Saturday, June 20, 2026

 *దేవునకు స్వప్న సుషుప్త్యవస్థ లుండవు*
*దేవుడిని లేపడం,పడుకోబెట్టడం
పవ్వలింపు సేవలు చేయడం పిల్లలాటలు.ఆ పరమేశ్వరుడే మనలనందరను,మననే కాదు
ప్రాణకోటిని మేల్కొలుపువాడు.అం
దుకే మనము బ్రహ్మముహూర్తము
న నిద్రలేచి పడకపై కూర్చొనియే
“ఓం ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రం హవా
మహే”మున్నగు ఐదు మంత్రము
లతో ప్రార్థిస్తాం.ఈ ఐదు మంత్రార్థ ములను మహర్షి దయానంద సరస్వతి తన సంస్కారవిధిలో గృహాశ్రమ ప్రకరణములో వ్రాసినట్లు
కంఠస్థము చేసి మననము చేసినట్ల
యితే పుష్కలమైన ప్రేరణను అంత ర్యామియైన పరమేశ్వరుడు మన కందిస్తాడు. మహర్షి ఈ మంత్ర ములు వ్రాయుటకు పూర్వము ఈ క్రింది అమృతతుల్య పలుకులు వ్రాశాడు.చూడుడు:
“ఆ పరమేశ్వరుని కరుణాకటాక్షము
వలనను,సహాయము వలనను, మహాకఠినములైన కార్యములు కూడ సులభముగ సిద్ధించగలవు.
అందుకుగాను మంత్రములు క్రింద
వ్రాయబడుచున్నవి.”
ఓం ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రం హవా మహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వి
నా।ప్రాతర్భగం పూషణం బ్రహ్మణ స్పతిం ప్రాతస్సోమముత రుద్రం హువేమ॥(ఋగ్వేదము.7-41-1)
ఓ స్త్రీపురుషులారా!ఎట్లు విద్వాం
సులమగు ఉపదేశకులము(ప్రాతః)
అరుణోదయమున(అగ్నిమ్)స్వప్రకా
శ స్వరూపుడును(ప్రాతః)[ఇన్ద్రమ్]
పరమైశ్ర్యముల నొసంగువాడును,
పరమైశ్వర్యయుక్తుఁడును(ప్రాతః)[మిత్రావరుణా]ప్రాణోదానముల
వలె ప్రియుఁడును,సర్వశక్తిమంతు
డును(ప్రాతః)[అశ్వినా]సూర్యచం ద్రుల నుత్పన్నము చేసినవాడును
నగు యా పరమాత్ముని(హవామ
హే)స్తుతించుచున్నారమో,ఇకనట్లే
(ప్రాతః)[భగమ్{భజనీయుడును,
ఐశ్వర్యయుక్తుడును(పూషణమ్)పు
ష్టికర్తయు(బ్రహ్మణస్పతిమ్)తన
ఉపాసకులను,వేదమును,బ్రహ్మాం
డములను పాలించువాడును,(ప్రా
తః)[సోమమ్]అంతర్యామియై ప్రే
రేపించువాడును(ఉత)మరియు
(రుద్రమ్)పాపాత్ముల నేడ్పించువా
డును,సర్వరోగముల నశింపజేయు
వాడునగు జగదీశ్వరుని(హువేమ) స్తుతిప్రార్థనలను చేయుచున్నామో, అటులే ప్రాతఃకాలమున మీరును
చేయుడు.
ఇందుగల”బ్రహ్మణస్పతిమ్”శబ్ద మునకు మహర్షి దయానందసర స్వతి  సమాధిస్థుడై చేసిన అర్థము మననము చేయదగియున్నది.
>తన ఉపాసకులను,వేదమును, బ్రహ్మాండములను పాలించువాడు.
>ప్రాతః(సోమమ్)అతర్యామియై
ప్రేరేపించువాడు.
>(రుద్రమ్)పాపాత్ముల నేడ్పించు
వాడు మరియు సమస్త రోగముల
నశింపజేయువాడు.
ఈ “రుద్రమ్”లో అసుర సంహార
ము కలదు.సమస్త రోగముల నాశము సయితం కలదు.
ఒక్క మంత్రము మనను నిశ్చయ ముగ నవయుగ వైతాళికులను 
చేస్తుంది.
…….ప్రభాకరశర్మ.        *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment