మరణమృదంగం
*ఆఖరిపోరాటం
*రుద్రనేత్ర
*రాక్షసుడు
*లేడీస్ హాస్టల్
*అతడు ఆమె ప్రియుడు
*రాధా..కుంతి
*ఒక రాధా ఇద్దరు కృష్ణులు
*అంతర్ముఖం
*అంకితం
*సిగ్గేస్తోంది
*ఆనందో బ్రహ్మ
*డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు
*ప్రియురాలు పిలిచే
*ధ్యేయం
*ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
*స్వరం భేతాళం
*డబ్బు మైనస్ డబ్బు
*స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
*చెంగల్వ పూదండ
*రుషి
*యుగాంతం
*దుప్పట్లో మిన్నాగు
*నీకూ నాకు మధ్య
*ఆ ఒక్కటీ అడక్కు
*క్షమించు సుప్రియా
*వెన్నెల్లో ఆడపిల్ల..!!
*నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్నాడు బాలగంగాధర తిలక్.
యండమూరి ఇదే మాటతో ఓ నవల రాసి
తిలక్ మాటల్ని నిజం చేసి చూపించాడు.
తన ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఆమె ఇచ్చిన
నెల రోజుల గడువు పూర్తవడానికి సరిగ్గా 118 నిముషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దే
రటానికి రన్ వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చిం
ది హీరోకి ప్లాష్ లాంటి ఆలోచన.
ఫలితంగా..కదుల్తున్న విమానం ఆగిపోయింది. అతడికోసం మైక్ లో ప్రకటనల మీద ప్రకటనలు వినివస్తున్నాయి. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు.
మొత్తం టెలిఫోన్ డిపార్టుమెంటంతా జల్లెడ పడతా
డు. చివరి క్షణంలోనైనా ఆమె (నెంబరు) అతడికి దొరికిందా? ఆక్స్ ఫర్ట్ అమ్మాయికి చదరంగం ఛాంపి
యన్ కి జరిగిన నాజూకు పోరాటం చిరు చిరు లెక్కల గిమ్మిక్కుల నుంచి పైథాగరస్ సిద్ధాంతం వరకూ..
టెలిఫోన్ డిపార్టుమెంట్ తీరు తెన్నుల బ్యాక్ డ్రాప్ తో....క్షణక్షణం సన్నెన్స్ లో పెట్టి, పూర్తయ్యాక
ఒక మధుర భావాన్ని మనమనసులో కలకాలం నిలబెట్టే నవల ఇదిఈ నవల ఆధారంగానే శ్రీకాంత్, సాధిక హీరో హీరోయిన్లుగా హలో ఐ లవ్ యూ (1997) అనే సినిమా తెరకెక్కించారు.(సినిమా పెద్దగా ఆడలేదు.
వ్యక్తిత్వ వికాసం…!!
*విజయంలో భాగస్వామ్యం
*విజయానికి అయిదు మెట్లు
*మీరు మంచి అమ్మాయి కాదు
*విజయం వైపు పయనం
*మిమ్మల్ని మీరు గెలువగలరు
*మిమ్ముల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే
*గ్రాఫాలజీ
*మంచి ముత్యాలు
*పాపులర్ రచనలు చెయ్యడం ఎలా?
"పిల్లలు పేర్లు ప్రపంచం
*బేతాళ ప్రశ్నలు..(విద్యార్థుల కోసం)
*పడమటి కోయిల పల్లవి
*మంచు పూల వర్షం
*ఇడ్లి..ఆర్కిడ్..ఆకాశం
*చదువు.ఏకాగ్రత
*మైండ్ పవర్ నెం1అవడం ఎలా?
*తప్పు చేద్దాం రండి
*విజయానికి ఆరో మెట్టు
*విజయం రహస్యాలు
*మీమ్మల్ని మీరు గెలువగలరు
*కరోనా...ఓ కరోనా..!!
ప్రస్తుత పరిస్థితులపై యండమూరి
విశ్లేషణ*! (కరోనా నేపథ్యంలో )
కరోనా వైరస్..లాక్ డౌన్ నేపథ్యంలో యండమూరి
ఏమంటున్నారో ఆయన మాటల్లోనే వినండి.!!
“భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్చానువాదం చదవండి:
"భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నం
తా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాం
డా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయ
నకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకు
తారా? బతుకుoటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం. యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం
మీ పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషి
స్తారు.
కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.
‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.
అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొoటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.
వ్యాక్సిన్ కనుక్కోబడదు లాక్-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. *హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శ
నాలు ఉండవు*. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”"!?
*వచ్చే ఐదేళ్లలో సునామీ:..!!
ఏపీ ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ, హెచ్చరికలు చూడండి.!!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయంటారు
వీరేంద్రనాథ్.
రాబోయే ప్రమాదం తెలుసుకోకుండా....‘మన రాష్ట్ర
వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 20 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది. రాబోయే ప్రమాదాన్ని తెలు
సుకోకుండా కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ, ప్రస్తుత ప్రభు
త్వం గానీ పోటీ పడి ఈవిధానాన్నికొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఇది ఇతరరాష్ట్రాలకు పాకింది' అన్నది.... యండమూరి వ్యాఖ్యానం.
ప్రజలు పూర్తిగా పని మానేసి...ఓ‘సంపన్నుల
నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం. కానీ సంపన్నులు
డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి' అవసరం
లేదన్న' విషయం తెలుసుకున్నారు. ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం' మానేశారు. నేను ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్, మనీ లాండరింగ్ కాన్సెప్ట్‌లపై వరించాను. దీంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది. మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తంగా పొందటానికి అలవాటు పడుతున్నారు. ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95
శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వంపై ఆధారపడతారు. వారినీ తప్పు పట్టలేం. ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పన్నులు ఎక్కడ ఉంటాయి?' అన్నది యండమూరి ప్రశ్న?.
ఇలా మనుగడ కష్టసాధ్యమే..‘సరే. సోషలిజం సంగతి
పక్కన పెడదాం. మీకు తెలుసా? మనరాష్ట్రంఎఫ్ఆర్
బీఎం(ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్ష
ణ పరిమితి 3.5ను దాటింది. కానీ, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు. ఆర్ధిక క్రమశిక్ష
ణలో అధమ స్థానం ఇది. మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు. వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి. మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటంలేదు.ఇదిలాఉండగా
పెన్షన్లు 1,000 శాతo పెరిగాయి' అన్నది యండమూ
రి వివరణ.
"ఆర్థిక సునామీ తప్పదా..?
‘రూ. 50వేల కోట్లు అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్
బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది? దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింతపెరిగిపోతుంది.అప్పటి
కే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయంచెయ్య
దు. అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసేమెతుక
లకి బలి అయ్యేది మనమే. ప్రస్తుతం ప్రమాదం చాప కింద నీరులా వుంది.. అది మరో అయిదేళ్ళకి సునా
మీ అవుతుంది. మళ్ళీ చెపుతున్నాను. ఇదిరాజకీయ
ఉపన్యాసం కాదు. కేవలం ఆర్థిక రంగానికి సంబంధిం
చిందన్నది యండమూరి వీరేంద్రనాథ్ హెచ్చరిక.
*కరోనా కాలంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తల గురించి ఏమంటున్నారో చూడండి.!!
గాలి స్వఛ్ఛంగా ఉంది. మాస్క్ పెట్టుకోవాలి.
కార్లు ఖాళీగా ఉన్నాయి. మ్చ్... షికార్లు బంద
య్యాయి. మనుషులు శుభ్రంగా ఉన్నారు.
షేక్ హ్యాండ్ ఇవ్వటానికి లేదు. సమయం ఉంది. కలవటానికి జనం లేరు.ఆతిథ్యం ఇవాలని ఉంది. ఎవరూ రారు. డబ్బున్న వాళ్ళకి ఎలా ఖర్చు చేయాలో తెలియట్లేదు. డబ్బు లేనివాళ్ళకి ఎలా సంపాదించాలో తెలియట్లేదు. శత్రువు పక్కనే ఉన్నాడు. కనపడటం లేదు. అయినా పాజిటివ్‌గా బ్రతుకుదాం. టెస్టులు నెగెటివ్ వచ్చేలా జీవిద్దాం. !!
*ద్వైతo-అద్వైతం…!!
ద్వైతo-అద్వైతం మధ్య తేడా గురించి సింపుల్
గా అర్థమయ్యేలా చెప్పమని అడుగుతారు చాలా
మంది. కరోనా సమయంలో తాత్విక చింతన ఎందుకనుకోకపోతే- “జీవుడితో సహా, ఈయావత్
సృష్టికి మూల కారకుడు దేవుడు. అజ్ఞానం వల్ల ‘నాది’ అనే కోరిక; దాని వల్ల దుఃఖo కలుగు
తుంది” అంటుంది ద్వైతం. మనిషి కూడా దైవసృష్టియే అయినప్పుడు, జీవుడిలో ఇంత అజ్ఞానం ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తే వెలుగు
లేని చోట చీకటి ఉన్నట్లుగాఅజ్ఞానంఅనాది
గా ఉన్నది. దాని పుట్టుక ఎవరూ ఎరుగరు.
అది మాయ” అని చెప్పేది మధ్వాచార్యుల వారి ద్వైతం.
“జీవుడు-దేవుడు వేర్వేరు కాదు. సముద్రంలో
అల ‘నేను వేరు, సముద్రం వేరు’ అనుకుంటే
ఎలా ఉంటుందో..భగవంతుడు, మనం వేర్వేరు’ అనుకోవడం అలాగే ఉంటుంది. ‘నేను’ అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, మన దృష్టి అంతా... మన దేహ, మనో, బుద్ధులపైనే ఉంటుంది తప్ప, స్వయం ప్రకాశకమైన ఆత్మపై ఉండదు. ఎన్నో జన్మ
ల నుంచి ఉన్న అజ్ఞానం వల్ల, శాస్త్రం తెలిసినవారు కూడా... ‘దేవుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ని’ అని నమ్ముతూ, సుఖ సంతోషాల కోసం, దుఃఖ నివారణ కోసం భగవంతుణ్ని ప్రార్థిస్తారు.” అని చెప్పేది శoకరా
చార్యుల వారి అద్వైతo. ఇంకా సులభంగా అర్థమ
య్యే రీతిలో ఎవరైనా వివరిస్తే వారికి స్వాగతం." అంటాడు యండమూరి.
యండమూరి...అక్షరానికి బ్రాండ్ అంబాసిడర్.
ఈ మధ్య సొంత ఓవిద్యాసంస్థపై దృష్టిపెట్టారు.
సామాజిక సేవలో తరిస్తున్నారు…!!
అద్ది బెస్ట్ ..మిస్టర్ యండమూరి వీరేంద్రనాథ్ గారు...!!
*✏️ఎ.రజాహుస్సేన్ !!
No comments:
Post a Comment