Sunday, June 19, 2022

సర్వవ్యాపి

సర్వవ్యాపి

🔸🔹🔸🔹🔸

శివుడు వేరు కేశవుడు వేరు, అమ్మవారు వేరు అని ఎవరైతే వేరువేరుగా చూస్తారో వారికి ఎన్నటికీ మోక్షం రాదు అని శాస్త్రం.


సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ప్రకృతి అయిన అమ్మవారు, అంతా ఒక్కటే పరమాత్మ.. 


సముద్రంలో అలలు ఉంటాయి, నురుగు ఉంటుంది, తరంగాలు ఉంటాయి. అలాగే ఒకచోట హిందూ మహాసముద్రం, ఒకచోట పసిఫిక్, మరోచోట అరేబియా అని రకరకాలుగా పిలుస్తాం. ఇవన్నీ నిజంగా వేరువేరుగా ఉన్నాయా? అన్నీ కలిపి సముద్రం.. 


ఈ సృష్టిలో శివుడు, కేశవుడు, అమ్మవారు, చరాచర జగత్తు అన్నీ చైతన్య స్వరూపమే. చైతన్యమే వివిధ రూపాలలో దేవతలుగా, దేవుళ్ళుగా, మానవులుగా, వివిధరకాల జంతువులుగా, అన్నీ రూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది. శివుడే అంతా అంటుంది శివపురాణం, విష్ణువే ఎక్కువ అంటుంది విష్ణుపురాణం, సూర్యోపాసన ఎక్కువ అంటుంది భవిష్య పురాణం, దేవీభాగవతం అమ్మవారే అంతా అంటుంది. 


ఆయా సమయాలలో అయా రూపాలలో ఆయా కార్యాలు చేస్తాడు భగవంతుడు. రూపం ఉంటే భగవంతుడు నిర్వికారుడు ఎలా అవుతాడు. గుణాలు ఉన్నవాడు నిర్గుణుడు ఎలా అవుతాడు. సర్వవ్యాపకుడు ఒక రూపంలో ఎలా ఉంటాడు?


ఆయా రూపాలు ఉపాసకులు కోసం, సృష్టి రక్షణ కోసం రావడం జరిగింది. అక్కడితో ఆయా రూపాల యొక్క కార్యం నెరవేరింది. వాటిని ఆధారం చేసుకొని భగవంతుడిని పట్టుకోవాలి కానీ శివుడు ఎక్కువ కేశవుడు ఎక్కువ అని ఒకచోట ఒకరూపం దగ్గర ఆగిపోయి మిగిలిన రూపాలని లెక్కలేనితనంతో చూస్తే ఎన్నటికీ మోక్షం రాకపోగా నరకంలో పడతారు. జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు.. జన్మపరంపరలు పొందుతూనే ఉంటారు..


సర్వం ఖల్విదం బ్రహ్మ

సర్వం ఈశ్వర మయం జగత్ 

(ఈశ్వరుడు అంటే శివుడు కాదు. ఈశ్వరుడు అంటే నీర్వికారుడు, అత్మస్వరూపుడు, సర్వావ్యాపకుడు, అనంతుడు బహురూపదారి.)

ఏకమేవా అద్వితీయం బ్రహ్మ.


🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment