నిజంగా మగాడి మంచితనానికి.. స్త్రీ ఇచ్చే విలువ ఇదేనా? 💔| మగాడి మౌనం ఆడదానికి అలుసా? | Feel Unvalued?
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vhz7VeERBtc
Transcript:
(00:01) ఒక మగాడు పదే పదే సర్దుకు పోతున్నాడంటే అతను చేతకానివాడు అనుకుంటున్నారా [సంగీతం] లేదా మౌనంగా ఉన్నాడంటే అతనికి కోపం రాదు అనుకుంటున్నారా లేదు [సంగీతం] మీరు పొరబడుతున్నారు. మీరు చూపిస్తున్న ఆ అలుసు రేపు ఒక పెద్ద నిశ్శబ్దానికి దారి తీస్తుంది. మగాడి మంచితనాన్ని అలుసుగా [సంగీతం] తీసుకుంటే చివరికి నష్టపోయేది ఆ స్త్రీనే ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనుకుంటాం కానీ కొన్నిసార్లు అర్థం చేసుకోవడమే సమస్యగా మారుతుంది.
(00:44) ఒక మగాడు తన ఇంట్లో ప్రశాంతత కోసమో లేదా తనతో ఉన్న స్త్రీ మీద అమితమైన ప్రేమ వల్లనో తను పడే కష్టాన్ని దాచుకొని వాళ్ళు చేసే తప్పులను మౌనంగా భరిస్తూ ఉంటాడు. ఆ మౌనం వెనక ఎంత బాధ ఉంటుందో ఎన్ని త్యాగాలు ఉంటాయో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఇక్కడే అసలైన [సంగీతం] సమస్య మొదలవుతుంది. కొంతమంది స్త్రీలు ఆ మగాడి మౌనాన్ని చూసి అది [సంగీతం] మంచితనం అని గుర్తించాల్సింది పోయి వీడికి ఏమి తెలియదు అని [సంగీతం] అలుసుగా తీసుకోవడం మొదలు పెడతారు.
(01:26) మగాడి మౌనం ఆడదానికి అలుసా లేదా మంచితనానికి ఇచ్చే విలువ ఇంతేనా అనిపించేలా ప్రవర్తిస్తారు. మగాడిచ్చే గౌరవాన్ని అతని బలహీనతగా అతను చూపే ప్రేమను అసమర్థతగా మార్చేస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి లోకంలో అందరు స్త్రీలు ఇలా ఉండరు. ఎంతో మంది స్త్రీలు మగాడి కష్టాన్ని గుర్తించి [సంగీతం] అతనికి వెన్నెముకలా నిలబడతారు.
(01:58) కానీ కొందరు మాత్రం తన స్వార్థం కోసం తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎదుటివారి మంచితనాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారు. మగాడు ప్రేమతో ఇచ్చే స్వేచ్ఛను వాళ్ళు [సంగీతం] అతన్ని తక్కువ చేయడానికి వాడుకుంటారు. ఒక మగాడు పదే పదే క్షమిస్తున్నాడు అంటే దాని అర్థం అతనికి కోపం రాదని కాదు ఆ కోపం కంటే ఆ స్త్రీతో ఉన్న బంధం ముఖ్యమని నమ్ముతున్నాడు కాబట్టే [సంగీతం] కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఎదుటివారి ఎమోషన్స్ తో ఆడుకోవడం మొదలు పెట్టినప్పుడు ఆ మంచితనం మెల్లగా అలసటగా మారుతుంది.
(02:45) మగాడి సహనం ఒకనాడు నిశశబ్దమైన ఆవేదనగా మారిపోతుంది. అప్పుడు అతనికి అనిపిస్తుంది. అతిగా ప్రేమించడం [సంగీతం] అవతలి వారి కోసం నన్ను నేను చంపుకోవడం నిజంగా మంచితనమేనా అని ఒక్కటి గుర్తుంచుకోండి [సంగీతం] స్త్రీ అయినా పురుషుడైనా బంధంలో మంచితనం అనేది ఒక బలం కావాలే కానీ దోపిడికి గురయ్యే వస్తువు కాకూడదు. నీ గౌరవాన్ని దెబ్బతీసే చోట నీ మంచితనాన్ని వెనక్కి [సంగీతం] తీసుకోవడం తప్పేమీ కాదు అది నీ ఆత్మరక్షణ గుర్తుంచుకోండి అందరూ స్త్రీలు [సంగీతం] మాత్రం ఇలా ఉండరు కొంతమంది మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు.
(03:31) మంచోడిగా ఉండు కానీ ఎదుటివారు నిన్ను వాడుకునేంత [సంగీతం] అమాయకపు మంచోడిగా మాత్రం ఉండకు. స్త్రీ మనసులో నీకు స్థానం కావాలంటే [సంగీతం] ఆమెకు నువ్వు ఒక సపోర్ట్ మాత్రమే కాదు మెంటలీ స్ట్రాంగ్ పర్సనాలిటీలా [సంగీతం] కనిపించాలి. మంచితనం ఉండాలే కానీ అది నీ ఆత్మగౌరవాన్ని బలిచ్చేలా ఉండకూడదు. ఎందుకంటే మంచితనానికి [సంగీతం] గౌరవం లేని చోట మౌనానికి విలువ లేని చోట [సంగీతం] నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే నీ మంచితనం నీ విలువ [సంగీతం] తెలిసిన వారి దగ్గరే నీ ప్రేమకు ఒక అర్థం ఉంటుంది.
(04:16) కానీ ఒక్క విషయం గమనించాలి మగాడి మంచితనాన్ని [సంగీతం] అలుసుగా చూసే అలవాటు కొంతమంది స్త్రీలకు మాత్రమే ఉంటుంది. వీడియో నచ్చితే [సంగీతం] లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ [సంగీతం] ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment