ప్రపంచాన్ని జయించే ఆయుధం | Swami Vivekananda's Focus Formula | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mpT6GfDRG_4
Transcript:
(00:04) మీరు చనిపోయాక మీ బాడీని కాల్చేస్తారు లేదా పూడిచేస్తారు. కానీ బతికున్నప్పుడు మీరే శవంలా ఉన్నారని మీకు తెలుసా? ఏ లక్ష్యం లేకుండా ఏ ఏకాగ్రత లేకుండా గంటల తరబడి ఆ ఫోన్ స్క్రీన్ రుద్దేస్తున్నారే అది బతికున్న శవం చేసే పని. మనం ఒక వింతైన కాలంలో ఉన్నాం. ఇక్కడ మనుషుల దగ్గర అన్ని ఉన్నాయి. ఒక అటెన్షన్ తప్ప. మీ ఫోకస్ ఇప్పుడు ఒక సెకండ్ ముక్కల ముక్కలు అయిపోయింది.
(00:32) ఒక మనిషి ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు లోకం మర్చిపోయేవాడు. కానీ ఇప్పుడు ఒక పుస్తకం తీస్తే పక్కనే ఫోన్ నోటిఫికేషన్ ఒక పని మొదలు పెడితే మైండ్ లో ఇంకేదో ఆలోచన. చాలా మంది ఏమనుకుంటారంటే దీన్ని మల్టీ టాస్కింగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకేసారి 10 పనులు చేయట్లేదు. ఒకేసారి 10 పనులు చెడగొడుతున్నారు.
(00:56) మీ సమస్య సోషల్ మీడియా కాదు మీ సమస్యఇస్గ రీల్స్ అస్సలు కానే కాదు మీ సమస్య చిల్లర బుద్ధి ప్రతిదానికి రియాక్ట్ అయిపోవడం ప్రతి పనిని సగం సగం చేయడం సగం చదివిన చదువు సగం చేసిన ప్రేమ సగం చేసిన బిజినెస్ ఇవేవి మీకు సక్సెస్ ఇవ్వవు కేవలం గందరగోళాన్ని ఇస్తాయి. మీరు గమనించారా ఈ జనరేషన్ లో అందరికీ అన్నీ కావాలి కానీ దేని మీద దృష్టి పెట్టడానికి ఓపిక లేదు.
(01:25) మన మెదడు ఒక డస్ట్ బిన్ అయిపోయింది. పనికి రాని ఇన్ఫర్మేషన్ ఎవరికో జరిగిన గొడవలు ఎక్కడో చూసిన మీమ్స్ వీటన్నిటి మధ్య మీ జీవిత లక్ష్యం అనేది కరుమరిగ అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మీకు డిసిప్లిన్ అంటే పోరు. మీకు ఇన్స్టెంట్ కిక్ కావాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు ఒక ఆలోచనను తీసుకోండి దాన్నే మీ జీవితంగా మార్చుకోండి.
(01:49) కానీ మనం ఏం చూస్తున్నాం పొద్దున్న ఒక ఆలోచన మధ్యాహ్నం ఒక ఆలోచన రాత్రికి ఇంకొక ఆలోచన మన ఇంద్రియాలు మనల్ని మోసం చేస్తున్నాయి. కళ్ళు కనిపించిన ప్రతిదాన్ని చూడమంటున్నాయి. చెవులు వినిపించిన ప్రతి చెత్తని వినమంటున్నాయి. మన శక్తి అంతా ఈ ఇంద్రియాల ద్వారా బయటికి లీక్ అయిపోతుంది. ఒక ట్యాంక్ కి 10 రంద్రాలు ఉంటే అందులో నీళ్లు ఎలా ఉంటాయి ఉండవు కదా మీ శక్తి కూడా అలాగే వేస్ట్ అయిపోతుంది.
(02:16) మీకు తెలుసా ప్రపంచంలో అత్యంత ఖరీదు అనేది మీ ఫోకస్ అందుకే ప్రతి యాప్ ప్రతి కంపెనీ మీ అటెన్షన్ కోసం యుద్ధం చేస్తుంది. మీరు వాళ్ళకి మీ జీవితాన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మీకు మీ మీద కంట్రోల్ లేదు కాబట్టి మీకు కావాల్సింది కంఫర్ట్ కష్టపడి ఏకాగ్రత పెట్టడం కంటే పడుకొని స్క్రోల్ చేయడం చాలా ఈజీ ఈ సోమరితనమే మిమ్మల్ని యావరేజ్ గా మిగిలిచేస్తుంది.
