Thursday, November 20, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

     ఒకసారి ఆశ్రమ సర్వాధికారికి, ఒక భక్తుడికి ఎదో ఒక చిన్నపాటి మనస్పర్థ వచ్చింది. దిగులుతో అతను రాత్రి భోజనం చెయ్యలేదు. తెల్లవారే సరికి అతనికి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో ఉండటానికి అతనికి కష్టముగా ఉన్నది. తెల్లవారు జామున మహర్షి ఇడ్లీ చేస్తున్నారు. అతను వెళ్ళి మహర్షికి నమస్కరించారు. 

                 మహర్షి :
        ఏమిటి సమాచారం? 

                 భక్తుడు :
     తిరువణ్ణామలై టవునుకు వెళతాను.

                 మహర్షి :
                 ఎందుకు?

                 భక్తుడు :
 పిల్లలు ట్యూషన్ కోసం కాచుకొని ఉంటారు.

                  మహర్షి :
   "తెలుసు. నాకు తెలుసు నీ దొంగతనం. ఆదివారం రోజు నీకు ట్యూషన్ ఏమిటీ? ఎవరికి చెబుతావు? మధ్యాహ్నం భోజనం కోసం ఉల్లిపాయ సాంబారు చేశాను. ఇప్పుడే నీకు వేసి పెడతాను. రా! తిను! పద! కూర్చో."
   
  అని అంటూ మహర్షి తొందరగా విస్తళ్ళు వేశారు. మహర్షి కూడా అతనితో పాటు పక్కన కూర్చుని, అతను దిగులు మరచిపోయేటట్టు ఎన్నో కబుర్లు చెప్పి, నవ్వించి, కరుణ చూపారు మహర్షి.

No comments:

Post a Comment