ప్రేమ కోసం 5 నిమిషాలు | 5 Minutes For Love | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h_zEs348H-U
Transcript:
(00:03) [సంగీతం] మీరు ప్రేమ అంటున్నది ప్రాథమికంగా మీ భావోద్వేగాల మాధుర్యమే మీరు ఇక్కడ కూర్చుని ఇక్కడ లేని వారిపై కూడా ప్రేమను అనుభూతి చెందగలరు. కాబట్టి దీనికి వేరే వారితో సంబంధం [సంగీతం] లేదు. ఇది కేవలం మీ భావోద్వేగాల మాధుర్యమే ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారం ప్రేమించగల మీ సామర్థ్యం సెల్ఫ్ స్టార్ట్ లో ఉందా లేదా పుష్ స్టార్ట్ లో ఉందా? మనిషి తన సొంత స్వభావం పట్ల మరింత ఎరుక పొందే కొద్దీ తనకి ఇది అర్థమవుతుంది.
(00:46) ప్రేమను అనుభూతి చెందడానికి ఆనందాన్ని అనుభూతి చెందడానికి పారవస్యాన్ని అనుభూతి చెందడానికి జీవితంలోని అత్యున్నత ఆనందాలను అనుభూతి చెందడానికి సైతం నిజానికి ఎవరూ అవసరం లేదని మీరు ఇలా ఇక్కడ కూర్చుని దాన్ని మీలోనే జరిగేలా చేసుకోగలరు ఎందుకంటే ఇది మీ శరీరం మీ మనసు మీ భావోద్వేగం మీ రసాయన ప్రక్రియ మీ జీవితంలోని అనుభవాలన్నింటిని సృష్టిస్తున్నది మీరే ప్రజలకు దీని పట్ల స్పృహ లేదు మీ జీవితాన్ని సృష్టిస్తున్నది మీరేనని మీ జీవితాన్ని మీకు కావలసినట్టుగా నడుపుకుంటుంది మీరేనని కాబట్టి చాలామంది ఇప్పటికీ తమ చుట్టూ ఉన్న వ్యక్తులు పరిస్థితులే తమ అనుభవాలను
(01:25) నిర్దేశిస్తున్నారు ఆయన నమ్ముతారు కానీ అది నిజం కాదు. మానవ అనుభవాలు 100 శాతం స్వయంగా సృష్టించుకున్నవేనూటికి 100 శాతం ఇవి స్వయంగా సృష్టించుకున్నవే అయితే సహజంగానే మీరు మాధుర్యాన్ని ఎంచుకుంటారా? లేదా మీ మనసులో మీ శరీరంలో మీ భావోద్వేగాల్లో మీ శక్తుల్లో లేక ఏదైనా చేదుగా కావాలనుకుంటారా? మాధుర్యాన్నే కాబట్టి సహజంగానే ప్రేమతో ఉంటారు.
(01:55) దీనికి ఎవరి అవసరము లేదు. సంబంధం అన్నప్పుడు స్త్రీ పురుషులు అన్నప్పుడు మీరు సంబంధం గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే అందులో ఇతర పార్శ్వాలు ఉంటాయి. దానికి ఒక సామాజిక కోణం ఉండొచ్చు భౌతిక కోణం ఉండొచ్చు. దానికి ఒక మానసిక కోణం ఉండొచ్చు. దానికి ఆర్థిక కోణం కూడా ఉండొచ్చు. ఒక సంబంధంలో తీర్చుకోవలసిన అవసరాలు ఎన్నో ఉంటాయి. జీవితంలో ఎంతో మంది వ్యక్తులతో మనం సంబంధాలు ఏర్పరచుకుంటాం.
(02:19) వ్యాపార సంబంధాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి వృత్తిపరమైన సంబంధాలు ఉంటాయి. కాబట్టి రకరకాల అవసరాలను తీర్చుకోవడానికే మనం సంబంధాలను ఏర్పరచుకుంటాం లేదా వేరే వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఏదైనా సరే అదిఒక సంబంధం కానీ మీరు ప్రేమ అంటున్నది కేవలం మీ భావోద్వేగాల మాధుర్యం ఆ మాధుర్యాన్ని మీలో రగిలించడానికి మీరు వేరొక వ్యక్తిని వాడుకోవచ్చు.