(02:42) నిజం చెప్పాలంటే మీకు అసలు ఏం కావాలో క్లారిటీ లేదు. క్లారిటీ లేని చోట ఏకాగ్రత అసలు ఉండదు. గాలి ఎటు వేస్తే అటు వెళ్లే ఒక ఎండుటాకులా తయారయ్యారు. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలుసా మీకు ఇది కొంచెం క్రూరంగా అనిపించొచ్చు కానీ తప్పదు ముందుగా మీరు నో చెప్పడం నేర్చుకోండి. మీ ఫోకస్ ని చెడగొట్టే ప్రతిదానికి అది మనిషి అయినా వస్తువైనా ఆలోచన అయినా మొహం మీదే నో అని చెప్పండి.
(03:09) స్వామి వివేకానంద గారు చెప్పినట్లు మీ మెదడుని మీ నరాల్ని మీ కండరాల్ని ఆ ఒక్క లక్ష్యంతోనే నింపేయండి అంటే ఏంటో తెలుసా మీరు తింటున్న పడుకున్న నడుస్తున్న మీ గోల్ మీ మైండ్ లో తిరుగుతూనే ఉండాలి ఒక కాగితం తీసుకోండి మీకు ఏం కావాలో దాని మీద రాయండి రోజులో ప్రతి గంట ఆ కాగితాన్ని చూడండి అది పిచ్చు అనుకుంటున్నారా అవును పిచ్చోళ్లే చరిత్రను సృష్టిస్తారు తెలివైన వాళ్ళు కేవలం విమర్శలు చేస్తూ కూర్చుంటారు మీ ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు మిమ్మల్ని మీరు నిర్మించుకోవడం.
(03:45) శక్తిని ఆదా చేయండి. అనవసరమైన చర్చలు మానేయండి. ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలాన్ని చెంప అవతదలు పడేయండి. ఆ ఎనర్జీ మీ పని మీద పెట్టండి. మీ ఏకాగ్రత ఒక లేజర్ లా ఉండాలి. లేజర్ కి ఉన్న పవర్ ఏంటో తెలుసా? అది చెల్లా చెదురుగా ఉండదు. అందుకే అది ఇనుమును కూడా కోయగలదు. మీ ఆలోచనలు కూడా లేజర్ లా మారాలి అప్పుడే మీరు ప్రపంచాన్ని జయించగలరు.
(04:12) చివరిగా ఒక మాట జీవితం ఒక గాంబ్లింగ్ లాంటిది. ఇక్కడ మీరు రిస్క్ తీసుకోకపోతే మీకంటూ ఒక గుర్తింపు ఉండదు. కానీ ఆ రిస్క్ లో కూడా గెలవాలంటే ఏకాగ్రత అనే ఆయుధం మీ దగ్గర ఉండాలి. 100 పనులు చేసేవాడు కాదు. ఒకే పని 100% ఏకాగ్రతతో చేసేవాడే నిజమైన విజేత. మీరు రేపు ఉండకపోవచ్చు కానీ మీరు చేసిన పని నిలబడాలి. ఆ స్థాయి అవుట్పుట్ రావాలంటే మీ ప్రాణాన్ని ఆ పనిలో పెట్టాలి.
(04:40) మీరు ఎప్పుడైనా గమనించారా సింహం వేటాడేటప్పుడు దాని కళ్ళు కేవలం జంతువుల మీద మాత్రమే ఉంటాయి. చుట్టూ అడవి తగలబడిపోతున్నా అది పట్టించుకోదు. అందుకే అది రాజు. మీరు మీ జీవితానికి రాజులా ఉండాలా లేదా చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ కి బానిసలా ఉండాలా? ఈ రెండిటిలో మీరు ఏది ఎంచుకుంటారో అది మీ ఇష్టం. కళ్ళు తెరిచి చూడండి టైం అయిపోయింది.
(05:04) మీరు ఫోకస్ చేయకపోతే మీ కలలు ఇంకెవరికో సొంతం అవుతాయి. మీరు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి ఏకాగ్రత అంటే కేవలం పని చేయడం కాదు మిమ్మల్ని మీరు దైవంగా మార్చుకోవడం ఏకాగ్రత ఉన్న మనిషికి అసాధ్యం అనేది లేదు. మీరు ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. ఆ ఫోన్ పక్కన పెట్టేయండి. ఒకవేళ ఫోన్ పట్టుకుంటే మీకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చూడండి.
(05:31) అది ఏదైనా అవ్వచ్చు. మీ లక్ష్యం ఏంటో దాని మీద దాడి చేయండి. ఒకవేళ మీరు ఇది చేయలేకపోతే వెళ్లి ప్రశాంతంగా పడుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద మీరు బతికున్నంత కాలం చేసేది ఏమీ లేదు కాబట్టి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్
No comments:
Post a Comment