Sunday, June 7, 2026

12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం ♂️

12 సంవత్సరాల అఖండ బ్రహ్మచర్యం ♂️

Author Name:TonsOfVeerya

Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BrcpVmKNeqU



Transcript:
(00:00) మీరు 12 సంవత్సరాల పాటు అఖండ బ్రహ్మచారిగా అనగా భగవత్ బ్రహ్మచర్యంలో ఉండగలిగితే వేరే ఇతర సాధన లేకుండానే మీరు తక్షణమే భగవంతుని సాక్షాత్కరించుకుంటారు. అఖండ అనే పదాన్ని గమనించండి. అది ముక్కలు కానిది లేదా అమరమైనది. 12 సంవత్సరాలు అవిచ్చిన్నమైన బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తి 12 ఏళ్ల పాటు వీర్యపు చుక్కని కూడా బయటకి రానివ్వని అఖండ బ్రహ్మచారి అవుతాడు.
(00:39) అటువంటివాడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే సమాధిని పొందుతాడు. ప్రాణం మనసు అతని సంపూర్ణ అదుపులో ఉంటాయి. అఖండ బ్రహ్మచారికి బాల బ్రహ్మచారి అనేది పర్యాయ పదం అతను ధ్యాన సాధన చేయనవసరం లేదు అతను మహావాక్యాన్ని ఒక్కసారి విన్నా చాలు వెంటనే ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు కానీ అఖండ బ్రహ్మచారులు చాలా చాలా అరదు కానీ కొందరు ఉన్నారు మీరు కూడా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అఖండ బ్రహ్మచారి కావచ్చు అయితే ప్రతిచర్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నెలలు లేదా
(01:27) ఒకటి రెండు సంవత్సరాల పాటు అదుపులో ఉంచబడిన ఇంద్రియాలు మీరు ఎల్లప్పుడూ జాగరుకతతో జాగ్రత్తగా లేకపోతే తిరుగుబాటు చేస్తాయి. అవకాశం దొరికినప్పుడు అవి తిరుగుబాటు చేసి మిమ్మల్ని బయటకు లాకెళ్తాయి. ఒకటి రెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించే కొందరు మరింత ఉద్వేగభరితులై చివరికి తమ శక్తిని గణనీయంగా వృధా చేస్తారు.
(02:02) కేవలం జడలు కట్టుకున్న జుట్టు నుదుటికి శరీరానికి భస్మం పూసుకున్నంత మాత్రాన ఎవ్వరూ అఖండ బ్రహ్మచారి కాలేరు. భౌతిక శరీరాన్ని భౌతిక ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని నిరంతరం లైంగిక ఆలోచనలలోనే మునిగి ఉండే బ్రహ్మచారి ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చు. బ్రహ్మచర్య సాధనలో ఎవరితోనూ అతి చనువుగా ఉండవద్దు. చనువు చులకన భావాన్ని పెంచుతుంది. స్నేహితులను పెంచుకోవద్దు.
(02:36) స్త్రీలతో స్నేహం కోసం ప్రయత్నించవద్దు. స్త్రీలతో చనువుగా ఉండడం చివరికి మీ నాశనానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని ఎన్నటికీ మరచిపోవద్దు. స్నేహితులే మీ నిజమైన శత్రువులు విరుద్ధమైన లింగాలతో చెందిన వారితో కలవద్దు. ఎందుకంటే మాయ అంతర్వాహికల ద్వారా ఎంత రహస్యంగా పని చేస్తుందంటే మీ నిజమైన పతనం గురించి మీకే తెలియకపోవచ్చు.
(03:09) మీరు వ్యభిచారం చేసి ఆపై పశ్చాత్తాప పడతారు. అప్పుడు మీ శీలం మీ కీర్తి మాయమవుతాయి. అవమానం అనేది మరణం కన్నా ఘోరమైనది. దీనికన్నా హేయమైన నేరం మరొకటి లేదు. దీనికి ప్రాయశ్చిత్వం కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. భగవాన్ దత్తాత్రేయుడు స్త్రీని మండుతున్న అగ్నిగుండంతోను పురుషుడిని నెయ్యి కుండతోను పోల్చాడు.
(03:45) రెండవది మొదటి దానిని తాకినప్పుడు అది నశించిపోతుంది. మీరు ధర్మశాలలో గాని సత్రంలో గాని నివసిస్తుంటే మీ పక్కగదిలో ఒంటరి స్త్రీ ఉంటే వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళండి. ఎందుకంటే ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు తపస్సు మరియు ధ్యానం ద్వారా ఎంత బలంగా ఉన్నప్పటికీ ప్రమాదకరమైన ప్రదేశం నుండి వెంటనే వెళ్ళిపోవడం శ్రేయస్కరం.
(04:20) మిమ్మల్ని మీరు ప్రలోభాలకు గురి చేసుకోకండి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభకుడిగా ఉన్నప్పుడు మీ బలాన్ని పవిత్రతను పరీక్షించుకోవద్దు. పాపాన్ని అపవిత్రతను ఎదుర్కొనే ధైర్యం మీకు ఉందని చూపించడానికి మీరు నవయవ్వనంగా ఉన్నప్పుడు చెడు సహవాసాల్లోకి తొందరపడి వెళ్ళవద్దు. అది ఒక తీవ్రమైన పొరపాటు అవుతుంది. ఒక చిన్న నిప్పురవ్వ దుమ్ము కుప్పతో కూడా సులభంగా ఆరిపోతుంది.
(04:57) మీరు సాధన ప్రారంభంలో స్త్రీలకు దూరంగా ఉండాలి. మీరు బ్రహ్మచర్యంలో సంపూర్ణంగా రూపుదిద్దుకొని సుస్థిరంగా స్థిరపడిన తర్వాత మీ శక్తిని పరీక్షించుకోవచ్చు. ఏనుగు తన తలపై తానే ఇసుక పోసుకున్నట్లుగా అవివేకం వల్ల తలపైకి కష్టాలను బాధలను తెచ్చుకోకూడదు.

No comments:

Post a Comment