Tuesday, June 21, 2022

ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేందుకు వేదాలలోని 10 సూత్రాలు

ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేందుకు వేదాలలోని 10 సూత్రాలు
1. ఇతరులను మార్చాలనే ప్రయత్నం మాని నిన్ను నువ్వు మార్చుకోవడం మీద శ్రద్ధ పెట్టు!
2. ప్రతి ఒక్కరూ తమ తమ దృష్టి కోణాల్లో ఎవరికి వారే కరెక్టు అనేది అంగీకరించు!
3. అనవసర అనుమానాలు, అపోహలు లేకుండా ఎలా ఉన్నా ఒక వ్యక్తిని వ్యక్తిగా స్వీకరించు!
4. ఇతరుల నుంచి ఏదో పొందాలనే ఆశ వదిలిపెట్టి చేతనైన సహాయం చేస్తూ అనుబంధాలను పెంచుకుంటూపో!
5. నువ్వు చేస్తున్నది ఏదైనా అది నీ మనశ్శాంతి కోసమే చేస్తున్నావని గుర్తించు!..
6. నువ్వు ఎంత మేథావివో ప్రపంచానికి ప్రదర్శించి చూపాలని పాకులాడకు!
7. ఇతరులు ఎల్లప్పుడూ నిన్నే ఆమోదిస్తూ ఉండాలని ఆశించకు!.
8. 'అవసరం' మరియు 'కోరిక' ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి నీతో నువ్వు, నీలో నువ్వు ప్రశాంతతను పొందటం నేర్చుకో!
9. నిన్ను ఇతరులతో పోల్చుకోవటం లేదా ఇతరులను నీతో పోల్చుకోవటం...ఈ రెండూ వదిలెయ్!
10. శాంతి, ఆనందం, తృప్తి .అనేవి సాధనాలతో పొందేప్రాప్తలు కాదు...సాధనతో పొందే మానసిక అనుభూతులు అనే సత్యాన్ని గ్రహించు.

సేకరణ

No comments:

Post a Comment