Wednesday, June 29, 2022

ఆ మార్పు ఇంకెలా ఉంటుందో?!

వర్తమాన సమయంలో మనం ప్రేమను, గౌరవాన్ని ఇతరుల నుండి ఆశిస్తున్నాము. 


ఇది కలియుగం. 

కలియుగంలో మనం అడుగుతూ ఉంటాము. 

సత్యయుగంలో ఎలా ఉంటారు? 

ఇచ్చేవారిగా ఉంటారు. 

అందుకే వారిని దేవతలంతారు. 

దేవత అంటే దాత. 

అనగా ఇచ్చేవారని అర్ధం. 


సత్యయుగంలో సంపన్నంగా ఉంటారు. 

సంపన్నంగా ఉన్నవారు ఇతరుల నుండి ఏమీ ఆశించరు. 

వారికి ఆ అవసరమే ఉండదు. 


ఒక్కసారి ఆలోచిస్తే కనుక... 

మనం కలియుగంలో ఉంటూ కూడా,  

ఇప్పుడు మన ఆత్మిక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వలేదు కూడా.. 

కాస్త ఛార్జ్ అయ్యింది.. 

అయినా కూడా, 

మనం అడగడం నుండి ఇవ్వడంలోకి, 

ఆశించడం నుండి అంగీకారంలోకి బదిలీ అయ్యాము. 


కాస్త అవగాహనతో, 

ధ్యానంతో బ్యాటరీ కాస్త ఛార్జ్ అయ్యినా సరే మార్పు ఎంతగా వచ్చింది మనలో! 

బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు మనలో వచ్చే ఆ మార్పు ఇంకెలా ఉంటుందో?!


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment