Monday, May 4, 2026

క్షమించడంలో ఉన్న అసలైన పవర్ ఏంటి? | Revenge Vs Forgiveness | Ramaraju mahanthi | PMC Yatra

క్షమించడంలో ఉన్న అసలైన పవర్ ఏంటి? | Revenge Vs Forgiveness | Ramaraju mahanthi | PMC Yatra

Author Name:PMC YATRA

Youtube Channel Url:https://www.youtube.com/@PMCYATRA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OTWjq_1LDlU



Transcript:
(00:04) [సంగీతం] [సంగీతం] హలో మాస్టర్స్ చాలా రోజుల నుంచి కామెంట్ రూపంలో చాలా మంది మాస్టర్స్ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు తెలుసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే సార్ కొంతమంది దుఃఖాన్ని ఇచ్చి కొంగదీసి ఏడిపించి వాళ్ళు రాత్రి [సంగీతం] ఎలా నిద్రపోతారు నిజంగా వాళ్లో హృదయం అనేది ఉండదా వారిలో ఒక ఆత్మ అనేది ఉండదా తాము ఒకరి పట్ల అన్యాయం చేసి వాళ్ళు ఎలా నిద్రపోగలుగుతున్నారు అంత ప్రశాంతంగా సో వాళ్ళ మీద మాకు ఒక ఇరిటేషన్ వచ్చి
(00:52) ఒకోసారి ప్రతికారం తీర్చుకోవాలా వచ్చా అసలు ప్రతికారం కరెక్టా కాదా యస్ ఏ ఒక మాస్టర్ గా మీరేం సమాధానం చెప్తారని చాలా రోజుల నుంచి కామెంట్ రూపంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం బట్ ఈ ప్రశ్న మాలో ఇదే ఇలాగే ఉండిపోయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని నాకు అడుగుతున్న ప్రశ్నకి నాకు తెలిసిన నేను నేర్చుకున్నటువంటి మాస్టర్ శాఖ అనుభవాల అన్ని జత చేసి నాకు తెలిసిన నాకు అర్థమైంది నేను ఇంప్లిమెంట్ చేసింది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను.
(01:21) ఫ్రెండ్స్ ఈ ప్రశ్న ఒక ప్రశ్నే కాదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆర్తనార్థం మన లోపల ప్రతిధ్వనించి మనలో ఉన్నటువంటి ప్రతిధ్వనిస్తూ ఉండే ఒక కేక ఒక దీవజ్యమైన కేక అని చెప్పొచ్చు ఎవరైనా వ్యక్తి మీ నమ్మకాన్ని [సంగీతం] వమ్ము చేసినప్పుడు ఎవరైనా మీ భావాలతో ఆడుకున్నప్పుడు ఎవరైనా మీ మంచితనాన్ని తన స్వార్థానికి వాడుకున్నప్పుడు ఎవరైనా మీకు కారణం లేకుండానే బాధ కలిగించినప్పుడు అప్పుడు ఈ ప్రశ్న మనలో తల్లెత్తుతుంది.
(01:56) నిజంగా వాళ్ళకి అర్థం కాదా అని అవునా కాదా సో ఈరోజు దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక మనిషి బాధలు ఉన్నప్పుడు అతనికి అన్యాయం జరిగినప్పుడు అతని మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయి కదా మొదటి ఆలోచన ఏంటి ముందు తనకు జరిగింది నిజం కాదని ఏదో పొరపాటున జరిగిందని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తను తాను రియలైజ్ అవుతాడో ఇది నిజం కాదు అప్పుడు తను ఇంకో మెట్టు ఎక్కుతాడు రెండో ఆలోచన వస్తుంది అదే కొంచెం వేదన కలిగిస్తాడు.
(02:30) వేదన అనిపిస్తుంది హృదయంలో నరనరాల్లో పాకే ఒక లోతైన అంతర్గత వేదన కలుగుతుంది. నిజంగా ఇలా జరగకుండకూడదు అలా చేసి ఉండకూడదు. అది ఏం చేస్తుందంటే రాత్రి పట్టు నిద్రపోనివ్వదు తిండి తిననివ్వదు రుచి కూడా తెలియనివ్వదు లోకంలో ప్రతి సంతోషాన్ని వెలబెలబోయేలా చేస్తుంది. ఆ తర్వాత దీని తర్వాత మూడో మెట్టు కొంచెం అలా పడిన తర్వాత అదే ప్రతికారం అంటారు అది మూడో స్టేజ్ అతను నా పట్ల ఇలా చేశాడా నేను కూడా అతనిగా అలాగే చేయాలని మనసు చెప్తుంది.
