Friday, April 24, 2026

 🔔 *సామాజికం* 🔔

లోకంలో మనుష్యులు నాలుగు రకాలు
ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.
స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!

*స్వార్ధ*:-
తనూ, భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.

 *పరార్ధ*:- 
తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు ఉదా:- వృక్షములు, నదీనదములు, గోవులు వగైరా.

 *పరమార్ధ*:- 
కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు. ఉదా:- ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.

   *వ్యర్ధ* :- 
అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం  కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు.

No comments:

Post a Comment