అలసిపోయాను.... బంధాలతో కాదు, ఆ వెనుక ఉన్న నాటకాలతో #lifelessons #lifetruths
Author Name:Nenilaa-unnanu
Youtube Channel Url:https://www.youtube.com/@salmashaik1027
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0F2NxOJweyc
Transcript:
(00:01) హలో హాయ్ నమస్తే అస్సలామ అలేకుం నేను ఎలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు? అలసిపోయాను నిజంగా చాలా అలసిపోయాను. శరీరానికి శ్రమ ఎక్కువైతే వచ్చే అలసట కాదు ఇది. రాత్రి పడుకుంటే పొద్దున్న కల తగ్గిపోవడానికి మనసుకు పట్టిన అలసట ఇది. ఈ రోజుల్లో చాలా మందిని గమనించండి. పైకి నవ్వుతూ ఉంటారు అందరితో కలిసిపోతున్నట్లుగా కనిపిస్తారు.
(00:26) రీల్స్ చేస్తారు పార్టీలకు వెళ్తారు కానీ ఒక్కసారి వాళ్ళ కళ్ళలోకి పరీక్షగా చూడండి. లోపల ఏదో ఒక నిశబ్దం ఏదో ఒక తెలియని విరక్తి కనిపిస్తుంది. మనం అనుకుంటాం వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వలేకనో డబ్బులు లేకనో లేదా ప్రేమించిన వాళ్ళు దూరమయ్యారనో బాధపడుతున్నారు అని కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లోనూికి 80 మంది మనుషులు మానసికంగా కుంగిపోవడానికి కారణం బంధాలు కాదు ఆ బంధాల వెనక రోజు వాళ్ళు చూస్తున్న మనుషుల నాటకాలు నమ్మకం అనే మాటకు అర్థం మార్చేసి ప్రతి బంధాన్ని ఒక బిజినెస్ లాగా మార్చేశరు ఈ రోజుల్లో మనకు ఒకరు గుర్తొచ్చి ఎంతో ఇష్టంగా గుండె నిండా
(01:05) ప్రేమతో వాళ్ళకు ఫోన్ చేస్తే అవతలి వ్యక్తి మన ఫోన్ లిఫ్ట్ చేసే ముందే వీడితో నాకేం అవసరం ఉంది వీడి వల్ల నాకేం లాభం అని లెక్కలు వేసుకునే అనే ప్రపంచం ఇది. ఎదురుగా ఉన్నప్పుడు మనకంటే ఆప్తులు ఎవరూ లేరు అన్నట్లు నటిస్తారు. మన కళ్ళలో ఆనందం కోసం ప్రాణం ఇచ్చేస్తాం అన్నట్టు బిల్డప్ ఇస్తారు.
(01:28) కానీ మనం వెనక్కు తిరిగేసరికి అదే నోటితో మన క్యారెక్టర్ ను ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఈ డబుల్ యాక్షన్లు ఈ ముసుగులు ఈ ఊసరవెల్లి రంగులు ఒకసారి కాదు రెండు సార్లు కాదు జీవితంలో ప్రతి అడుగులోనూ చూసి చూసి ఇక నా మనసు తట్టుకోలేకపోతుంది. బంధాలు వద్దు ఈ మనుషులు అసలే వద్దు అనేంత విరక్తి వచ్చేస్తుంది. అందుకే ఈరోజు చాలా ప్రశాంతంగా కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం.
(01:54) అసలు మనుషులు ఇలాంటి నాటకాలు ఎందుకు ఆడుతున్నారు? మనల్ని ప్రాణంగా ప్రేమించే బంధాల్లో కూడా ఈ స్వార్థం ఎందుకు వస్తుంది? మన చుట్టూ ఉంటూ మనల్ని వాడుకుంటూ మనల్ని మానసికంగా చంపేస్తున్న ఆ నటరా చక్రవర్తులను మనం ఎలా గుర్తించాలి? అసలు ఈ నాటకాలకు మనం ఎన్కార్డ్ ఎలా వేయాలి? ఈ వీడియో మీ జీవితంలో మీరు కోల్పోయిన మనశశాంతిని కాస్తైనా తిరిగి ఇస్తుందని నమ్ముతున్నాను.