(03:04) అతను నాకు ఎంత బాధ కలిగించాడో దాన్ని రెట్టింపు బాధన అతనికి కలిగిస్తానని ఒక మనసు రగిలిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఏడవాలి వెలవెలలాడాలి అప్పుడే తను నా పట్ల ఏం చేశడో అతనికి అర్థంవుతుంది అని అనుకుంటాడు. ఈ ఆలోచన చాలా శక్తివంతంగా ఉంటుంది. అవతల వ్యక్తికి ఎలాగైనా బుద్ధి రావాలంటే ఏం చేయాలి అని పదకాలు వేస్తూ ఉంటాడు. పగ తీర్చుకుంటూనే అంతా సద్దుకు [సంగీతం] పోతుందని ఒక భ్రమలో ఉంటాడు.
(03:35) ఒక్కొక్కసారి అవతలి వ్యక్తికి బుద్ధి చెప్తేనే నా బాధ పోతుందని అతను అనుకుంటాడు అతను ఏడవాలి అనుకుంటాడు అతనికి శాంతి పూర్తిగా నశించాలని కోరుకుంటాడు. కానీ ఒక్క నిమిషం ఆగి అక్కడ ఆగి స్తబ్దతగా ఆలోచించండి ఇక్కడే మనం ఆలోచించాలి కూడా ఇంత శక్తివంతంగా అనిపించే ఈ ప్రతికార భావన నిజంగా అది వాగ్దానం చేసినట్టుగా [సంగీతం] నిజంగా ఫలితాన్ని ఇస్తదా కానీ ఇక్కడే మనం లోతుగా అర్థం చేసుకోవాలి.
(04:08) పగ తీర్చుకోవడం వల్ల నిజంగా శాంతి లభిస్తుందా? ఎవరికైనా బాధ కలిగించడం వల్ల మన బాధ తగ్గుతుందా ఎవరినైనా ఏడిపించడం వల్ల మన కన్నీళ్లు ఆగిపోతాయా అవతలవాడు దుఃఖం కలిగితే మనకి సంతోషం వస్తుందా? ఒక్కసారి దీని లోతుగా ఇంకా కొంచెం డీప్ గా వెళ్దాం. ప్రతికారం అనేది ఒక మంట లాంటిది. దాన్ని మీరు ఎదుటి వారికి కాల్చడానికి మీ చేతిలోకి తీసుకుంటారు కానీ అన్నిటికంటే ముందు ఆ మంట మన చేతినే కాలుస్తుంది.
(04:39) హవతోడు గురించి సెకండరీ ఇష్యూ మీరు ఆ మంటను పట్టుకొని ఉన్నంత సేపు మీరు కాలుతూనే ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా జరుగుతుందో లేదో కానీ మన చేతుల్లో మాత్రం ఖచ్చితంగా కాలుతాయి మాస్టర్స్ అందులో డౌటే లేదు దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ ప్రతికార భావన అనేది మీరు ఎదుటి వారి కోసం తయారు చేసే విషం లాంటిది కానీ దానిని మీరే తాగుతారు ఆ విషం ఎదుటి వారిని చంపుతుందని మీరు అనుకుంటారు కానీ ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ నర నరాల్లో పాగుతుంది మ హృదయాన్ని బలహీన పరుస్తుంది మరి చివట చిట్ట చివరికి మీ ఆత్మను ఒక వ్యాధి అదిగ్రస్తం చేస్తుంది.
(05:18) ప్రతికారం సమస్యను మరింత పెద్దది చేస్తుంది. ప్రతికారం చీకట్ిలో మరింత చీకటి నింపుతుంది మీ జీవితంలో గదిని చీకటిగా ఉన్నప్పుడు దానికి విరుగుడు మరింత చీకటి తేవడం కాదు దానికి పరిష్కారం దీపాన్ని వెలిగించడం వెలుగును తీసుకొని రావడం కాబట్టి పగ తీర్చుకోవడం అనేది చీకటి గదిలో కిటుకలు మూసేసి ఇప్పుడు చీకటి ఇంకా గాఢం కావాలని కోరుకున్నట్లు ఉంటుంది మాస్టర్స్ ఆలోచించండి మనం పురోగమనం చెందుతున్నామా తిరోగమనం చెందుతున్నామా? మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఇప్పుడు మీరు అడగొచ్చు
(06:02) సర్ మరి ఏం చేయాలి పగ తీర్చుకోకూడదంటే నిశబ్దంగా కూర్చోవాలా లేదా ఆడు చేస్తుంటే మనం భరిస్తూ ఉండాలా ఏమి అనకూడదా అన్యాయాన్ని ఎప్పుడూ సహిస్తూనే ఉండాలా జరిగిన చెడును మర్చిపోవాలా ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి కదా మీకు అనిపిస్తుంది కదు వీటి సమాధానాలు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్ ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం.
(06:33) ఒక ఉదాహరణ చూద్దాం ఒక చెరువులో ఒక రాయి వేశరనుకోండి ఏమవుతుంది నీటి అలలు అలా వ్యాపించి వ్యాపించి గట్టు వరకు వెళ్లి మళ్ళీ తిరిగి రాయినే చేరుకుంటుంది. ఎక్కడైతే రాయి పడిందో అక్కడి వరకు వస్తుంది కదా అదే దిశలో తిరిగి వస్తుంది. సేమ్ అట్లాంటిదే మాస్టర్స్ ప్రకృతి యొక్క నియమం ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది.
(07:03) ఆ ఫలితం చివరికి ఆ కర్మ చేసిన వ్యక్తికే చేరుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది సృష్టిలో కర్మఫలం ఎలా ఉంటుంది అనేది నేచర్ యొక్క ధర్మం ఎలా [సంగీతం] ఉంటుందో ఇది చేస్తుంది. ఇప్పుడు చూద్దాం మాట్లాడదాం. కర్మఫలం వెంటనే లభించదు మాస్టర్స్ ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇమ్మీడియట్ గా మీరు ఫీల్ అవుతున్నారు కదా ఇమ్మీడియట్ గా వాడి ఎఫెక్ట్ రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు.
(07:30) ఎందుకంటే సృష్టిలో మీరు ఒక విత్తనం నాటినప్పుడు మరుసటి రోజు అది చెట్టుగా మారిపోయి అది ఫలాని ఇచ్చేయాలని మీరు కోరుకుంటే అది విరుద్ధం కదు దానికి కొంత సమయం కావాలి. దానికి కొంచెం నీరు ఎండ గాలి తగలాలి అన్నిటికంటే ముఖ్యంగా సమయం సమయం కావాలి మాస్టర్స్ కొన్ని విత్తనాలు కొన్ని వారాల్లో మలుకెత్తాయి మరి కొన్ని విత్తనాలు ఏలుబడొచ్చు. అది తప్పకుండా మొలుకైతే తీరుతాయి నో డౌట్ శాశ్వతంగా భూమిలో దాగదు ఇది సృష్టి నియమం కాదు కదా ఏదో ఒక రోజు అది బయటికి రావాల్సిందే సరిగ్గా అలాగే మన కర్మఫలం కూడా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అంది తీరుతుంది మాస్టర్స్ బహుశా ఈరోజు
(08:08) కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు ఏడాది కూడా పట్టొచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అది వచ్చినప్పుడు పూర్తిగా వస్తుంది కొన్నిసార్లు వడ్డీతో సహా ఇస్తుంది అందులో డౌటే లేదు ఇదే ప్రకృతి యొక్క నియమం ఇది అందరికీ గుడ్డోడికైనా మంచోడికైనా చెడ్డోడికైనా ధనికుడికైనా రాజకీయ నాయకుడికైనా భేదభావం దానికి తెలియదు అది ఇచ్చి తీరుతుంది.
(08:36) అది దాని దృష్టిలో అందరూ సమానమే నేను ఒకప్పుడు ఉన్న స్థాయిలో ఉన్న చాలా మందిని చూశాను. చాలా శక్తివంతులు ఉండేవారు చాలా ధనవంతులు వారితో ఇతరులకు ఎంతో దుఃఖాన్ని ఇచ్చారు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. తమని తాము ఎవరు ఏం చేయలేరని తమను చేసిందే రాజ్యం అని తమ అంతా ఒకే అనుకొని తమదే నియమం అనుకని చాలా చాలా జరిగింది కానీ కాలం మలుపు తిరిగింది మరింత మారిపోయింది.
(09:05) ఒకప్పుడు అందరికంటే పైనన్న వ్యక్తి ఒకరోజు అందరికంటే కిందకు పడిపోయాడు. ఇది మనం చేసింది కాదు ఎవరికి వాళ్లే యమునా తీరే ఎవరి ముందు లోకం చేతులు జోడించేదో అదే వ్యక్తి [సంగీతం] రోజు ఈరోజు ఈ లోకం ముందు చేతులు జోడించాల్సి వస్తుంది. ఇది దాని కర్మఫలం అంటే ఇది ఆలస్యంగా [సంగీతం] వస్తుంది కానీ వచ్చినప్పుడు ఎంత భారంగా ఉంటుంది అంటే దాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది.
