Monday, June 27, 2022

బ్రతకడం వేరు, జీవించడం వేరు....

 బ్రతకడం వేరు, జీవించడం వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది.

బంగారాన్ని ఎన్ని ముక్కలు చేసిన దాని విలువ తగ్గదు. అలాగే మంచితనంతో సంపాదించుకున్న గౌరవం కూడా ఎప్పటికి తరిగిపోదు.
"నేనే "అంతా అనుకుంటే "అహంకారం".
"మనదే "అంతా అనుకుంటే "మమకారం.
ఏమి లేదనుకుంటే "నిర్వికారం " ఒకరికి ఒకరు తోడైతే "సహకారం. ".
చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తూవుంటాయి. అలాగే నీవెంతా నీతిగా బ్రతికిన కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతూవుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవలసింది తడబడడం కాదు, నిలబడడం నేర్చుకోవాలి.
మన ఆలోచనలు ఎప్పుడు రాబోయే "భవిష్యత్ "వైపు పరుగెత్తాలి కానీ, మనతో నడవని "గతం "కోసం వేచి చూడకూడదు.
సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం,కష్టం వెనుక అవకాశం, తప్పక ఉంటుంది .

🙏లోకాసమస్తా సఖినోభవన్తు. సమస్తసన్మంళాని భవన్తు.🙏

సేకరణ

No comments:

Post a Comment