(02:45) లేదా స్వయంగా మొదలయ్యే యంత్రాంగంలా ఉండొచ్చు. చూడండి మనిషికి ప్రేమ అవసరం ఏమిటి? మనిషి నిరంతరం తాను ఉన్నదానికన్నా [సంగీతం] ఇంకొంచెం ఎదగాలని తపన పడుతూ ఉంటాడు.టబసంథింగ్మోదన్వాట్ the are rightన ఇక్కడ విషయం ఏమిటంటే మీరు కానిదాన్ని మీలో కలుపుకోవాలని అనుకుంటుంటారు [సంగీతం] మొత్తం ప్రయత్నం ఇదే మీ భావోద్వేగ స్థాయిలో దీన్ని ప్రయత్నిస్తే దాన్ని ప్రేమ వ్యవహారం అంటాం.
(03:22) మీరు [సంగీతం] కాని దాన్ని మీలో ఒక భాగంగా చేసుకోవాలని ఎమోషనల్ గా ప్రయత్నిస్తున్నారు. ఇదే ప్రేమ వ్యవహారం. [సంగీతం] ఇదే మీరు ఎరుకతో చేస్తే దాన్ని యోగ అంటాం. యోగ అంటే కలయక. ప్రేమ [సంగీతం] ఒక సంబంధం కాదు. ప్రేమ అనేది మీ భావోద్వేగాల్లోని ఒక రకమైన మాధుర్యం మీరు ఒక చెట్టును చూసినా కుక్కను చూసినా పురుషున్నని స్త్రీని లేదా బిడ్డను [సంగీతం] లేదా కేవలం ఆకాశాన్ని చూసినా దాన్ని ప్రేమగా ఎందుకు చూడలేరు ఇది ఆకాశాన్ని ప్రేమించడం గురించి కాదు ఇది మీ భావోద్వేగాల మాధుర్యం గురించి సుముఖత ఉంటే మీరు ప్రేమగా మారగలరు. మీ భావోద్వేగాలను
(04:00) చాలా మధురంగా మార్చుకోగలరు. [సంగీతం] ప్రేమ అనేది మీరు చేసే పని కాదు అది మీరు అవ్వగలిగేది. [సంగీతం] ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు మీకు అస్సలు సంబంధం లేని ఏదో ఒక దానితో కూర్చోండి. అది ఒక చెట్టు కావచ్చు రాయి కావచ్చు, పురుగు కావచ్చు, కీటకం కావచ్చు.ఆఫ్టర్సటైయు ఆఫ్టర్సటైయు విల్ఫైండ్ యు కెన్ lookక్అన్ఇట్ కొంతసేపటి తర్వాత మీరు దాన్ని మీ భార్యను [సంగీతం] భర్తను మీ అమ్మను మీ బిడ్డను మీ కుక్కనో చూసినంత ప్రేమతో చూడగలుగుతారు.
(04:43) ఈ విషయం ఆ పురుగుకు తెలియకపోవచ్చు ఆ కీటకానికి తెలియకపోవచ్చు [సంగీతం] కానీ అది అప్రస్తుతం మీరు అన్నింటిని ప్రేమగా [సంగీతం] చూడగలిగితే మీకు ఈ ప్రపంచం అంతా అందంగా మారడం గమనిస్తారు. ప్రేమ అంటే మీరు చేసేది కాదని మీరు ఉండే తీరని [సంగీతం] గ్రహిస్తారు. [సంగీతం] మీ రెండు చేతులను జోడించడంలో ద్వంద్వాలైన మీ ఇష్టాలు ఇంకా అయిష్టాలు మీ వ్యామోహాలు ఇంకా విరక్తులు సమతుల్యం అవుతాయి.
(05:24) ఇంకా మీరు ఎవరన్న అనుభూతిలో ఒక రకమైన ఐక్యత ఉంటుంది.
No comments:
Post a Comment