Friday, June 13, 2025

 లాస్ట్ సండే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ప్రముఖ షాపింగ్ మాల్ కి వెళ్దాం ఫ్రెండ్స్.
స్నాక్స్ తిందామని cafeteria లో కూర్చున్నాం.
మాకు ఎదురుగా ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు.
వాళ్లు మాకు ఎదురుగా అలా కూర్చొని ఉంటే నాకు సిగ్గేసింది ఫ్రెండ్స్. అర్జెంటుగా అక్కడినుంచి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది.
అక్కడి నుంచి వెళ్ళిపోదామని మా హస్బెండ్ కి చెప్పాను.

ముందల ఇంకో cafeteria ఉంటే అక్కడికి వెళ్లి కూర్చున్నాం ఫ్రెండ్స్.
కారణము ఏంటంటే....

మాకు ఎదురుగా వచ్చిన వాళ్లలో ఇద్దరు చిన్నపిల్లలు. 8 10 ఇయర్స్ ఉంటాయి. ఇద్దరూ ఆడపిల్లలే.
ఒక ముసలావిడ వచ్చింది. ఆమె చూస్తే పద్ధతిగా చీర కట్టుకొని రాజమండ్రి సైడ్ భాష మాట్లాడుతుంది.
ఇద్దరు భార్య భర్తలు.
భార్య వేసుకున్న బట్టలు నాకు నచ్చలేదు.
నైట్ పడుకునేటప్పుడు వేసుకోవలసిన బట్టలు....
పట్టపగలు షాపింగ్ మాల్ కి వేసుకొని వచ్చి ఆమె అందచందాలన్నీ పబ్లిక్ కి భర్త పక్కనే కూర్చుని చూపిస్తుంది.
పిల్లలు కూడా చిన్నచిన్న నిక్కర్లు వేసుకుని వచ్చారు.
మొక్క ఒకటైతే విత్తువేరొకటి వస్తుందా....
ఒక్కసారిగా ఆమెను చూడగానే నాకు మతి పోయింది.
నాకు తెలిసి ఆమెకు దగ్గర దగ్గర 40 years ఉంటాయి.

నాకు అర్ధం కాని విషయం ఏంటంటే.... ఫ్రెండ్స్.

భార్య అలాంటి బట్టలు వేసుకుంటే భర్త  ఎందుకు ఒప్పుకున్నాడా అని....
నా పెళ్ళాం చాలా అందంగా ఉంది చూడండి అని పదిమందికి చూపించుకోవడానికా....
లేక....
పెళ్ళం చేతిలో కీలుబొమ్మైపోయాడా....
పైగా వాళ్ళు పక్కా తెలుగు వాళ్ళు.

నిజానికి మిగతా ఊరులో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్....
ఈ హైదరాబాద్లో మాత్రం ఆడవాళ్ళని చూస్తుంటే....
మన సంస్కృతిని ,సంప్రదాయాలను ,కట్టుబొట్లను మంట కలిపేస్తున్నారని అర్థమవుతుంది.
ఫారిన్ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ ఫాలో అవుతున్నారు.
చాలా బాధగా అనిపిస్తుంది. 30 నుంచి 40 మధ్య వయసులో ఉన్న
ఆడవాళ్లు కూడా ఒంటి మీద చున్ని వేసుకోకుండా రోడ్లమీద తిరిగేస్తున్నారు. షాపింగ్ మాల్స్ కి సినిమాలకు అలాగే వచ్చేస్తున్నారు. ఇక పిల్లలకు ఏం నేర్పుతారు.
ఇక వయసులో ఉన్న ఆడపిల్లలైతే చెప్పనవసరం లేదు. ఒక విధంగా బరితెగిచ్చేస్తున్నారు.
అసలు తల్లిదండ్రులు అలాంటి బట్టలు వేసుకుంటే ఎలా ఒప్పుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు.
వాళ్లకు డబ్బులు తల్లిదండ్రులు ఇస్తేనే కదా అలాంటివి కొనుక్కుంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే ఇక చెప్పనవసరం లేదు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. హైదరాబాద్కు వచ్చిన నెలరోజులు బానే ఉంటారు. తర్వాత నుంచి వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి. ఇక బట్టలు వేసుకునే విషయంలో అయితే చెప్పనవసరం లేదు. పైగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. ఇక విచ్చలవిడితనం.

అసలు భర్తలు ఇలాంటి దుస్తులు ధరిస్తుంటే ఎలా ఒప్పుకుంటున్నారో అర్థం కావటం లేదు. అలాంటి దుస్తులతో రోడ్ల మీదకు వస్తుంటే వాళ్ల ఇంట్లో మగవాళ్ళు ఎలా ఊరుకుంటున్నారో అర్థం కావటం లేదు.