(09:32) కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ కర్మాస్ అందుకే మీతో చెడు చేసిన వ్యక్తికి ఏం కావడం లేదని ఎప్పుడైనా మీ మనసులో ఒక ఆలోచన వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి కర్మచక్రం నెమ్మదిగా తిరుగుతుంది కానీ ఆగదు. నీరు మెల్లమెల్లగా ప్రవహిస్తుంది కానీ రాయిని కూడా అరగతీస్తుంది మాస్టర్స్ కాలం నెమ్మదిగా నడుస్తుంది కానీ అతి పెద్ద సామ్రాజ్యాలను సైతం తుడిచి పెట్టేస్తుంది.
(10:02) కర్మ కూడా నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ అది పని చేయడం మొదలు పెట్టినప్పుడు దాని నుండి తప్పించుకున్న వారు ఎవ్వరూ లేరు. అవునా కదా ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. మనం ప్రతికారం గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాం మనకి దుఃఖాన్ని కలిగించిన ఆ వ్యక్తి మెదల్లో చోటి ఇస్తున్నాం మన మెదడులో వాడికి చోటు ఇస్తున్నాం.
(10:34) మనం అతని గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా అతనికి వ్యతిరేకంగా పథకాలు వేస్తాం. అతని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని గాయపరిచాడో అతను ఇప్పటికీ మీ జీవితంలో ఒక భాగమై లోపల తిష్ట వేసుకొని కూర్చున్నాడు. తిష్ట వేసి కూర్చోవడం కాదు శాసిస్తున్నాడు నా గురించి ఆలోచించుకోమని మీరు అంత బలహీన పడ్డారు గుర్తుంచుకోండి బహుశా అతను మన గురించి ఆలోచించడం కూడా మానేసి ఉండవచ్చు.
(11:08) కానీ మనం మాత్రం పగ ప్రతికారం అని రాత్రి పగలు తడా లేకుండా ఎంత విచిత్రమైన విషయం తెలుసు కదా మనం ఆలోచిస్తూనే కూర్చుంటాం. ఇందులో పోగొట్టుకుంది వాడా మీరా మీ ప్రశాంత పోగొట్టుకుంది వాడా మీరా మీకు బాధ కలిగించిన వ్యక్తి తన జీవితాన్ని తాను హ్యాపీగా గడుపుతున్నాడు. అతని పని అతను చేసుకుంటున్నాడు. తింటున్నాడు నిద్రపోతున్నాడు కానీ మీరు అతని గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి [సంగీతం] మీ నిద్రను పోగొట్టుకుంటున్నారు మీ ఆకలిని కూడా చంపుకుంటున్నారు.
(11:40) మీ సంతోషాన్ని కోల్పోతున్నారు. అంటే నిజానికి ఎవరికి నష్టం [సంగీతం] జరుగుతోంది అతనికా లేక మీకా మీరు అతనికి శిక్ష వేయాలని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. మీరు అతన్ని బంధించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మీరే బందీగా ఉన్నారు. అతని జ్ఞాపకాల్లో అతని చెరల్లో ఆ నొప్పి యొక్క చరల్లో ఆ కోపం యొక్క చరల్లో మీరే బందిగా ఉన్నారు.
(12:10) అవునా కాదా ప్రతికారం తీర్చుకోవడం అంటే ఆ వ్యక్తిని మీరు క్షమించేశరని అర్థం కాదు క్షమించడం వేరు ప్రతికారం తీర్చుకోవడం వేరు ఈ రెండు వేరు వేరు విషయాలు క్షమాపణ అనేది ఒక ప్రక్రియ దానికి సమయం పడుతుంది. కానీ ప్రతికారం తీర్చుకోకూడదు అనేది ఒక నిర్ణయం ఆ నిర్ణయాన్ని మీరు ఇప్పుడే తెలుసుకోగలరు. ఈ నిర్ణయం ఆ వ్యక్తి కోసం కాదు మీకోసం ఆ వ్యక్తి ప్రతికారాన్ని తగడనని కాదు అతను మీ గురించి ఆలోచించడానికి లేదా మీ సమయానికి తగడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని మీకు నేను చెప్పటం లేదు మీ సమయం ఎంతో విలువైనది కాబట్టి మీ శక్తి ఎంతో విలువైనది మీ జీవితం ఎంతో
(12:55) విలువైనది దీనిని ఎవ్వరి కోసమో వృధా చేయకండి మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించండి మాస్టర్స్ ఇది చాలా చాలా చాలా విలువైన విషయం. మీ జీవితం ఎవరి కోసమో పుట్టలేదు. మీకోసం అతని యొక్క ప్రతికారం తీర్చుకోవాలని కాంక్షతో [సంగీతం] మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోతున్నారు. అన్నిటికన్నా విలువని సమయం ఈ అద్భుతమైన ఒక మాట ఉంది మాస్టర్స్ ప్రవహించి వెళ్ళిపోయిన నీరు ఎప్పుడు తిరిగిరాదు.
(13:30) నది ఎప్పుడు వెనక్కి ప్రవహించదు. అది ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ప్రవహిస్తూనే చివరికి సముద్రాన్ని చేరుకుంటుంది. నది గనుక పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఎక్కడ రాళ్లుు ఉన్నాయి ఎక్కడ గుట్టలు ఉన్నాయి ఎక్కడ దారి కష్టంగా ఉంది ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అది ముందుకు సాగగలదా సముద్రాన్ని చేరగలదా కానీ నదికి ఇప్పుడు వెనక్కి చూడదే కాబట్టి అది సముద్రాన్ని చేరుకుంటుంది.
(13:58) అది కేవలం ప్రవహిస్తూ వెళ్తూనే ఉంటుంది. ప్రతి రాయిని దాడుతూ వెళ్తూనే ఉంది ప్రతి మలుపు గుండా సాగుతుంటుంది చివరికి సముద్రంలో కలిసిపోతున్నాయి. మనం కూడా నదిలాగా ఉండాలి మాస్టర్స్ ప్రవహిస్తూనే ఉండాలి ముందుకు సాగిపోతూనే ఉండాలి గడిచిపోయిన దానిని గడిచిపోనివ్వండి జరిగిన దాన్ని జరగనివ్వండి మీ శక్తిని మాత్రం ముందుకు సాగనింపండి వెనక్కి చూడడానికి కాదు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పినంత సులభం కాదు ఆచరించడం అంతకన్నా తేలిగ కాదు ఈ విషయం నాకు తెలుసు ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు
(14:44) గాయం ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు ఈ మాటలు తరుచుగా అర్థం లేనివిగా మీకు అనిపించొచ్చు ఎవరికైతే నిజమైన బాధ అనుభవం లేదో ఎవరికైతే ఎప్పుడు చెడు జరగలేదో అలాంటి వారు ఇలాంటి విషయాలు చెప్తారు బాబు కథలు అని మీకు అనిపించొచ్చు అందులో తప్పేమ లేదు మై డియర్ మాస్టర్స్ ఈ భావన కూడా సహజమే నిజంగా సహజమే నొప్పి కలిగినప్పుడు ఆ బాధ నిజంగానే ఉంటుంది.
(15:11) అది మీకైనా నాకైనా ఈ [సంగీతం] ప్రపంచంలో ఎవరికైనా దాన్ని ఎవ్వరు కాదలనేము దాచలేము లేదా దాన్ని తక్కువ చేసి చూడలేము కూడా బాధ అనుభవించడం కూడా ఒక అవసరమే ఏడుప వస్తే ఏడవండి కోపం వస్తే కోపగించుకోండి దుఃఖం కలిగితే దుఃఖించండి కానీ కొంత సమయం తర్వాత లేచి మళ్ళీ నడవడండి. మిమ్మల్ని మీరు సంభాంచుకొని ముందుకు సాగండి. బాధను మీ గురువుగా మార్చుకోండి జైలర్గా కాదు మీ బాధని జైల్లో మీరు బంధించొద్దు మిమ్మల్ని మిమ్మల్ని మీరు బంధించొద్దు బాధ నుండే నేర్చుకోండి కానీ ఆ బాధలోని బందిగా ఉండిపోకండి మై డియర్ మాస్టర్స్ కర్మ సిద్ధాంతం కేవలం చెడు పనులకు మాత్రమే కాదు మంచి పనులకు కూడా సమానంగా వర్తిస్తుంది.
(15:59) చెడు కర్మలకు చెడు ఫలితం దక్కినట్లే మంచి కర్మలకు మంచి ఫలితం కూడా లభిస్తుంది అందులో డౌటే లేదు. ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో వారికి ఏదో ఒక రూపంలో సహాయం అందబడుతుంది అవసరమైన సమయాన్ని ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే వారికి జీవితంలో ఆ సంతోషం తిరిగి ఏదో విధంగా ఏదో ఒకరోజు చూస్తుంది. ఇతరుల కష్టాల్లో తోడుగా నిలిచే వ్యక్తికి అతని కష్టకాలంలో ఎవరో ఒకరు తోడుగా తప్పకుండా నిలబడతారు.
(16:28) ఇది కూడా కర్మ నియమమే చెడు కర్మలకు ఫలం దక్కడం ఎంత నిశ్చయమో ఇది కూడా అంతే నిశ్చయం అందుకే మీతో చెడు జరిగినప్పుడు నిరాశ పడకండి. మీరు గనుక మంచి కర్మలు చేసి ఉంటే వాటి ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. బహుత ఈరోజు కాకపోవచ్చేమో రేపు కాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది. రైతు విత్తనం నాటిన తర్వాత పంట వస్తుందని ఎలాగైతే ఓపికతో ఉంటాడో మీరు కూడా అలాగే ఓపిక పట్టాలి.
(16:59) రైతు ప్రతిరోజు విత్తనాన్ని తవ్వి మొలక వచ్చిందో లేదా అని చూడడు కదా కేవలం అతను చేసే పనిఏంటి నీరు పోస్తూ సమరక్ష చేస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు పంట వస్తుందని అతను నమ్మకంగా ఉంటాడు. మీరు కూడా అలాగే చేయాలి. మంచి కర్మలు చేస్తూ ఉండండి మంచిగా ఉండండి మరి సమయం వచ్చినప్పుడు అంత మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉండండి.
(17:19) దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇందులో మనం ఇంకో విషయం మనం లోతైన విషయం తెలుసుకుందాం. అదేంటంటే కర్మ అనేది కేవలం పెద్ద పనిలో ఉండదు. కర్మ అనేది ప్రతి చిన్న పనిలోనూ కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా చూసి నవ్వినప్పుడు అది కూడా ఒక కర్మే. ఎవరి మనసునైనా నొప్పించారు అనుకోండి అది కూడా కర్మే మీరు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారు అనుకోండి అది కూడా ఒక కర్మే మీరు ఒకరి గురించి చెడుగా మాట్లాడారు అది కూడా ఒక కర్మే ప్రతిక్షణం ప్రతి నిమిషం మన మనం కర్మలు చేస్తూనే ఉంటాం.
(17:53) మరి ప్రతి కర్మకి కూడా ఒక లెక్క ఉంచబడుతుంది. ఈ లెక్కని ఎవరు ఉంచుతారు ప్రకృతి ఈ సృష్టి ఈ విశ్వం దీనిని ఒకరు దేవుడు అంటారు మరొకరు ప్రకృతి అంటారు మరొకరు విధి అంటారు మరొకరు కర్మ అని అంటారు. పేరు ఏదైనా కావచ్చు కానీ ప్రతిదానికి ఒక లెక్క ఉంచే శక్తి ఒకటి ఉంది మాస్టర్స్ అది ఎప్పుడు తప్పు చేయదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకున్న [సంగీతం] మన కోణం కూడా ఉంది ఈ విషయంలో అది ఏంటంటే కర్మఫలం కేవలం బాహ్యంగానే ఉండదు.
(18:26) కర్మ యొక్క అతి పెద్ద ఫలం అంతర్గతంగా ఉంటుంది. చెడు పనులు చేసే మనిషికి జరిగే మొట్టమొదటి అతి పెద్ద నష్టం ఏమిటంటే అతను లోపల నుండి డొల్ల అయిపోతాడు. అతని ఆత్మ బలహీన పడుతుంది. అతని మనసు అశాంతికి గురవుతుంది. అతను బయటకు ఎంత గంభీరంగా సంతోషంగా కల్పించినా లోపల మాత్రం కృంగిపోతూ ఉంటాడు ఆందోళనతో ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని అతను ఎప్పుడు కూడా ఒక భయంగా ఉంటుంది.
(18:53) ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో అని ఎప్పుడు చింతలో ఉంటాడు. అతను ఎప్పుడు ఒక ముసుకు ధరించి లో లోపల కుంగిపోతూ చాలా అలసటతో కూడినటువంటి ఒక భారమైన జీవితాన్ని తడుపుతుంటారు. దీన్నే వెంటనే లభించే కర్మ అంటారు దీన్ని ఈ కర్మ బయటకి కనిపించదు కానీ లోపల ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉంటుంది. మరి మంచి పనులు చేసేవారికి మనిషి కూడా వెంటనే ఫలితం కూడా అందుతుంది.