(02:18) మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ నాటకాల గురించి ఈ ముసుగుల గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి కాలచక్రంలో వెనక్కి వెళ్ళాలి. ఒక 30 40 ఏళ్ల క్రితం నాటి రోజులను గుర్తు తెచ్చుకోవాలి. అప్పట్లో మనుషుల మధ్య బంధాలు ఎలా ఉండేవి అప్పట్లో ఒక ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే ఊరంతా కదలి వచ్చేది ఒకరి ఇంట్లో పెళ్లి ఉంటే అది ఆ ఒక్క కుటుంబం వేడుక కాదు ఊరి పండుగలా జరిగేది ఎందుకో తెలుసా అప్పట్లో మనుషులకు ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఒకరిని ప్రేమించడానికి ఎలాంటి కారణాలు అవసరం లేదు. బంధుత్వం ఉంటే చాలు పరిచయం
(02:56) ఉంటే చాలు గుండె నిండ మర్యాద ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉండేవి అప్పట్లో మనుషులకు ఒక సిద్ధాంతం ఉండేది మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పకూడదు అని ఒకరికొకరు సహాయం చేసుకునేటప్పుడు దీనివల్ల నాకేంటి లాభం అని ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు ఒకవేళ ఎవరి మధ్యనైనా గొడవలు వచ్చినా అవి ముఖం మీదే జరిగిపోయేవి. కోపం ఉన్నా ద్వేషం ఉన్నా నేరుగా అనేసేవాళ్ళు తప్ప లోపల ఒకటి పెట్టుకొని బయటకు నవ్వుతూ వెన్నుపోటి పొడిచే కపట నాటకాలు అప్పట్లో చాలా తక్కువ మనుషుల మనసులు అద్దంలా స్వచ్ఛంగా ఉండేవి కానీ ఈ రోజుల్లో నాటి ఈ ఆధునిక ప్రపంచంలోకి వద్దాం టెక్నాలజీ పెరిగింది.
(03:37) మనుషుల జీవన ప్రమాణాలు పెరిగాయి. చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మరి బంధాలు బంధాలు మాత్రం చాలా చీప్ గా అయిపోయాయి. ఈరోజు బంధం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోయింది. ఒకరితో స్నేహం చేయాలన్నా ఒకరితో రిలేషన్షిప్ లో ఉండాలన్నా ముందే ఒక బిజినెస్ ప్లాన్ రెడీ అవుతుంది. నేను వీళ్ళతో మాట్లాడితే నాకేం దొరుకుతుంది వీళ్ళ వల్ల నాకు ఏదైనా కెరియర్ గ్రోత్ ఉంటుందా వీళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా సొసైటీలో స్టేటస్ ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అయితేనే అక్కడ ఒక బంధం పుడుతుంది.
(04:11) ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే మీరు ఎంత మంచి వాళ్ళైనా ఎంత నిజాయితీ కలవాళ్ళైనా సరే ఈ సమాజానికి మీరు అవసరం లేదు. మిమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా గుర్తించరు. ఈ కాలంలో ప్రతి బంధం వెనక ఒక స్వార్థం దాగి ఉంది. ప్రేమిస్తున్నాం అనే మాట వెనక శారీరక లేదా ఆర్థిక స్వార్థం స్నేహం అనే ముసుగు వెనక అవసరాల లెక్కింపులు బంధుత్వం అనే పేరు వెనక ఆస్తుల అంతస్తుల అంచనాలు ఇవన్నీ ఉన్నాయి.
(04:40) నిజమైన బాధ ఎక్కడ వస్తుందంటే ఈ స్వార్థాన్ని వాళ్ళు ఓపెన్ గా చూపించరు. ఒకవేళ ఓపెన్ గా చూపిస్తే మనం ముందే జాగ్రత్త పడతాం. కానీ దానికి వాళ్ళు ప్రేమ అనే రంగు పూసి మన ముందు ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శిస్తారు. మనం ఆ నటనను చూసి నిజమైన బంధం అనుకొని మురిసిపోతాం. కానీ మన అవసరం తీరిపోగానే ఆ నాటకాన్ని ఆపేసి మనల్ని రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతారు.
(05:04) నాడు బంధాలు హృదయంతో ముడిపడి ఉండేవి. నేటి బంధాలు అవసరాలతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ తరం మనుషులు బంధాల కంటే ఆ బంధాల్లో ఎదురవుతున్న మోసాల వల్ల నాటకాల వల్లే ఎక్కువగా అలసిపోతున్నారు. సినిమాల్లో అయితే విలన్ అనేవాడు కరుడుగట్టిన మొఖంతో భయంకరమైన నవ్వుతో కనిపిస్తాడు. కాబట్టి మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు. కానీ రియల్ లైఫ్ లో విలన్లు విలన్లలా రారు మనకు అత్యంత ఆప్తుల్లా మన క్షేమాన్ని కోరే మంచి మనుషుల్లా వస్తారు.
(05:34) మన చుట్టూ ఉంటూ రోజు రకరకాల నాటకాలు ఆడే ఈ మనుషులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. వీళ్ళు ఎవరో ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం. మొదటి రకం ముఖస్తుతి చేసే ముట అంటే వీరి ఆయుధం అతిగా పొగడడం అన్నమాట. మీ ముఖంపై మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. నువ్వు తోపువు నువ్వు పెద్ద తురుమువు నీలాంటివాడు ఈ ప్రపంచంలోనే లేడు అంటూ మాటల తేనెలు పూస్తారు.
(06:00) మీ చిన్న తప్పులను కూడా గొప్ప విషయంగా చూపిస్తూ మిమ్మల్ని ఒక బ్రమలో బ్రతికేలా చేస్తారు. కానీ అసలు సంగతి ఏమిటంటే మీరు వెనక్కి తిరగగానే వీళ్లే మీ గురించి అత్యంత ఘోరంగా మాట్లాడతారు. మీ పరువు తీయడానికి అందరికంటే ముందుంటారు. వీళ్ళు మీ ముందే ఎందుకు అంతగా నటిస్తారంటే మీ దగ్గర ఏదో ఒక లాభం ఆశించి మిమ్మల్ని వాడుకోవడానికి ఇక రెండవ రహం అవసరాల బంధాలు వీళ్ళ నాటకం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ వీళ్ళకు మీతో పని ఉన్నప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తారు.
(06:31) ఆ సమయంలో వీళ్ళ ప్రేమ వర్ణనాతీతం ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. నువ్వే నా సర్వస్వం అంటారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తారు. కానీ ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిందా ఆ తర్వాత మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఒకవేళ పొరపాటున లిఫ్ట్ చేసినా బిజీగా ఉన్నాను బ్రో అంటూ నీళ్లు నముతారు. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం అవసరం తీరాక కలిపాకులా తీసి పడేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య.
(07:00) ఇక మూడవ రకం ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్. ఈ రకం మనుషులు చాలా డేంజర్. వీళ్ళ నాటకాల్లో సెంటిమెంట్ అనే సబ్జెక్టు ను వాడుకుంటారు. తప్పు మొత్తం వీళ్లే చేస్తారు కానీ మాట మార్చి ఆ తప్పు మీ వల్లే జరిగిందనే రేంజ్లో మిమ్మల్ని నమ్మిస్తారు. నువ్వు నా గురించి అసలు ఆలోచించవు. నేను నీకోసం అంత చేశాను.
(07:21) నువ్వు నాకుఇచ్చే గౌరవం ఇదేనా అంటూ డ్రామా ప్లే చేస్తారు. చివరికి తప్పు చేయని మీరు వాళ్ళ ముందు తలదించుకొని రీగ్రెడ్ ఫీల్ అయ్యేలా చేస్తారు. మీ ఎమోషన్స్ ని మీకున్న జాలి గుణాన్ని పెట్టుబడిగా పెట్టి వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు. ఇక నాలుగవ రకం వీళ్ళు నిశశబ్ద అసూయపరులు. పైకి మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా మీ శ్రోయోభిలాషుల్లా నటిస్తారు.
(07:44) మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీతో పాటే నవ్వుతారు కానీ లోలోపల మాత్రం కుల్లుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడ లైఫ్ లో సక్సెస్ అయిపోతారో ఎక్కడ వాళ్ళకంటే ముందుగా వెళ్ళిపోతారో అని లోలోపల ఒక భయం ఒక ఈర్ష వాళ్ళను తొలిచేస్తూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వస్తే పైకి చాలా జాలి చూపిస్తూనే లోపల మాత్రం వీడికి బాగా అయింది. వీడికి ఇలాగే జరగాలి అని పండుగ చేసుకుంటారు.
