Sunday, August 7, 2022

ఆశ...!!!

 *ఆశ...!!!*

   ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు అని మీకు తెలుసా...!!

   ధనము తరువాత మానవుడిని నాశనం చేసేది ఆశ, ఆశను మించిన దుఃఖము మరొకటి లేదు, ఆశను వదిలితే కలిగే సుఖము దేనికీ సమానము కాదు, ఆశ అనేది మనిషితో పాటు పుడుతుంది...


     మనిషి చచ్చే దాకా అతడిలో ఉన్న ఆశ చావదు, కనుక ఆశ ప్రాణాలను తీయగలిగిన ప్రాణాంతక వ్యాధి...

    కోరికలు అనేవి ఒకటి వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి, కోరికలు అనుభవిస్తే తీరేవి కాదు...

అగ్నిలో నెయ్యి వేస్తే అగ్ని ఆరిపోతుందా.. అలాగే అనుభవించే కొద్దీ కొత్త కొత్త కోరికలు పుట్టుకు వస్తుంటాయి... 

కోరికల ఆశను అదుపులో పెట్టుకుంటే అంతులేని సుఖం కలుగుతుంది, మానవుడు ఇంద్రియములను నిగ్రహించుకోవాలి...

ఇంద్రియములను వాటి ఇష్టము వచ్చినట్లు పోనిస్తే అవి చేయకూడని పనులు చేసి దుఃఖము కలిగిస్తాయి... 

అలా కాకుండా కోరికలను నిరోధిస్తే మానవునికి సుఖము కలుగుతుంది, మరణం తరువాత సద్గతులు కలుగుతాయి...


ఎప్పుడూ ధనము సంపాదించడం లోనూ ఇంద్రియ సుఖములు అనుభవించడంలోనూ మునిగి తేలే వాడిని మృత్యువు ఒక్క సారిగా మీద పడి అడవిలో పెద్దపులి మేక మీద పడి కబళించినట్లు కబళిస్తుంది,

     మానవుడు సంపాదించిన ధనము, అతడు చేసిన ధర్మములు, యజ్ఞములు, యాగములు, అతడిని మృత్యువు నుండి కాపాడ లేవు...


పుట్టిన వాడు చావక తప్పదు, కేవలం మోక్ష సాధనతోనే ఈ జననమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు...

     మానవుడి జీవితంలో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ అతడి ఆయువు క్షీణిస్తుంది...

    అతడు మృతృయువుకు దగ్గర ఔతుంటాడు, కనుక రేపటి పని ఈ రోజు, తరువాత చెప్పిన పని ఇప్పుడే చెయ్యాలి, కాలయాపన, అలసత్వము, సోమరితనము పనికి రాదు.


కాలముకు వశుడైన మానవుడికి ఏమరిపాటు సహజము, కాలం గడిచే కొద్దీ ఆయుష్షు తరిగి పోతుందని గ్రహించిన నాడు ఈ సంసారం మీద విరక్తి కలుతుంది... 

ఆ విరక్తి మార్గము ముక్తికి సోపానము, ప్రాపంచిక సుఖముల మీద కోరిక ఆశ లేక పోతే అతడు మనస్సును జయించగలడు. 

దాని వలన ముక్తి లభించి జననమరణ చక్రము నుండి విముక్తి పొందగలడు... 

No comments:

Post a Comment