(19:17) ఆ ఫలితమే అంతర్గత శాంతి మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు మీ లోపల ఒక రకమైనటువంటి తృప్తి కలుగుతుంది. మీరు ఎవరినైనా సంతోషపరిచినప్పుడు మీరు కూడా సంతోషిస్తారు. మీరు నిజం చెప్పినప్పుడు మీ గుండె చాలా ధైర్యంగా ఉంటుంది. మీరు నిజాయితిగా బతికినప్పుడు మీరు ఎవరికీ చూసి భయపడాల్సిన అవసరం ఉండదు. దీన్నే అంతర్గత శాంతి లేక మనశశాంతి లేదా మంచి కర్మల వల్ల వెంటనే దక్కే ఫలితం మరి ఈ ఫలితం ఎంత విలువైనది అంటే ప్రపంచంలోని ఏ సంపద కూడా దీన్ని కొనలేదు [సంగీతం] మై డియర్ మాస్టర్స్ మీ మనసంతిని ఎవరు కొనలేరు మన మనసుని ఈ ప్రగా ప్రతికార ఆలోచనతో ద్వేషం కోపంతో అసూయతో నింపితే అది మురికిగా
(20:00) మారుతుంది. మురికి మనసు నుండి మంచి ఆలోచనలు ఎప్పటికీ రావు. మంచి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేంు కానీ మనం మనసుని శుభ్రంగా ఉంచుకొని అందులో మంచి ఆలోచనలు రాణిస్తే [సంగీతం] మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి మన జీవితం కూడా మెరుగుగా ఉంటుంది ఏమంటారు అవునా కదా సో ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం.
(20:20) ఇతరులకు బాధ కలిగించే వ్యక్తి తరుచుగా లోలోపల తాను తనలో తాను బాధలో ఉంటాడు. ఎందుకంటే బాధలో ఉన్నవనిసే ఇతరులను బాధ కలిగిస్తాడు. మీకు బాధ కలిగించిన ఆ వ్యక్తి బహుశా తను కూడా ఏదో ఒక లోతైన వేదనను అనుభవిస్తూ ఉండవచ్చు. బహుశా అతనికి ఎప్పుడు నిజమైన ప్రేమ లేదా గౌరవం దక్కి ఉండకపోవచ్చు. ఆ బాధ నుండి బయటపడే మార్గం అతనికి దొరకనప్పుడు అతను అదే బాధను ఇతరులో కూడా పంచడం అనేది మొదలు పెడతాడు కదా.
(20:46) అది సహజమే. అది అతని తప్పే కానీ ఏ మనిషి కూడా పుట్టుకుతోనే చెడ్డవాడు కాదని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మాస్టర్స్ చెడు అనేది నేర్పించబడుతుంది లేదా పరిస్థితులు దాన్ని సృష్టిస్తాయి. మన హృదయం భారం తగ్గడానికే ఈ అవగాహన అవసరం. ఎదుటి వారు కూడా ఒక మనిషే అని వారికి కూడా బలహీనతో [సంగీతం] ఉంటాయని ఆ అసక్తలు ఉన్నాయని మనం అర్థం చేసుకున్నప్పుడు మన కోపం మనకి కోపం ద్వేషం అనేది చాలా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా అర్థమైందా అండి సో ఒక చక్కని ఆలోచన ఉంది చీకటిని చీకటితో తొలగించలేము కేవలం ఒక వెలుగు మాత్రమే దానిని తొలగించగలదు అదేవిధంగా ద్వేషాన్ని
(21:28) [సంగీతం] ద్వేషంతో మనం తుడిచి వేయలేము కేవలం ప్రేమతో మాత్రమే దాన్ని తుడిచివేయగలదు. ఎవరినైనా మీ పట్ల చెడు చేసినప్పుడు మీరు దానికి బదులుగా మంచి చేస్తే అది గొప్ప శక్తిగా మారుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు మీరు మీ కోపం మరి బలహీనతపై విజయం సాధిస్తారు. అయితే మంచి చేయడం అంటే మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవడం లేదా మీకు బాధ కలిగించే వ్యక్తికి దగ్గరకు ఏదో పదే వెళ్ళడం అని కాదు మాస్టర్స్ [సంగీతం] దీని అర్థమే కేవలం మీ లోపల ద్వేషం మరి ప్రతికార అగ్నికి చోటు ఇవ్వకూడదు అని మాత్రమే అదే సమయంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. మీ బాధ కలిగించే వ్యక్తులకు
(22:10) దూరంగా ఉండండి. మరి మిమ్మల్ని గౌరవించే వ్యక్తులతో మీ జీవితాన్ని హ్యాపీగా గడపండి. దూరం కావడం అనేది ప్రతికారం కాదు. అది వివేకం దారిలో ముళ్ళు ఉంటే [సంగీతం] దాంతో మనం యుద్ధం చేయం కదా కేవలం దాని నుంచి తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతాం. మీ జీవితంలో విషం నింపే వ్యక్తులకు దూరంగా ఉండడం మీ హక్కు వారి కర్మలు వారివే వారి లెక్కలు వారివే మీ దారిని మీరు చూసుకోండి జీవితం చాలా చిన్నది మాస్టర్స్ మనం ఈ భూమిపై పరిమిత కాలం కోసం మాత్రమే వచ్చాం.
(22:44) ఒక టూరిస్ట్ లాగా కానీ ఈ కొద్ది సమయంలోనే మనం తరుచుగా గొడవలు ద్వేషం మరి ప్రతికార జ్వాలతో మనం విలువైన సమయాన్ని [సంగీతం] వృదా చేస్తాం. చివరికి ఇదంతా వ్యర్థం అని మనకు అర్థంఅవుతది. ఎప్పుడు చివరి రోజుల్లో ఇది అర్థం చేసుకుంటారు నేను ఇంకా మంచిగా చేసిఉంటే బాగుండేదేమో నేను కొంచెం పేషెన్స్ ఉంటే బాగుండేదేమో లేదా ఇంకా కొంచెం నేను తగ్గి ఉంటే బాగుండేదేమో నేను చేసేటు ఉంటే కోపం దేశం వల్ల అందరినీ పోగొట్టుకున్నానే అని లాస్ట్ లో అతను ఎంత ఫీల్ అవుతాడు కదా ఇంకొంచెం ప్రేమించి ఉంటే పోయేది ఏముంది అప్పుడు తెలుస్తది పోగొట్టుకున్న తర్వాత చిట్ట చివరి
(23:17) రోజుల్లో మనం ఎంత అనుకున్నా ఏమి వేస్ట్ కదా కాబట్టి నాకు అర్థమైంది నా జీవితంలో జరిగిన సిచువేషన్ నుంచి నేను నేర్చుకున్న [సంగీతం] విషయం ఏంటంటే ఇదే మనం అర్థం చేసుకోగలిగితే ఇది చాలా పెద్ద పాఠం మన జీవితానికి మనమే బాధ్యులమని మన కర్మ సిద్ధాంతం మనకు నేర్పుతుంది. మన కర్మలకు మనమే బాధ్యులం. అతను నా పట్ల చెడు చేశాడు కాబట్టి నేను చెడ్డవాడిగా మారాను అని మీరు చెప్పగలరా కదా అతను చెడు [సంగీతం] చేయడం అనేది అతని బాధ్యత కానీ మీరు దానికి ఎలా స్పందిస్తారు అనేది మీ బాధ్యత మీ ముందు ఎప్పుడు ఒక ఛాయిస్ ఉంటుంది చెడుకు బదులు చెడు చేయొచ్చు లేదా చెడుకు బదులు మంచి కూడా
(23:58) చేయొచ్చు ఈ ఎంపిక మీ కర్మను నిర్ణయిస్తుంది మాస్టర్స్ మీ ముందు రెండు దారులు ఉన్నాయి అని ఊహించుకోండి [సంగీతం] ఒక దారి ప్రతికారా అనేది ఈ దారి దారిలో ముళ్ళు ఉన్నాయి చీకడి ఉంది గుంతలు ఉన్నాయి. ఈ దారిలో నడుస్తూ మీరు అవతలి వ్యక్తికి బాధ కలిగించనువచ్చు కానీ మీరే స్వయంగా గాయపడతారు మాస్టర్స్ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉంటారు.
(24:22) లేదా అంతకంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకపోతే రెండో దారి ముందుకు సాగడం ఈ దారిలో కూడా కష్టాలు ఉన్నాయి కానీ వెలుగు ఉంది. ఈ దారిలో ఎత్తు పల్లాలు ఉన్నాయి కానీ ముందుకు సాగే కొద్ది దృశ్యం అందంగా మారుతుంది. జీవితం హ్యాపీగా ఉంటుంది. ఈ దారిలో నడిస్తే మీరు ఎక్కడికైనా చేరుకోవచ్చు. మీరు నచ్చిన చోటికి చేరుకోవచ్చు మీరు ఎలాగైనా మీరు మెరుగైన వ్యక్తిగా మారుతారు.
(24:45) మీరు దృఢంగా తయారవుతారు మీరు సంతోషంగా ఉంటారు ఎంపిక మీదే మన చుట్టూ ఎంత చెడు ఉన్నా ఎంత మురికి ఉన్నా ఎంతమంది చెడ వ్యక్తులు ఉన్నా మనం మంచితనాన్ని వదులుకూడదు. మన గుణాన్ని కోల్పోకూడదు. మనం బురదలో ఉంటూ కూడా తామరలా వికసించాలి.

No comments:

Post a Comment