Tuesday, June 28, 2022

యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందా ?

💖💖💖
💖💖 "263" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼

"యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వలన ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందా ?"


"మనం పుణ్యక్షేత్రాలకు తిరిగేది కూడా ఆలోచనలు తగ్గించుకోడానికే ! మనకి రోజూ ఉండే పనులు పుణ్యక్షేత్రాల్లో ఉండవు. కనుక ఆ పనులకు సంబంధించిన ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. మన మనసుకు వ్యాపకాలు అలవాటయ్యాయి. అందుకే ఇతర ఊళ్ళకు వెళ్ళినప్పుడు కలిగే శాంతిని కూడా బోర్ (విసుగు)గా భావిస్తాం. పుణ్యక్షేత్రాల్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు తగ్గినందువల్ల వచ్చే ఆనందాన్ని అనుభవించాలి. పుణ్యక్షేత్రాల్లో కూడా ఏసి గదులకోసం, మంచి భోజనం కోసం వెతుక్కుంటే అది మన ఇంటితో సమానమే. ఒక అప్పు తీర్చేందుకు మరోక అప్పుచేస్తే అప్పిచ్చినవాడు మారతాడుగానీ అప్పుమారదు. మనం భక్తితో చేసే పనులు అలాంటివి కాకూడదు. మొక్కలు తప్పుకాదు. కానీ మన భక్తికి అవి మాత్రమే లక్ష్యం కాదు. వ్రతదీక్షలు మన కోర్కెలను ఆపటానికి ఆలంబనగా ఉండాలి !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment