Can You Really Trust Them? Chanakya's ArthaShastra | Telugu Audio Podcast EP03 | LifeOrama
Author Name:LifeOrama
Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DvAe4ALeDL4
Transcript:
(00:00) మీరు వాళ్లకు తోడుగా నిలబడ్డారు వాళ్ళు మీకు అండగా ఉంటారని నమ్మారు వాళ్ళ మీద మీకు అసలు ఏమాత్రం డౌట్ లేదు కానీ సడన్ గా ఒక రోజు ఎటువంటి గొడవలు అరుపులు కేకలు ఇవేమీ లేకుండా ఒక చిన్న విషయాన్ని మాత్రం గమనించారు. వాళ్ళు చెప్పేది ఒకటయితే చేసేది ఇంకోటి మిమ్మల్ని నిలువున ముంచేసే ఒక నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో తెలుసా వాళ్ళకి ఇదంతా ముందే తెలుసు ఆ పని జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే అదే గదిలో ఉన్నారు.
(00:31) పైగా మరుసటి రోజు ఏమి తెలియనట్టు మీతో కలిసి కాఫీ తాగుతూ అంతా మామూలే అన్నట్టు నటించారు. ఆ ఫీలింగ్ మనసుకి బరువెక్కినట్టు కడుపులో ఏదో తిప్పేసినట్టు ఉంటుంది. ఇది కోపం కాదు అంతకంటే లోతైనది. అసలు మనం ఎవరిని నమ్మామో కూడా మనకు తెలియలేదనే ఆ చేదు నిజం మనల్ని కాల్చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో మనం ఆ ఫీలింగ్ గురించే మాట్లాడుకోబోతున్నాం.
(00:55) ఆ ఫీలింగ్ ని తట్టుకోవడం ఎందుకు అంత కష్టం అంటే మీరు అమాయకులు కారు చదువుకున్నవారు లోకం ఎలా ఉంటుందో మీకు తెలుసు మనుషుల మైండ్సెట్ మీకు అర్థమవుతుంది. ఏదైనా తేడా జరిగితే పసిగట్టగలరు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మంచి చెడు అంటే ఏంటో తెలుసుకునే విచక్షణ కూడా ఉంది. పోనీ కనీసం ఇవన్నీ మీకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు.
(01:15) అయినా సరే ఇది మీకే జరిగింది. కాబట్టి మీ మనసులో మిగిలే ప్రశ్న ఒకటే వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? దానికి సమాధానం కూడా మీ దగ్గరే ఉంది. మనుషులు ఎప్పుడూ తమ స్వార్థం చూసుకుంటారు. అది సింపుల్. దాంతో మీరు కాంప్రమైజ్ అవ్వగలరు. కానీ మిమ్మల్ని వేధించే ప్రశ్న నేను దీన్ని ముందుగా ఎందుకు గుర్తించలేకపోయాను? దీని వెనక ఒక చేదు నిజం ఉంది.
(01:39) మన జడ్జ్మెంట్ మీద మనకే అనుమానం మొదలవుతుంది. నేను మరీ ఎక్కువగా నమ్మేసానా నాకు మనుషుల్ని అంచనా వేయడం రాదా లోకమంతా నాటకం ఆడుతుంటే నేను మాత్రమే దాన్ని చూడలేకపోతున్నానా ఈ ఆలోచన మనిషిని అలసిపోయేలా చేస్తుంది. ఇది ఆ ఒక్కరి మీద మాత్రమే కాదు అందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదైనా పర్సనల్ విషయం చెప్పాలంటే భయం, సాయం అడగాలంటే డౌట్ ఎదుటివారి మాటల్లో పరమార్థాన్ని వెతకడం మొదలు పెడతారు.
(02:05) మనుషుల మధ్య ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు. నిజానికి ఇది అన్యాయం మీరు తప్పు చేయలేదు నమ్మడం బలహీనత కాదు అదొక బలమే. కానీ మీకంటూ ఒక సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా అవతల వాళ్ళని నమ్మేస్తున్నారు. నష్టం జరగకముందే మనుషులను ఎలా చూడాలనే ఆ ఫ్రేమ్ వర్క్ ఇవ్వడమే ఈ ఎపిసోడ్ కు ఉన్న లక్ష్యం. రియల్ లైఫ్ లో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫీస్ లో ఒక కలీగ్ మీటింగ్స్ లో చాలా ఆత్మీయంగా ఉంటారు. మీతో సపోర్టివ్ గా మాట్లాడతారు.
(02:31) మీరు చెప్పేదానికి ఎప్పుడూ తలుపుతారు. కానీ చిన్న చిన్న చేంజెస్ గమనిస్తారు. ఒక ప్రాజెక్ట్ కి అప్రిసియేషన్ వచ్చినప్పుడు మీకు రావాల్సిన క్రెడిట్ మెల్లగా వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. మీరు సీక్రెట్ గా చెప్పిన మాటలు ఎక్కడో బయట వినపడ్డాయి. మీరు ప్రూవ్ చేయలేరు. కానీ అది వాళ్లే అని మీకు తెలుస్తుంది.
(02:50) పర్సనల్ లైఫ్ లో అయితే మీకు బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ ని తీసుకోండి. మీ కష్ట సుఖాలన్నీ వారికి తెలుసు కానీ గమనించండి మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు వాళ్ళ రియాక్షన్ లో తేడా ఉంటుంది. వాళ్ళ ఆనందం కూడా పైపైన నవ్వుతున్నట్టే ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా ఉండదు. అదే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే వాలిపోతారు. మీరు బాధలో ఉన్నప్పుడే వాళ్ళు మీతో క్లోజ్ గా ఉండగలరు.
(03:13) ఇక బిజినెస్ లో అయితే మొదట్లో మీకున్న విజన్ ని మ్యాచ్ అయిందని అనిపించిన పార్ట్నర్ మీరు వాళ్ళని పూర్తిగా నమ్మారు కానీ అసలైన డెసిషన్స్ ఖర్చులు మొదలైనప్పుడు వాళ్ళ తీరు మారుతుంది. అంతా స్వార్థమే అనిపిస్తుంది. ఒకే లక్ష్యం కాస్త ఇద్దరి వేరు వేరు దారుల్లా మారిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం అవతల వ్యక్తి చెడ్డవాడని కాదు నష్టం జరగకముందే వాళ్ళను అంచనా వేసే పద్ధతి మీకు తెలియకపోవడమే.
(03:39) చాణక్యుడి దగ్గర ఆ పద్ధతి ఉంది. అర్థశాస్త్రంలో 2300 ఏళ్ల క్రితమే రాసిన ఆ సిస్టం ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో పక్కాగా పనిచేస్తుంది. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. అర్థశాస్త్రం అనేది స్పిరిచువల్ టెక్స్ట్ లేదా ఫిలాసఫికల్ టెక్స్ట్ కాదు. హ్యూమన్ హిస్టరీ లోనే షార్పెస్ట్ పొలిటికల్ మైండ్స్ లో ఒకరైన చాణక్యుడు రాసిన డీటైల్డ్ ప్రాక్టికల్ మాన్యువల్.
(04:00) ఒక రాజుకి సలహాలు ఇవ్వడానికి చాణక్యుడు దీన్ని రాశాడు. కానీ ఆయన చేసిన అసలు పని ఏంటంటే పవర్ మనీ ఫియర్ అండ్ డిజైర్ ఇవి ఎదురుపడ్డప్పుడు ఉన్న పరిస్థితుల్లో హ్యూమన్ బిహేవియర్ ఎలా పని చేస్తుంది ఎలా ఉంటుంది అని బాగా స్టడీ చేసి ఆయన గమనించిన విషయాలన్నీ డీటెయిల్డ్ గా రాసి పెట్టారు. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు ఆ ప్రవర్తన వెనక ఏముంటుంది అది బయటకు ఎలా కనిపిస్తుంది ఇదంతా డాక్యుమెంట్ చేసి మనకు అందించారు.
(04:30) ఫస్ట్ బుక్ లో ఒక రాజు దగ్గర ఉండే ఇన్నర్ సర్కిల్ లో ఎవరు ఉండాలో చాణక్యుడు ఒక సిస్టం ని బిల్డ్ చేశాడు. అదే అమాత్య. అమాత్య అనే పదాన్ని సింపుల్ గా చెప్పాలంటే ట్రస్టెడ్ ఇన్నర్ కౌన్సిల్ ఎవరి సలహాల ప్రకారం అయితే మీరు నడుచుకుంటారో ఎవరి మీద మీరు డిపెండ్ అవుతారో ఎవరికైతే మీ అసలు సిచువేషన్ తెలుస్తుందో మీ ప్లాన్స్ మీ వల్నరబిలిటీస్ తెలిసిన మనుషులే మీ అమాత్యులు.
(04:53) ఈ పేరు క్లాసిక్ గా వినడానికి చాలా బాగుంది కదా అయితే ఇక్కడ ఒక నిమిషం ఆగండి మీ సొంత లైఫ్ గురించి ఆలోచించండి మీ అమాత్యులు ఎవరు మీరు మనస్ఫూర్తిగా ఎవరి మీద డిపెండ్ అవుతారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు వాడిన క్రైటీరియా ఏంటి వాళ్ళ మంచితనమా లేక పాత పరిచయాలా అది కాక వాళ్ళతో ఉంటే మీకు వచ్చే ఫీలింగా చాణక్యుడి పాయింట్ ఏంటంటే ఆ క్రైటీరియాస్ ఒక్కటే సరిపోవు.
(05:17) ఆయన రాసిన వాటిల్లో నెక్స్ట్ పాయింట్స్ చాలా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన వాళ్ళకి రివార్డ్స్ ఎలా ఇవ్వాలి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి లేదా వాళ్ళతో ఇంకా బెటర్ రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాలు చెప్తూ టైం వేస్ట్ చేయలేదు. అసలు ఎవరిని ఆ పొజిషన్ లోకి అస్సలు రానివ్వకూడదో అది వివరించారు. ఆయన మెయిన్ ఫోకస్ నమ్మకం పెంచడం మీద లేదు.
(05:39) నమ్మకం ఇవ్వకముందే మనుషులను క్లియర్ గా చూసే ఎబిలిటీని బిల్డ్ చేయడం మీద ఉంది. అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్ మనలో చాలా మంది దీనికి ఆపోజిట్ గా చేస్తారు ముందే ట్రస్ట్ ఇచ్చేస్తారు. వాళ్ళ పలకరింపు బాగుందని లేక వాళ్ళతో పాత పరిచయం ఉందని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారేమో అంటూ వెయిట్ చేస్తారు.
(06:02) ఇక్కడ నమ్మకం పెట్టుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాణక్యుడు ఏమంటాడంటే ముందే అబ్సర్వ్ చేయండి. మీరు ఎవరిని చూస్తున్నారో అర్థం చేసుకోండి ఆ తర్వాత ఈ మనిషికి మన లైఫ్ లో ఎంత యక్సెస్ ఇవ్వాలో డిసైడ్ అవ్వండి. ఆయన కోల్డ్ హార్టెడ్ గా ఉండటం లేదు ప్రిసైస్ గా ఉంటున్నాడు. రెండిటికీ చాలా తేడా ఉంది. కోల్డ్ హార్టెడ్ గా ఉండటం అంటే మనుషులను దూరం పెట్టడం ప్రిసైజ్ గా ఉండటం అంటే మనుషులను క్లియర్ గా చూడటం.
(06:26) చాణక్యుడు రెండో దాన్ని చేయమంటున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చాణక్యుడు దీన్ని కేవలం ఏదో రాజుల కోసమో రాజ్యాల కోసమో రాయలేదు. ఆయన రాసింది హ్యూమన్ నేచర్ గురించి పవర్, మనీ, డిజైర్ ఫియర్ మనుషులు తమ అసలు రంగు బయట పెట్టే ఈ పరిస్థితులు 2300 ఏళ్ల నుంచి అస్సలు మారలేదు. మీ ఆఫీస్ లో అయినా మీ ఫ్యామిలీలో అయినా మీ ఫ్రెండ్షిప్స్ లో అయినా ఇవి ఒకేలా ఉంటాయి.
(06:50) అన్ని అప్డేట్ అయినా కూడా హ్యూమన్ నేచర్ పెద్దగా అప్డేట్ అవ్వదు. అందుకే అర్థశాస్త్రం ఇప్పటికీ రెలవెంట్ గా ఉంటుంది. అది ఎప్పుడో పాతకాలం నాటిదైనా అందులో చెప్పిన పాటర్న్స్ ఇప్పుడు మీ WhatsAppట్ గ్రూప్స్ లో కూడా ఉన్నాయి. మీ టీం మీటింగ్స్ లో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మీకు ఆల్రెడీ తెలిసిన మనుషుల్లోనే అవన్నీ మీరు గమనించగలరు. కాకపోతే అది వాళ్ళకి తెలీదు మీకు తెలీదు.
(07:12) చాణక్యుడు చెప్పిన ఈ పాటర్న్స్ ఆయన గమనించమన్న బిహేవియర్ సిగ్నల్స్ ఏవో హిస్టారికల్ క్యూరియాసిటీస్ కావు అవి మీ లైఫ్ లో ఇప్పుడే ఉన్నాయి. మీరు ఆల్రెడీ బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్స్ లోనే ఉన్నాయి. మీరు ఆ సిగ్నల్స్ ని చూస్తూనే ఉన్నారు. కాకపోతే మీరు చూస్తున్న దానికి ఒక పేరు పెట్టడానికి మీ దగ్గర సరైన లాంగ్వేజ్ లేదు. దాన్ని ఇవాళ మారుద్దాం.
(07:33) నేను చెప్పే పాయింట్స్ అన్నీ విన్న తర్వాత ఒకసారి మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇవన్నీ చెక్ చేయండి. మీకు పిచ్చ క్లారిటీ ఉంటుంది. మనుషులు తమ గురించి తాము ఏం చెప్పుకుంటారో దాన్ని బట్టి చాణక్యుడు వాళ్ళను అసెస్ చేయరు. ఒక వ్యక్తి నేను ఇలా ఉంటాను అలా చేస్తాను నా వాల్యూస్ ఇవి నా ఇంటెన్షన్స్ అవి అని ఇచ్చే స్టేట్మెంట్స్ గురించి ఆయన అస్సలు పట్టించుకోడు.
(07:56) ఆయన కేవలం బిహేవియర్ ని మాత్రమే చూస్తాడు. అది కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో గమనిస్తాడు. ఆ అబ్జర్వేషన్ నుండే మీ లైఫ్ లో ఎవరికి పూర్తి యక్సెస్ ఇవ్వకూడదో చెప్పే నాలుగు పాటర్న్స్ ని ఆయన గుర్తించాడు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి పాటర్న్ లాయల్టీ దట్ ఇస్ కండిషనల్ ఆన్ కన్వీనియన్స్.
(08:19) రిలేషన్షిప్ తమకు అనుకూలంగా ఉన్నంత కాలం సపోర్ట్ చేస్తూ తీరా ఏదైనా నష్టం వస్తుందనగానే మెల్లగా జారుకునే వ్యక్తిని చాణక్యుడు ఇక్కడ వివరిస్తున్నాడు. వీళ్ళు మిమ్మల్ని ఏదో దారుణంగా మోసం చేసినట్టు అనిపించదు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక టెస్ట్ కు గురి కాలేదు అంతే ఇక్కడ చాణక్యుడు ఒక కీ ఇన్సైట్ ఇచ్చాడు. అన్టెస్టెడ్ లాయల్టీ అసలు లాయల్టీఏ కాదు అది కేవలం అలైన్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అంటే ఇద్దరు వ్యక్తులు వేరు వేరు కారణాల వల్ల ఒకే దారిలో వెళ్తున్నారు.
(08:48) అటువంటి వ్యక్తి మీ లైఫ్ లో ఉంటే వాళ్ళు మీ కోసం అక్కడ లేరు. మీ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఆ మోమెంట్ కి కలిసాయి కాబట్టి మీ పక్కన ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఇష్టాలు వేరుపడతాయో వాళ్ళు కూడా మెల్లగా తప్పుకుంటారు. అప్పటివరకు లాయల్టీ అనుకున్నది కాస్త కేవలం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని మీకు అర్థమవుతుంది. మీకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళక ఏమీ నష్టం లేనప్పుడు వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో చూసి వాళ్ళు మనవాళ్ళు అనుకోలేం.
(09:13) స్టాండింగ్ సంవేర్ వెన్ ఇట్ ఇస్ ఫ్రీ అనేది అసలు పొజిషనే కాదు. అదొక డీఫాల్ట్ సెట్టింగ్. ఇక రెండో పాటర్న్ ద ఫ్లాటరర్. దీని గురించి చాణక్యుడు చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు. మీకు ఏం వింటే బాగుంటుందో అదే ఎప్పుడూ చెప్తూ మీకు ఏది అవసరమో ఆ మాటలు అస్సలు చెప్పని వ్యక్తులు వీళ్ళు. చాణక్యుడి కాలంలో ఇలాంటి వాళ్ళు రాజులకు చాలా డేంజరస్.
(09:36) ఎందుకంటే చుట్టూ పొగిడే వాళ్ళు ఉంటే రాజుకి తన సిచువేషన్ ఏంటో స్పష్టంగా అర్థం కాదు. రియాలిటీతో సంబంధం లేకుండా తనకు కంఫర్ట్ ఇచ్చే విధంగా ఫిల్టర్ అయిన విషయాలే నమ్ముతూ నిర్ణయాలు తీసుకుంటాడు. రియాలిటీ కంటే తన ఇమేజ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాడు. మీ లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ అపోజ చేయని వారు ఐడియాస్ లో తప్పులు ఎంచని వారు కనీసం ప్రొడక్టివ్ ఫ్రిక్షన్ ని కూడా క్రియేట్ చేయని వారు మీ ఫ్రెండ్స్ కాదు.
(10:01) వాళ్ళు మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అంతే. రెండు వైపుల నుంచి అగ్రీమెంట్ ఉంటే రిలేషన్షిప్ స్మూత్ గా ఉంటుందని డిసగ్రీమెంట్ ఉంటే డిస్కంఫర్ట్ వస్తుందని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు. అందుకే వాళ్ళు స్మూత్నెస్ నే ఎంచుకుంటారు. దీనివల్ల మీరు మెల్లగా క్లియర్ థింకింగ్ కి దూరమైపోతారు. మీకు తెలియకుండానే మీరు ఒక డిస్టార్టెడ్ పిక్చర్ లో ఉండిపోతారు.
(10:22) ఫ్లాటరర్ అంటే సాధారణంగా మనకి చాలా కంఫర్టబుల్ గా అనిపించే మనిషి. అందుకే చాణక్యుడు వాళ్ళని ఒక ప్రాబ్లం గా చెప్పాడు. మూడో పాటర్న్ ద పర్సన్ హూ సర్వ్స్ టూ ఇంట్రెస్ట్స్ ఎట్ ద సేమ్ టైం రెండు కంప్యూటింగ్ పార్టీస్ తో సంబంధాలు పెట్టుకొని అందులో అసలు కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదని కలరింగ్ ఇచ్చే వ్యక్తిని చాణక్యుడు ఇక్కడ పాయింట్ అవుట్ చేశాడు.
(10:44) అతని కాలంలో ఇది ఎలా ఉండేదంటే రాజు దగ్గర ఉంటూనే పక్క రాజ్యంతో కూడా టచ్ లో ఉండటం. మీ కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మీతో క్లోజ్ గా ఉంటూనే మిమ్మల్ని అపోజ్ చేస్తూ పని చేసే వాళ్ళతో కూడా అంతే క్లోజ్ గా ఉండే కలీగ్ అన్నమాట. రెండు వైపులా ఇన్ఫర్మేషన్ ఉంచుకుంటారు కానీ దేన్ని పూర్తిగా షేర్ చేయరు. అందరికీ తామ ఒక న్యూట్రల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటారు.
(11:05) ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పర్సన్ అందరికీ జెన్యూన్ అలై అయ్యాడంటే అతను ఎవ్వరికీ జెన్యూన్ అలై కానట్టే అసలైన లాయల్టీకి ఒక సైడ్ ఎంచుకునే ధైర్యం ఉండాలి. కష్టమైన సమయంలో ఒకవైపు నిలబడే మనోధైర్యం ఉండాలి. ఎప్పుడూ ఒక పక్షం వహించకుండా అన్ని వైపులా కంఫర్టబుల్ గా ఉండాలనుకునే వ్యక్తిని మనం ఏమాత్రం నమ్మలేం. అది వాళ్ళు అబద్ధాలు చెప్తారని కాదు వాళ్ళకి తమ కంఫర్ట్ అండ్ పొజిషనింగ్ మాత్రమే ముఖ్యమని అర్థం.
(11:32) వాళ్ళ నెట్వర్క్ లో మీరు కేవలం ఒక రిలేషన్షిప్ మాత్రమే వాళ్ళు మీకు ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి కాదు. నాలుగో పాటర్న్ ఇన్కన్సిస్టెన్సీ అండర్ ప్రెజర్. చాణక్యుడు చెప్పిన సిగ్నల్స్ లో ఇది చాలా స్పష్టమైనది. కానీ చాలామంది దాన్ని గమనించరు. ఎందుకంటే ఇది తెలియాలంటే చాలా ఓపిక ఉండాలి. చాణక్యుడు ఏమంటాడంటే అంతా ఈజీగా ఉన్నప్పుడు మనిషిని అబ్సర్వ్ చేయకండి రూపాయి ఖర్చు లేనప్పుడు ఎవరైనా మంచిగా స్వీట్ గా ఉండగలరు.
(12:00) ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళని చూడండి. ఒక టఫ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు డబ్బు సమస్య వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మీ స్టేటస్ మారినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందో గమనించండి. ఆ మోమెంట్ లో మీ వల్ల వాళ్ళకి వచ్చే లాభాన్ని బట్టి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారా? వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడుంటే అక్కడికి మాట మారుస్తున్నారా మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటికి సమాధానాలు దొరుకుతాయి.
(12:25) ఇన్కన్సిస్టెన్సీ అండర్ ప్రెజర్ అనేది అసలైన సిగ్నల్ ఎందుకంటే దీన్ని ఎంతో కాలం ఫేక్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒక సందర్భంలో లాయల్టీని నటించవచ్చు. కానీ నెలలు ఏళ్ళు గడిచే కొద్దీ ఆ రిలేషన్షిప్ లో ఉన్న అసలు స్ట్రక్చర్ బయటపడి తీరుతుంది. చాణక్యుడు మిమ్మల్ని ఆ స్ట్రక్చర్ ని చూడమంటున్నాడు. అంతేకానీ ఆ ఒక్క మోమెంట్ ని కాదు అర్థశాస్త్రం మొదటి బుక్ లో చాణక్యుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు.
(12:50) నమ్మకమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఎలా టెస్ట్ చేయాలో ఒక మెథడ్ ని వివరించాడు. అది గొడవ పడకుండా ఇంటరోగేషన్స్ లేకుండా ఉంటుంది. నాలుగు స్పెసిఫిక్ కండిషన్స్ లో వాళ్ళని చాలా ఓపిక్ గా సిస్టమాటిక్ గా అబ్సర్వ్ చేయడమే ఆ పద్ధతి. చాణక్యుడు ఈ నాలుగు కండిషన్స్ ని ధర్మ, అర్థ, కామ అండ్ భయ అని పిలుస్తాడు. ఈ కాంటెక్స్ట్ లో వీటి అర్థాల విషయానికి వస్తే ధర్మ అంటే వాల్యూస్, అర్ధ అంటే మెటీరియల్ గెయిన్, కామ అంటే డిజైర్ భయ అంటే ఫియర్.
(13:20) ఒక మనిషిని ఈ నాలుగింటిలో అబ్సర్వ్ చేస్తే వాళ్ళ అసలు రూపం ఏంటో మీకు తెలిసిపోతుంది. చాణక్యుడు చెప్పేది ఇదే ఒక వ్యక్తికి ఏదైనా మెటీరియల్ గేన్ వస్తున్నప్పుడు గమనించండి. ఇది అర్థ కండిషన్. వాళ్ళకి ప్రమోషన్ వచ్చినప్పుడు ఏదైనా రికగ్నిషన్ వచ్చినప్పుడు లేదా విలువైనది ఏదైనా దొరికినప్పుడు అన్నమాట. ఇంకా వాళ్ళు ఏదైనా కోల్పోతామేమో అనే భయంలో ఉన్నప్పుడు గమనించండి.
(13:41) ఇది భయ కండిషన్ వాళ్ళ ప్రాజెక్ట్ రిస్క్ లో ఉన్నప్పుడు డబ్బుకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ స్టేటస్ కి త్రెట్ వచ్చినప్పుడు అలాగే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది దొరికే ఛాన్స్ ఉన్నప్పుడు గమనించండి. ఇది కామా కండిషన్ ఒక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యంబిషన్ నెరవేరే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే వాల్యూస్ అసలైన ఖర్చులు ఏర్పడ్డప్పుడు గమనించండి.
(14:02) ఇది ధర్మ కండిషన్. సరైనది చేయాలంటే ఏదైనా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు నిజాయితీగా ఉండాలంటే ఏదైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తం నాలుగు కండిషన్స్ లోనూ గమనించండి ఒకటి రెండు అని వదిలి పెట్టకండి ఆ నాలుగు పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసిన తర్వాతే మీరు ఒక జెన్యూన్ డెసిషన్ తీసుకునేంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందని చెప్పాడు.
(14:24) దీనికి నెలలు లేదా ఏళ్ళు పట్టొచ్చు. కానీ మనం నమ్మకం విషయంలో ఎలా డెసిషన్స్ తీసుకుంటామో ఆలోచించండి. మనం మొదటి కొన్ని కాన్వర్సేషన్స్ లోనే డిసైడ్ అయిపోతాం. వాళ్ళ మాటతీరు వాళ్ళ చామ్ వాళ్ళు మనకు ఎంత సిమిలర్ గా ఉన్నారో ఇవి చూసి వచ్చిన ఆ కనెక్షన్ ఫీలింగ్ తో డెసిషన్ తీసుకుంటాం. ఆ ఫీలింగ్ తప్పని చాణక్యుడు అనడం లేదు. కానీ నిజంగా ఏదైనా స్టేక్ లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వాళ్ళ గురించి మీకు ఏమీ చెప్పదు.
(14:50) ఆ కనెక్టెడ్ ఫీలింగ్ అనేది ఒక రిలేషన్షిప్ కు మొదలు మాత్రమే కానీ ధర్మ అర్థ కామ భయ ఈ నాలుగింటిలో అబ్సర్వ్ చేస్తే ఆ రిలేషన్షిప్ కి ఉన్న అసలు స్ట్రక్చర్ అర్థమవుతుంది. రెండూ ముఖ్యమే కానీ అవి వేరు వేరు మనలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే మొదటి దాన్నే రెండో దానిగా భావిస్తాం. 2002 లో రీసెర్చర్స్ అయిన డెల్రాయ్ పోలస్ అండ్ కెవిన్ విలియమ్స్ ఒక స్టడీ పబ్లిష్ చేశారు.
(15:16) అందులో వాళ్ళు డార్క్ ట్రయాడ్ అని పిలిచే మూడు పర్సనాలిటీ పాటర్న్స్ ని ఐడెంటిఫై చేశారు. ఇవి ఎక్కడో విపరీతమైన కేసుల్లో కాదు మనలాంటి ఆర్డినరీ పీపుల్ లో ప్రతి రోజు మనతో పాటు ఉండే వాళ్ళల్లో ఉంటాయి. మనతో పని చేసే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళల్లో మామూలుగా కనిపించే మనుషుల్లోనే ఇవి మీరు గమనించగలరు. ఈ మూడు పాటర్న్స్ ఏంటంటే నార్ససిజం, మాక్యవెలనిజం అండ్ సైకోపాతీ.
(15:42) మన డిస్కషన్ కి ఈ రీసెర్చ్ ఎందుకు ముఖ్యం అంటే ఆ పేర్ల కోసం కాదు ఆ పాటర్న్స్ నిజ జీవితంలో ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడు అవి భయపెట్టేలా ఉండవు. చాలా చార్మింగ్ గా సక్సెస్ఫుల్ గా సోషల్లీ స్కిల్డ్ గా లైకబుల్ గా కనిపిస్తాయి. మాక్యవెలనిజం. దీన్ని నికోలో మాక్యవెలి అనే పొలిటికల్ ఫిలాసఫర్ పేరు మీద పెట్టారు.
(16:04) ఆయన పవర్ కోసం మనిపులేషన్ ని ఎలా వాడాలో రాశారు. ఈ పాటర్న్ ఉన్నవాళ్ళు తమ సొంత లాభాన్ని రిలేషన్షిప్స్ కంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఆ రిలేషన్షిప్ కి కమిటెడ్ గా ఉన్నారని కాదు ప్రస్తుతానికి అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంతే చాలా ఈజీగా అందరికీ నచ్చేస్తారు. సోషలీ స్కిల్డ్ గా ఉంటారు. మాటల్లో అన్నిటికీ ఒప్పుకుంటారు. మీ గురించి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకుంటారు.
(16:27) వాళ్ళతో ఉంటే మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకుంటారని ఫీల్ అయ్యేలా చేస్తారు. వాళ్ళ పొజిషనింగ్ కి పనికొచ్చేలా ఒకేసారి ఎన్నో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ట్రస్ట్ వర్తీగా ఎలా నటించాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ వాళ్ళలో నిజాయితీ ఉండదు. ఇది చాణక్యుడు చెప్పిన ఫ్లాటరర్ అండ్ టూ ఇంట్రెస్ట్ సర్వెంట్ కి మోడర్న్ సైకాలజీలో ఉన్న పేరు.
(16:48) ఇక్కడ సెంచరీ వేరైన బిహేవియర్ పాటర్న్ ఒక్కటే. సబ్ క్లినికల్ నార్సిసిజం. ఇది చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు ప్లెజెంట్ గా ఉంటారు లేదంటే సైలెంట్ గా కోల్డ్ అయిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యేలా మీరు ఎంత ఉపయోగపడతారు అన్న దాని మీదే వాళ్ళ లాయల్టీ ఆధారపడి ఉంటుంది.
(17:10) మీ సక్సెస్ వాళ్ళకి పనికొస్తుందంటే మీ ఎదుగుదల వల్ల వాళ్ళకు పేరు వస్తుందంటే వాళ్ళు మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీ సక్సెస్ వాళ్ళతో పోటీ పడుతుందో లేక మీ అవసరం వాళ్ళకు లేకపోయినా ఆ రిలేషన్షిప్ ని సైలెంట్ గా క్లోజ్ చేస్తారు. మీకు అర్థం కాకపోయినా ఆ మార్పు మీరు ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ నిజమే అదే మీకుొక సిగ్నల్ పాలస్ అండ్ విలియమ్స్ వీళ్ళు కనుక్కున్న విషయం చాణక్యుడి అర్థశాస్త్రంలో ఉన్న పాయింట్స్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది.
(17:36) ఈ పాటర్న్స్ అన్నీ చాలా మందిలో కలిసే ఉంటాయి. ఇలాంటి వాళ్లే మన సొసైటీలో చాలా సక్సెస్ ఫుల్ గా ఉంటారు. ఎందుకంటే మన సొసైటీలో హనెస్టీతో ప్లెజెంట్ గా ఉండటం కంటే చాటుగా నటించే వాళ్ళకే ఎక్కువ రివార్డ్స్ దొరుకుతాయి. అలా నటించగలిగే వాళ్లే ఫాస్ట్ గా ఎదుగుతారు. పైకి చాలా ట్రస్ట్ వర్తిగా కనిపిస్తారు. అందుకే వాళ్ళని అంచనా వేయడం కష్టం.
(17:58) చాణక్యుడు 2300 ఏళ్ల క్రితమే దీన్ని కనిపెట్టాడు. అప్పుడు ఆయన దగ్గర సైకాలజీ లాంటి పదాలు లేవు. కానీ ఆయన దగ్గర ఒక పద్ధతి ఉంది. ధర్మ, అర్థ, కామ, భయ, అనే నాలుగు కండిషన్స్ లో మనుషుల ప్రవర్తనను అబ్జర్వ్ చేయడం. రెండు వేరు వేరు కాలాలు, రెండు వేరు వేరు పద్ధతులు కానీ ఆ మనిషి తత్వం ఒకటే. ఇప్పుడు ఒక మూడు సిచువేషన్స్ గమనిద్దాం.
(18:21) సిచువేషన్ వన్, ద సపోర్టివ్ కలీగ్ హూ ఇస్ ఆల్సో యువర్ కాంపిటీషన్. మీరు ఒక మిడ్ సైజ్ కంపెనీలో లేదా ఎదుగుతున్న స్టార్టప్ లో పని చేస్తున్నారు అనుకుందాం. అక్కడ మీ లెవెల్ లోనే ఒక పియర్ ఉన్నాడు. గ్రూప్ సెట్టింగ్స్ లో లేదా డైరెక్ట్ గా మీతో మాట్లాడేప్పుడు వాళ్ళు మీ ఐడియాస్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టే కనిపిస్తారు. అందరి ముందు మీ పనిని మెచ్చుకుంటారు.
(18:41) వాళ్ళు మీ సైడ్ ఉన్నారనే మీరు నమ్ముతారు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించడం మొదలు పెడతారు. వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్స్ లో వాళ్ళు మీ ప్లాన్స్ గురించి టైం లైన్స్ గురించి చాలా డీటెయిల్డ్ గా అడుగుతారు. ఒక ప్రాజెక్ట్ మీద మీకున్న భయాలు లేదా డౌట్స్ ఏంటో తెలుసుకుంటారు. అదేదో క్యూరియాసిటీతో అడుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత మీరు లేని చోట అవే డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఎవరో ఒకరు పాయింట్ అవుట్ చేస్తారు.
(19:03) మీ పేరు నేరుగా చెప్పకపోయినా అది మీ పరిస్థితిని ఇతరులు చూసే విధానాన్ని మెల్లగా మార్చేస్తుంది. మీకున్న సెల్ఫ్ డౌట్ లేదా ఇతర ఇన్సెక్యూరిటీస్ ని ఎవరో ఒకరు తమ పొజిషన్ కోసం ఒక టూల్ లా వాడుకున్నారు. మీరు దీన్ని నిరూపించలేరు. కానీ మీరు దాన్ని ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్ కరెక్టే ఇదే చాణక్యుడు చెప్పిన థర్డ్ పాటర్న్ రెండు ఇష్టాల కోసం పని చేయడం.
(19:25) ఇక్కడ షేర్ చేయడం అనే పనిని ఆపడం అసలు సొల్యూషన్ కాదు. అసలు ఆ వ్యక్తి ఏ అబ్జర్వేషన్ స్టేజ్ లో ఉన్నారో అర్థం చేసుకోవడమే సొల్యూషన్. మీరు వాళ్ళని ధర్మ, అర్థ, కామ, భయ అనే ఆ నాలుగు కండిషన్స్ లో చూశారా? ఒకవేళ లేదంటే మీరు వాళ్ళని కేవలం ఈజీ కండిషన్స్ లోనే చూశారు. ఆ పరిస్థితి వాళ్ళ గురించి ఏమీ చెప్పదు. ఎవరికైనా ఎంత యాక్సెస్ ఇవ్వాలనేది ఆ నాలుగు పరిస్థితులు డిసైడ్ చేయాలి.
(19:53) ఒక మనిషి చేసే పలకరింపుతో అన్నిటిని డిసైడ్ చేసుకోకూడదు. ఇక సిచువేషన్ట ద క్లోస్ ఫ్రెండ్ హూస్ వామ్ హాస్ ఏ స్ట్రక్చర్ చాలా ఏళ్ల నుంచి మీ లైఫ్ లో ఉన్న ఒక ఫ్రెండ్ మీ కష్టాల్లో తోడున్నారు. మీ యంబిషన్స్ మీ పాస్ట్ మీ భయాలు అన్ని వాళ్ళకు తెలుసు. మీరు వాళ్ళని చాలా బాగా నమ్ముతారు. ఆ నమ్మకం కరెక్టే అని కూడా ఫీల్ అవుతారు. కానీ రీసెంట్ గా మీరు ఒక విషయాన్ని గమనించారు.
(20:14) దాన్ని బయటకు చెప్పడానికి కూడా మీకు కొంచెం గిల్టీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు చాలా ముఖ్యం. మీ లైఫ్ లో అంతా బాగున్నప్పుడు మీరు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కొంచెం తేడాగా ఉంటుంది. ఆ ఆనందం ఏదో నటిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ మనస్ఫూర్తిగా అనిపించదు. వాళ్ళ రియాక్షన్ లో ఏదో తెలియని టైట్నెస్ ఉంటుంది.
(20:33) అది మీరు ఫీల్ అవ్వగలరు. అదే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళు వెంటనే అందుబాటులోకి వస్తారు. చాలా సపోర్టివ్ గా ఉంటారు. వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు కానీ మీతో వాళ్ళకు ఉన్న రిలేషన్షిప్ లో ఒక తెలియని స్ట్రక్చర్ ఉంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వాళ్ళు మీతో ఈక్వల్ గా ఫీల్ అవ్వగలరు. మీ సక్సెస్ వాళ్ళకి తెలియని ఒక గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది.
(20:56) మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. చాణక్యుడి ఫ్రేమ్ వర్క్ ప్రకారం ఈ వ్యక్తి అర్థ కండిషన్ లో పాస్ అవ్వలేదు. ఏదైనా విలువైన విషయం స్టేక్ లో ఉన్నప్పుడు అది మీ ఎదుగుదల మీ సక్సెస్ లేదా మీ విన్నింగ్ మూమెంట్ ఇలా ఏదైనా కావచ్చు వాళ్ళ బిహేవియర్ ఒకలా మారిపోతుంది. అది అనుకోకుండా జరిగింది కాదు ఆ రిలేషన్షిప్ కు ఉన్న అసలు స్ట్రక్చరే ఇది.
(21:17) మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ని కట్ చేయక్కర్లేదు. కానీ మీ సక్సెస్ ని మీ ఆనందాన్ని పంచుకోవడానికి మీకు వేరే మనుషులు కావాలి. అది హనెస్టీ అనిపించుకుంటుంది. ఇక సిచువేషన్ 3 ద బిజినెస్ పార్ట్నర్ హూస్ అలైన్మెంట్ వాస్ ఆల్వేస్ కండిషనల్ మీరు ఎవరితోనో కలిసి ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ లోకి లేదా ఒక ప్రొఫెషనల్ కొలాబరేషన్ లోకి ఎంటర్ అయ్యారు.
(21:39) మొదట్లో విజన్ అంతా ఒక్కటే అనిపిస్తుంది. ఒకే ఎనర్జీ ఒకే గోల్ ఉన్నట్టు అనిపించింది. మీరు వాళ్ళని నమ్మారు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. అంతా రియల్ గానే అనిపించింది. కానీ పని మొదలయ్యాక అసలైన ఖర్చులు వచ్చాక అంటే టైం, మనీ, సాక్రిఫైస్ ఇవన్నీ ఎంటర్ అయినప్పుడు అవతలి వ్యక్తి తీరు మారడం మీరు గమనిస్తారు. ప్రతి డెసిషన్ తమకు లాభమా కాదా అని ఆలోచిస్తారు.
(22:00) మొదట్లో ఒకేలా కనిపించిన ఆ విజన్ మెల్లమెల్లగా రెండు వేరు వేరు దారులుగా విడిపోతుంది. కేవలం ఆ ఓవర్లాప్ ఉన్నంత కాలం వాళ్ళు మీతో ఉన్నారు. అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. చాణక్యుడి ఫ్రేమ్ వర్క్ ప్రకారం మీరు ఇప్పుడు ప్రెజర్ కండిషన్ లో ఉన్నారు. ఇదే భయ స్టేజ్ అంటే ఏదో కోల్పోతామేమో అనే భయం ఇక్కడ మీరు చూస్తున్నది మోసం కాదు ఇది ఒక అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ ఆ రిలేషన్ ఎప్పుడూ ఇలాగే ఉంది.
(22:27) కాకపోతే మొదట్లో దాన్ని చూసే పరిస్థితులు లేవు. ఇప్పుడు కనిపిస్తున్నదే ఆ రిలేషన్షిప్ కు ఉన్న అసలు స్ట్రక్చర్. సో ఈ త్రీ సిచువేషన్స్ లోనూ చాణక్యుడు చెప్తున్నది ఏంటో గమనించండి. ఆయన అందరినీ అనుమానించమని చెప్పడం లేదు. ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నాడు. దీని ద్వారా మీరు ఎవరి మీద అయితే పూర్తిగా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా ఆ నమ్మకానికి అర్హులేనా అని చూసుకోవచ్చు.
(22:49) ఎవరైతే ఆ నమ్మకాన్ని ఇంకా సంపాదించుకోలేదో వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం దూరం ఉంచడం ముఖ్యం. ఇది టఫ్నెస్ తో కాదు క్లారిటీతో చేయాలి. మీ ఎనర్జీ, మీ వల్నరబిలిటీస్, మీ అసలు స్వరూపం కేవలం అర్హులైన వాళ్ళకే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇవ్వాలి కూడా అంతేకానీ ఎవరికి పడితే వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయిపోకండి. ఇది క్రూయల్టీ కాదు మెచూరిటీ మీ రిలేషన్స్ ని ఎంతో హానెస్ట్ గా చూడటం అంటారు.
(23:15) ఒకప్పటి చాణక్యుడు అడుగుతున్నది కూడా ఇదే అర్థశాస్త్రం నుండి నేరుగా వచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం లేదా వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు అనే చిన్న చిన్న విషయాల నుంచి వాళ్ళ క్యారెక్టర్ ని చదవడానికి ట్రై చేయకండి. చాణక్యుడు చెప్పినట్టు ఆ ఫోర్ కండిషన్స్ లో వాళ్ళ బిహేవియర్ ని అబ్సర్వ్ చేయడం మొదలు పెట్టండి.
(23:36) నిజమైన రిలేషన్షిప్స్ లో కాలక్రమేణ సహజంగానే వచ్చే ఆ మూడు విషయాలతో స్టార్ట్ చేయండి. మొదటిది వాళ్ళకి ఏదైనా లాభం కలిగినప్పుడు గమనించండి. మీ లైఫ్ లో ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు అంటే ఒక ప్రమోషన్ రికగ్నిషన్ ఏదైనా ఒక మంచి వార్త లేదా ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు మీ పట్ల వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుందో గమనించండి. వాళ్ళు ఇంకా మంచిగా మారుతున్నారా? ఓపెన్ గా ఉంటున్నారా? వాళ్ళ సక్సెస్ లో మీ పాత్ర ఉంటే దాన్ని గుర్తిస్తున్నారా? వాళ్ళ సంతోషంలో మిమ్మల్ని కూడా జెన్యూన్ గా కలుపుకుంటున్నారా లేక వాళ్ళు కొంచెం సెల్ఫ్ ఫోకస్డ్ గా మారుతున్నారా ఎక్కడో కాస్త స్టేటస్ కాన్షియస్ అవుతున్నారా
(24:12) వాళ్ళ పొజిషన్ మారగానే వాళ్ళ లైఫ్ లో మీ ఇంపార్టెన్స్ కూడా మారుతుందా ఇవన్నీ చూడాలి. మనం ఇక్కడ పర్ఫెక్షన్ కోసం చూడటం లేదు. మనం చూస్తున్నది వాళ్ళ బిహేవియర్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనే పాయింట్ మాత్రమే. వాళ్ళకి ఏదైనా దొరికినప్పుడు వాళ్ళ ప్రవర్తన మీకు ఫేవరబుల్ గా ఉంటుందా? లేక మీకు దూరంగా వెళ్తుందా? ఆ డైరెక్షన్ లోనే మీకు సమాధానం దొరుకుతుంది.
(24:34) ఇక రెండోది వాళ్ళు ఏదైనా కోల్పోయినప్పుడు గమనించండి. మీ లైఫ్ లో ఎవరికైనా ఒక సెట్ బ్యాక్ ఎదురైనప్పుడు అంటే ఏదైనా ఫెయిల్యూర్ ఆఫీస్ లో ఇబ్బందులు లేదా వాళ్ళు బాగా లో గా ఉన్నప్పుడు వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో చూడండి. వాళ్ళు మీ దగ్గర నిజాయితీగా ఉంటున్నారా? అసలు ఏం జరుగుతుందో మిమ్మల్ని చూడనిస్తున్నారా? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఒప్పుకుంటున్నారా? లేక అప్పుడు కూడా వాళ్ళ ఇమేజ్ ని మేనేజ్ చేస్తున్నారా? లోపల ఎంత కష్టంలో ఉన్నా పైకి మాత్రం అంతా కంట్రోల్ లో ఉన్నట్టు నటిస్తున్నారా ఎవరైతే మీ దగ్గర జెన్యూన్ గా వల్నరబిలిటీని చూపిస్తారో తమ కష్టాన్ని మీతో పంచుకుంటారో
(25:09) వాళ్ళు మీకుొక అసలైన విషయాన్ని చూపించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆ విషయంలో ఎప్పుడూ నటించడం అనేది చాలా కష్టం. ఎవరైతే తమ ప్రైవేట్ మూమెంట్స్ లో కూడా ప్రెజెంటేషన్ ని మేనేజ్ చేస్తారో వాళ్ళ అసలు రూపం ఎప్పటికీ బయటకు రాదు. మీకు తెలిసింది వాళ్ళు ప్లాన్ చేసిన వర్షన్ మాత్రమే ఆ వ్యక్తి అసలు తీరు అది కాదు.
(25:32) ఇక మూడోది మీ వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేనప్పుడు గమనించండి. ఇది చాలా సింపుల్ మీ దగ్గర ఇప్పుడు ఎటువంటి రిసోర్స్ గాని వాళ్ళకు ఉపయోగపడే కనెక్షన్ గాని లేనప్పుడు వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉందో చూడండి. అప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చే మంచి ఫీలింగ్ అలాగే ఉందా? కాన్వర్సేషన్ ఇంకా కొనసాగుతుందా? వాళ్ళకి ఏ అవసరం లేకపోయినా మీకు రీచ్ అవుతున్నారా? మీ లైఫ్ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా? లేక మీ వల్ల మళ్ళీ ఏదైనా ఉపయోగం వచ్చే వరకు ఆ రిలేషన్షిప్ సైలెంట్ అయిపోయిందా దీనికోసం మీరు ప్లాన్ చేసుకోక్కర్లేదు.
(26:01) లైఫ్ లో ఇలాంటి పరిస్థితులు నాచురల్ గానే వస్తాయి. ప్రాజెక్ట్స్ ఎండ్ అవుతాయి అవసరాలు తీరిపోతాయి. ఒక బిజీ ఫేజ్ తర్వాత ఒక సైలెంట్ ఫేజ్ వస్తుంది. ఆ మధ్య ఉన్న గ్యాప్ లో ఈ రిలేషన్షిప్ కి ఏమవుతుందో గమనించండి. అది మీకు చాలా విషయాలు చెప్తుంది. ఇప్పుడు మీ మైండ్ లో ఒక డౌట్ రావచ్చు. ఇదంతా ఒక కోల్డ్ హార్టెడ్ వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉంది కదా రిలేషన్స్ ని ఏదో ట్రాన్సాక్షన్స్ లా చూస్తున్నట్టుంది.
(26:25) మనుషుల్ని నమ్మడం మానేసి వాళ్ళను ఆడిట్ చేస్తున్నట్టు ఉందని అనిపించొచ్చు. చాణక్యుడు సరిగ్గా ఇదే డౌట్ ని ముందే ఊహించి దానికి ఒక ఆన్సర్ కూడా ఇచ్చాడు. అది మనం బాగా ఆలోచించాల్సిన విషయం. ఆయన అందరిని అనుమానించమని చెప్పడం లేదు. అందరితోనూ ప్రేమగా సాయంగా ఉండొద్దని కూడా అనడం లేదు. వెనక్కి తీసుకోలేనంతటి లోతైన నమ్మకాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు కొంచెం ఓపిక్ గా ఉండమని అంటున్నాడు.
(26:50) మీ అసలు పరిస్థితులు మీ భయాలు మీ ప్లాన్స్ ఇవన్నీ షేర్ చేసే ముందు ఆలోచించమంటున్నాడు. ఎప్పుడైతే మీకు ఈ క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు అందరితోనూ కోల్డ్ హార్టెడ్ గా ఉండరు. నిజానికి దానికి పూర్తి ఆపోజిట్ జరుగుతుంది. మీ లైఫ్ లో ఆల్రెడీ ఆ నాలుగు కండిషన్స్ ని దాటిన రిలేషన్షిప్స్ ఏవో మీకు క్లియర్ గా కనిపిస్తాయి.
(27:12) అప్పుడు ఆ రిలేషన్స్ లో మీరు ఎటువంటి భయం లేకుండా మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ నమ్మకం ఏదో సడన్ గా వచ్చింది కాదు వాళ్ళు సంపాదించుకున్నది అవుతుంది. ఎవరికీ ఎంత యక్సెస్ ఇవ్వకూడదో తెలిసినప్పుడే అర్హులైన వాళ్ళతో మీరు పూర్తిగా ఓపెన్ గా ఉండగలరు. అదే నిజమైన నమ్మకానికి ఉండే ఫౌండేషన్. ఇది మీ ఎనర్జీని సరైన చోటు పెట్టడం. ఈ వారం స్టార్ట్ చేయడానికి ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తాను.
(27:36) మీ ఇన్నర్ సర్కిల్ లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. వాళ్ళ మీద మీకు ఎటువంటి అనుమానం లేకపోయినా పర్వాలేదు. ఈ వారం ఆ రిలేషన్ లో మీరు కొత్తగా ఏమి చేయక్కర్లేదు. జస్ట్ ఇందాక చెప్పిన ఆ మూడు పరిస్థితుల్లో ఏది ఎదురైనా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో గమనించండి. దానికి మీరు ఏమి రియాక్ట్ అవ్వకుండా జస్ట్ అబ్సర్వ్ చేయండి. ఒకవేళ మీరు గమనించింది మీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే ఆ ఫీలింగ్ కూడా ఒక డేటా పాయింట్ అవుతుంది.
(28:04) ఒకవేళ అది మీ నమ్మకాన్ని ఇంకా పెంచితే ఆ కన్ఫర్మేషన్ మరింత విలువైనది అవుతుంది. ఏ రిజల్ట్ వచ్చినా అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది రియాలిటీ మీద ఆధారపడి ఉంది. ఆ గమనించడం అనేది చాణక్యుడి దృష్టిలో మనుషుల గురించి తెలిసే అస్సలైన జ్ఞానానికి మొదలు. ఈ ఎపిసోడ్ ని మనం ఒక ఫీలింగ్ తో స్టార్ట్ చేశం. మనం పూర్తిగా నమ్మిన వ్యక్తి మనకు తెలిసిన మనిషి కాదని అర్థమైనప్పుడు సైలెంట్ గా వచ్చే అనీజీనెస్ ఒక మనిషిని మనం తప్పుగా అంచనా వేసామని అర్థమైన ఆ క్షణం అది ఒక్కసారిగా జరిగింది కాదు మెల్లగా ఒక్కొక్క విషయాన్ని చూశాక మనకు క్లారిటీ వచ్చింది.
(28:38) ఈ ఫీలింగ్ మీకు ముందే తెలుసు కాబట్టే మీరు ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ ని వింటున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ గురించి ఇంకొక విషయం అర్థమయింది. అది మనల్ని మార్చేస్తుంది. ఆ ఫీలింగ్ మీ అమాయకత్వానికి ఎవిడెన్స్ కాదు మీకు మనుషులను చదవడం రాదని కూడా కాదు లేక మీ జడ్జ్మెంట్ పాడైపోయింది అనే కంక్లూజన్ అంతకంటే కాదు అసలు విషయం ఏంటంటే అప్పుడు మీ దగ్గర ఒక ఫ్రేమ్ వర్క్ లేదు మీరు మనుషుల పలకరింపుని వాళ్ళ లాయల్టీ అనుకున్నారు.
(29:04) మీ మధ్య ఉన్న కనెక్షన్ ని వాళ్ళు కన్సిస్టెన్సీ అనుకున్నారు. వాళ్ళతో ఉన్న పరిచయాన్ని వాళ్ళపై పెట్టుకునే నమ్మకం అని మీరు అనుకున్నారు. కానీ ఇవన్నీ ఒకటే కాదని ఇప్పుడు మీకు తెలుసు. చాణక్యుడి అర్థశాస్త్రం మనకొక కొత్త ఇన్సైట్ ఇచ్చింది. కేవలం మాటలు కాదు ధర్మ, అర్థ, కామ అండ్ భయ అనే నాలుగు పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తనను చూడమంటుంది.
(29:25) కేవలం కనెక్షన్ కాదు ఆ రిలేషన్ లో ఉన్న అసలు స్ట్రక్చర్ ని పరీక్షించే మోమెంట్స్ లో అబ్జర్వేషన్ ముఖ్యమంటుంది. కేవలం పరిచయం కాదు ఏదైనా నిజమైన రిస్క్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నారో ఓపికతో గమనించమంటుంది. ఇది చాణక్యుడి కాలం నాటి జ్ఞానం. మీ లైఫ్ కి ఇప్పుడే కాదు ఎప్పటికీ అవసరమే దీని అర్థం అందరిని తక్కువగా నమ్మమని కాదు మీరు ఎవరినైనా నమ్మినప్పుడు అది వాళ్ళు మీకు నిరూపించుకున్న దాన్ని బట్టే నమ్ముతున్నారని అర్థం ఏదో గాలిలో కాదు ఒక పద్ధతి ప్రకారం అబ్సర్వ్ చేసి నమ్ముతున్నారు.
(29:56) అలాంటి నమ్మకం మనకు దొరికినప్పుడు దాన్ని బిల్డ్ చేసుకున్నప్పుడు అందులో మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే అదే రియల్ అది వాళ్ళు సంపాదించుకున్న నమ్మకం. ఈ ఎపిసోడ్ మొదట్లో మనం చెప్పుకున్న ఆ అనీజీ ఫీలింగ్ ఉంది కదా అది మీకు ఇకపై చాలా తక్కువగా ఎదురవుతుంది. ఎందుకంటే మీరు అందరినీ అనుమానిస్తున్నారని కాదు మీరు క్లియర్ గా ఉన్నారు కాబట్టి వెనక్కి తీసుకోలేని నమ్మకాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు ఆ రిలేషన్ కు ఉన్న అసలు అర్థాన్ని మీరు ముందే తెలుసుకుంటున్నారు.
(30:24) చాణక్యుడు మనకి ఇదే క్లారిటీని ఇస్తున్నాడు. ఆఖరిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ లైఫ్ లో ఏదైనా ఒక రిలేషన్ గురించి ఆలోచించండి. అది ప్రొఫెషనల్ లేదా పర్సనల్ కావచ్చు. ఎక్కడైతే మీ నమ్మకం కేవలం ఒక అజంప్షన్ మీద ఉండి తరువాత మీకు అసలు విషయం అర్థం అవుతుందో అది గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తి పేరు చెప్పక్కర్లేదు కానీ అది మీకు ఏ క్షణాన అర్థమైందో కామెంట్స్ లో చెప్పండి.
(30:48) అంటే వాళ్ళకి ఏదైనా లాభం తక్కినప్పుడు వాళ్ళ బిహేవియర్ మారిందా లేక అది భయ కండిషన్ అంటే ఏదైనా భయం లేదా నష్టం ఎదురైనప్పుడు వాళ్ళ అసలు రూపం బయట పడిందా? ఆ రిలేషన్ కు ఉన్న అసలు స్ట్రక్చర్ ని మీకు చూపించిన ఆ పరిస్థితి ఏంటి? నేను మిమ్మల్ని ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది మీ ఒక్కరికే కాదు అందరికీ జరుగుతుంది. మీ కామెంట్ చదివే వాళ్ళకి వాళ్ళ సొంత కథలా అనిపించొచ్చు.
(31:10) అందుకే మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు పరిస్థితులు మీ లైఫ్ లో ఆల్రెడీ అందులో ఏదో ఒకటి ఫేస్ చేసే ఉంటారు. కాకపోతే అప్పుడు దానికి ఒక పేరు పెట్టడం మీకు తెలీదు. ఇప్పుడు మీకు ఆ పేరు ఏంటో తెలుసు. కామెంట్స్ లో షేర్ చేయండి. నేను అన్ని చదువుతాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఆడియో పాడ్కాస్ట్ ఎపిసోడ్.
(31:31) నేను మీ లైఫ్ రామా తిరిగి కలుస్తూనే ఉందాం.
No comments:
Post a Comment