Saturday, June 20, 2026

How to Live Without Fear and Guilt: The "Zorba the Buddha" Way | Osho Philosophy

How to Live Without Fear and Guilt: The "Zorba the Buddha" Way | Osho Philosophy

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3xFWnEQtHj4



Transcript:
(00:01) జోర్బా ఇతను గ్రీక్ నవల జోర్బా ద గ్రీక్ లోని ఒక కల్పిత పాత్ర జోర్బా అంటే అచ్చమైన ప్రాపంచిక మనిషి నచ్చిన తిండి తింటాడు హాయిగా వైన్ తాగుతాడు నచ్చినప్పుడు పిచ్చిగా డాన్స్ చేస్తాడు సెక్షువాలిటీని ఎంజాయ్ చేస్తాడు. రేపటి గురించి భయం లేదు నిన్నటి గురించి గిల్ట్ లేదు. ఈ క్షణంలో శరీరం అడిగే ప్రతి సుఖాన్ని ఎటువంటి సిగ్గు మొహమాటం లేకుండా అనుభవించే ప్యూర్ మెటీరియలిస్ట్ అతను.
(00:29) ఓషో ఏమంటాడంటే ప్రతి మనిషికి మొదట ఈ జోర్బా పునాది కావాలి. భూమిలో లోతుగా నాటుకుపోయే వేళ్ళు కావాలి. శరీరాన్ని అసహించుకునేవాడు లౌకిక జీవితాన్ని ఎంజాయ్ చేయలేనివాడు ఎప్పటికీ ఆధ్యాత్మికత వైపు వెళ్ళలేడు. లోపల కోరికలను అణచి పెట్టుకుని బయట కాషాయ బట్టలు వేసుకొని కూర్చుంటే వాడు కపటుడు అవుతాడే తప్ప బుద్ధుడు కాలేడు. కానీ కేవలం జోర్బాగా మాత్రమే మిగిలిపోతే జీవితం ఒక జంతువు స్థాయిలోనే ఆగిపోతుంది.
(00:57) ఎంత తిన్నా ఎంత తాగినా ఎన్ని లగ్జరీలు ఉన్నా ఒక స్టేజ్ వచ్చాక బోర్ కొడుతుంది. లైఫ్ లో ఏదో వెలితిగా ఉంటుంది. అక్కడే బుద్ధుడు కావాలి. బుద్ధుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు అదిఒక కాన్షియస్నెస్ నిశశబ్దం ప్రశాంతత సాక్షి భావం తన లోపల ఏముందో తెలుసుకునే అవేర్నెస్ బయట ఎంత గందరగోళం ఉన్నా లోపల కదల్చలేని ప్రశాంతతను కలిగి ఉండడమే బుద్ధుడి లక్షణం.
(01:24) జోర్బా దగ్గర ఎనర్జీ ఉంది కానీ డైరెక్షన్ లేదు. బుద్ధుడి దగ్గర డైరెక్షన్ ఉంది కానీ ఎనర్జీ లేదు. అందుకే ఓషో ఈ రెండింటిని కలిపేసాడు. జోర్బా ద బుద్ధ అంటే బయట ప్రపంచానికి జోర్బా లాగా లోపలి ప్రపంచానికి బుద్ధుడిలాగా బతకడం అంటే నువ్వు ఒక లగ్జరీ కార్లో తిరగొచ్చు బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు సంపాదనను ఎంజాయ్ చేయొచ్చు ప్రేమించొచ్చు శృంగారంలో పాల్గొనొచ్చు కానీ అదే సమయంలో వాటికి బానిస కాకుండా లోపల ఒక బుద్ధుడి లాంటి డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం కలిగి ఉండాలి.
(01:55) కార్ ఉన్నా హ్యాపీనే లేకపోయినా నీ ప్రశాంతత పాడవ్వకూడదు. పక్కన పార్ట్నర్ ఉంటే ప్రేమను పూర్తిగా ఆస్వాదించాలి వాళ్ళు వెళ్ళిపోతే ఒంటరిగా నిశశబ్దంగా ఉండగలగాలి. నిజానికి ఇక్కడ అందరి ప్రాబ్లం ఏంటో తెలుసా ప్రతి ఒక్కడు ఒక నకిలీ ముసుకు వేసుకొని తిరుగుతున్నాడు. బయట చాలా పద్ధతిగా పవిత్రంగా నటిస్తూ లోపల మాత్రం కుళ్లిపోయిన కామాలతో కుళ్ళు ఆలోచనలతో బతుకుతున్నారు.
(02:19) శరీరాన్ని శత్రువులా చూస్తూ ఆత్మ గురించి సొల్లు కబుర్లు చెప్పే ఈ కపట సమాజానికి జోర్బాద బుద్ధ అనే కాన్సెప్ట్ ఒక పవర్ఫుల్ బుల్లెట్ లాంటిది. శరీరాన్ని వాడుకో ఆత్మను తెలుసుకో ఈ రెండింటిని ఒకేసారి పిండేసి ఎవడైతే బతుకుతాడో వాడే అసలైన మొగుడు మిగతా వాళ్ళంతా కేవలం పుట్టి చస్తున్న నకిలి శవాలు మాత్రమే

No comments:

Post a Comment