(08:07) ఈ నాలుగు రకాల మనుషులను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళఎవ్వరికీ మీపై నిజమైన ప్రేమ లేదు. వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పాత్రలను చాలా అద్భుతంగా పోషిస్తున్న మహానట్లు మాత్రమే మరి ఇలాంటి వాళ్ళను నమ్మి మన ప్రాణం ఇస్తే చివరికి మిగిలేది కన్నీళ్లే మనం బంధాల వల్ల అలసిపోవట్లేదు. ఈ నాలుగు రకాల మనుషులు రోజుకో వేషం వేస్తూ ఆడే నాటకాలను భరించలేక మన మనసు అలసిపోతుంది.
(08:32) ఇప్పటివరకు మనం అవతిలు వాళ్ళ తప్పుల గురించి వాళ్ళు వేసే వేషాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక్క క్షణం గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచిద్దాం. మన అనుమతి లేకుండా మనల్ని మానసికంగా గాయపరిచే శక్తి అవతలి వాళ్ళకు ఎలా వచ్చింది వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు సరే కానీ ఆ నాటకాలను ప్రతిసారి నమ్ముతూ వాళ్ళకు మన జీవితంతో ఆడుకునే అవకాశాన్ని ఇస్తున్నది ఎవరు మనమే కదా అవును తప్పు ఎప్పుడూ ఒకరి వైపే ఉండదు.
(09:00) వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు అంటే అక్కడ వాళ్ళ స్వార్థం ఎంత ఉందో తెలుసు. వాళ్ళకు మనం ఆ ఛాన్స్ ఇచ్చేలా ప్రవర్తించిన మన అమాయకత్వం కూడా అంతే ఉంది. ఈ నాటక రంగస్థలం మీద మనకు తెలియకుండానే మనం చేస్తున్న కొన్ని పెద్ద తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో ఉన్న అతి పెద్ద బలహీనత ఎవరైనా మనతో నాలుగు రోజులు నవ్వి బాగా సంతోషంగా మాట్లాడగానే వాళ్లే మన ప్రపంచం అనుకుంటాం.
(09:24) వాళ్ళ గతం ఏమిటో మనకు తెలియదు. వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో తెలియదు. కానీ అబ్బా ఎంత మంచి మనుషులు అని సర్టిఫికెట్ ఇచ్చేస్తాం. మన మనసులో ఉన్న రహస్యాలన్నీ మన బలహీనతలన్నీ తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడతాం. గుర్తుంచుకోండి మీరు ఎవరికైతే మీ బలహీనతలను చెప్తారో వాళ్ళ చేతికి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ఆయుధాన్ని ఇచ్చినట్టే ఆ తర్వాత వాళ్ళు నాటకం స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమి చేయలేము.
(09:49) మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడ బాధపడతారో మనల్ని ఎక్కడ తప్పుగా అనుకుంటారో అని మనకు ఇష్టం లేకపోయినా మన హెల్త్ సహకరించకపోయినా మన దగ్గర డబ్బు లేకపోయినా సరే అవతలి వాళ్ళు అడగగానే సరే అనేస్తాం మనల్ని మనం కష్టపెట్టుకొని మరీ వాళ్ళకు సహాయం చేస్తాం. దీనివల్ల అవతలి వాళ్ళకు ఏం అలవాటు అవుతుంది అంటే వీడికి ఎప్పుడు ఫోన్ చేసినా కాదనడు వీడిని ఎలా వాడుకున్నా పడి ఉంటాడు అనే ఒక చులకన భావం వస్తుంది.
(10:15) మీ మంచితనమే వాళ్ళకు ఒక లైసెన్స్ లాగా మారిపోతుంది. అందరికంటే ఎక్కువ ఎమోషనల్ మనుషులు చేసే తప్పు అవ్వతలి వ్యక్తి ఒకసారి అబద్ధం చెప్తాడు. సరే అని వదిలేస్తాం. రెండోసారి మనల్ని వాడుకుంటాడు. ఏదో పరిస్థితి బాగా లేక చేశడేమో అని మనమే వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. మూడోసారి మనల్ని ఇన్సల్ట్ చేస్తాడు అయినా కూడా వాడి మనసు మంచిది కోపంలో అన్నాడు అని మనల్ని మనమే మోసం చేసుకుంటాం.
(10:42) వాళ్ళ ముసుగులు ఊడిపోతున్న వాళ్ళ అసలు రంగులు స్పష్టంగా కనిపిస్తున్నా నా బంధం నన్ను వదిలిపోకూడదు అనే భయంతో ఆ చేదు నిజాన్ని ఒప్పుకోవడానికి మన మనసు అంగీకరించదు. ఒక అబద్ధపు బంధాన్ని పట్టుకొని అది నిజమైన బంధం అని నిరూపించడానికి తాపత్రయ పడుతూ ఉంటాం. మన సంతోషానికి రిమోట్ కంట్రోల్ ను తీసుకెళ్లి అవతలి వాళ్ళ చేతిలో పెడతాం. వాళ్ళు మెసేజ్ చేస్తే నవ్వుతాం.
(11:04) వాళ్ళు మాట్లాడకపోతే రోజంతా ఏడుస్తూ కూర్చుంటాం. ఎప్పుడైతే మీ సంతోషం పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడి ఉంటుందో అప్పుడు మీరు వాళ్ళకు బానిస అయినట్టే దీన్ని ఆసరగా చేసుకొని అవతలి వాళ్ళు తమకు నచ్చినట్లు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని కంటి పాపలా వాడుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ దోమలు ఎక్కువగా ఉన్న చోట మనం కూర్చుంటే అవి మనల్ని కుడతాయి. అది వాటి నైజం కానీ దోమలు కుడుతున్నాయని మనం అక్కడే కూర్చొని ఏడవడం మన మూర్ఖత్వం.
(11:31) వీలైతే దోమిత పెట్టుకోవాలి లేదా ఆ ప్లేస్ ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మనుషులు కూడా అంతే నాటకాలు ఆడడం వాళ్ళ నైజం కావచ్చు. కానీ ఆ నాటకాలకు ప్రేక్షకులుగా మారి రోజు మానసిక నరకం అనుభవించడం కచ్చితంగా మన తప్పే మనల్ని మనం మార్చుకోకుండా సమాజం మారిపోవాలి అని అనుకోవడం అపహాస్యం అవుతుంది. కొంతమంది అనుకుంటారు ఎవరో ఏదో నాటకాలు ఆడారు మోసం చేశారు దానికి ఇంతలా బాధపడాలా లైట్ తీసుకొని వదిలేయచ్చు కదా అని కానీ మాటలు చెప్పడం చాలా సులువు ఆ బాధను అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది.
(12:07) ఆ నటన వెనుక ఉన్న విషం మన జీవితాలను ఎంతలా నాశనం చేస్తుందో ఈ నాటకాలు ఈ ముసుగుల వల్ల కేవలం ఒక బంధం మాత్రమే దూరం కాదు మనకు తెలియకుండానే మన మానసిక ఆరోగ్యం మన శారీరక ఆరోగ్యం చివరికి మన కెరియర్ కూడా పాతాళానికి పడిపోతాయి. జీవితం అనేది చాలా చిన్నది. ఇక్కడ మనల్ని ప్రేమించే వాళ్లకు సమయం ఇవ్వడానికే టైం సరిపోవట్లేదు. అలాంటిది మనకు అవసరం లేని ముసుగులు వేసుకొని తిరిగే మనుషుల నాటకాలను చూస్తూ కూర్చోవడానికి ఇక్కడ ఎవరికీ ఓపిక లేదు.
(12:39) బంధాలు అనేవి మనకు బలాన్ని ఇవ్వాలి కానీ మనల్ని బలహీనపరిచేలా ఉండకూడదు. అలసిపోయింది చాలు ఇకనైనా మేల్కొనండి. మిమ్మల్ని మానసికంగా చంపేసే నాటకాల ప్రపంచం నుండి బయటకు రండి. ప్రశాంతంగా గర్వంగా మీ స్వేచ్ఛను మీ స్వచ్ఛమైన మనసుతో మీ సొంత జీవితాన్ని జీవించడం మొదలు పెట్టండి. ఈ రోజుతో మీ లైఫ్ లో ఉన్న ఫేక్ పీపుల్ నాటకాలకు ఎన్కార్డ్ పడేయాలని కోరుకుంటున్నాను.
(13:04) నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment