Monday, June 16, 2025

 *అహంకారము తగదు*
కలిగి మట్టికలసిరి చరితలో ఎందరో....

*ఆగ్రహము విడుము*
అందరితో చెడెదవు ఈ దుర్గుణమ్ముతో....

*అసూయతో రగలకుము*
ఎదగలేవు ఎపుడూ ప్రతిభయున్న చాలా....

*చాడీలనెన్నడు చెప్పకుము*
చులకనౌదువు నిజము తెలసిన చివరకు

*అసత్యాలను పలుకకుము*
నమ్మరెవరు నిను విలువ తగ్గి హేళనగుదు...

*ప్రగల్భాలకు పోకము*
ఉత్తుత్త మాటలని తెలిసి పరిహసించెదరు...

*దుబారా వ్యయము మానుము*
కోల్పోయాక తెలియు డబ్బు అవసరము....

*దుష్ట సావాసము వదులుము*
భవిత చేజారు చెడు దారుల్లో నడచి.!

No comments:

Post a Comment