ఒకప్పుడు మగవాళ్ళు ఎలా ఉండేవారంటే....
భార్య ఒంటి మీద బట్టలు కొంచెం శరీరం కనిపించిన  చెంపలు పగలగొట్టేవారు.
అలాంటి బట్టలు కొన్న ఊరుకునే వారు కాదు.
అంతెందుకు ఇప్పటికీ... మా ఇంట్లో అదే తీరు.

ఇప్పటి మగవాళ్లు దగ్గర ఉండి మరీ కొనిచ్చి, వేయించి పక్కన  తిప్పుకుంటున్నారు. పదిమందికి నా పెళ్ళాన్ని చూడండి అని మరీ వదిలేస్తున్నారు.

పక్కా villeges నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యి
అదేదో ఫ్యాషనో లేదంటే వీళ్లు ఏదో బాగా చదువుకొని బాగా బ్రతుకుతున్నట్లు బిల్డప్ కొట్టడానికి అర్థం కావట్లేదు కానీ....
ఇటువంటి వాళ్ళను చూసి పిల్లలు చెడిపోతున్నారు.

ఒక్క ఆడదైనా పద్ధతిగా ఒంటినిండా బట్టలు కప్పుకొని రోడ్డు మీదకు వస్తుందా....
కొంచెం రంగు ,హైట్ ఉంటే చాలు శరీరాన్ని పదిమందికి చూపించుకోవాలని ఉర్రూతలూగుతున్నారు ఇప్పటి ఆడవాళ్లు.
అదేమైనా అంటే.... మనసు మంచిగా ఉంటే చాలు వేసుకున్న బట్టల్లో ఉండదు అని వాళ్లకు వాళ్లే కితాబులు  ఇచ్చుకుంటారు.

నిజానికి మైండ్ సరిగ్గా పని చేస్తే.... శరీరం కనిపించకుండా ఒంటినిండా బట్టలు కప్పుకుంటారు.
మైండ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పిచ్చి వేషాలు.

ఒకప్పటి చదువులు సంస్కారాన్ని నేర్పేవి.
ఇప్పటివి చదువులు ఫ్యాషన్ నేర్పుతున్నాయి.
ఫ్యాషన్ అంటే ఇప్పటి జనరేషన్లో విప్పతీసుకుని తిరగడం.
మాక్సిమం ఇప్పటి జనరేషన్ లో 90% ఆడవాళ్లు అందరూ అలాగే ఉన్నారు.
టెన్ పర్సెంట్ ఆడవాళ్లు మాత్రమే పద్ధతిగా శరీరం కనిపించకుండా వస్త్రాలంకరణ చేసుకుంటున్నారు.

విదేశీ కల్చర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఫాలో అవుతున్నారు.
అదే విదేశీయులు మన కల్చర్ను ఫాలో అవుతారా అంటే లేదు.
వాళ్ళ కల్చర్ను వాళ్ళు ఫాలో అవుతారు.మరి
మనమెందుకు వేరొకరి కల్చర్ ని ఫాలో అవుతున్నామో ప్రతి ఆడది మనస్సాక్షిని అడిగి తెలుసుకోవాలి.

ఇంట్లో ఆడపిల్లలుఉంటే.... చిన్నతనం నుంచే పద్ధతిగా సాంప్రదాయమైన వస్త్రాలంకరణ నేర్పించడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. కర్తవ్యం కూడా....
మన కల్చర్నే కాదు...
వాళ్ళని వాళ్లు రక్షించుకోవడంలో కూడా వస్త్రాలంకరణ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పద్ధతిగా వస్త్రాలంకరణ చేసుకున్న ఏ ఆడదాన్ని ఏ మగాడు కన్నెత్తి కూడా చూడడు.
పైగా వాళ్లలో వాళ్ళ అమ్మనో, అక్కనో, చెల్లి గానో భావించి గౌరవిస్తారు.

 మనం ధరించే దుస్తులును బట్టి కూడా మనకు గౌరవ మర్యాదలు లభిస్తాయి.
సంప్రదాయమైన వస్త్రాలంకర ధరించి సొసైటీలో గౌరవ మర్యాదలు పొందుతారో లేక అసహ్యం కలిగేలా ఛీ అనిపించుకుంటారో అది మీ చేతిలోనే ఉంటుంది.

మన కట్టుబొట్టును, మన సంప్రదాయాలను, మన ఆచారాలను ,మన పద్ధతులను ,పాటించడం స్ట్రీ గా పుట్టిన ప్రతీ ఒక్కరి బాధ్యత.
స్త్రీలతో పాటు పురుషులు కూడా బాధ్యత వహించాలి.
అప్పుడే మన సాంప్రదాయాలు మంట కలిసి పోకుండా కాపాడుకోగలుగుతాము.
నేటి భావితరాల వాళ్ల కు వాటిని బహుమానంగా అందజేయగలుగుతాము.

సర్వేజనా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment