🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*తమిళనాడు లోని అరుణాచల ఆలయం లో జరిగిన యదార్థ సంఘటన :*
➖➖➖✍️```
ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటు ఉండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.
ఆ పిల్లలిద్దరు హుండీలోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు “ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా” అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... “అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా” అన్నాడు.
ఇద్దరు అరుణాచలుని కి ఎదురుగా నిలబడి “మా దొంగతనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఒడంబడిక (అగ్రిమెంట్) అన్నారు.
ఇలా ప్రతీరోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు,
ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు.
వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, “అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి” అని, “ఇదే మీ శిక్ష”అన్నాడు.
పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా.
ఇంతలో పూజారి, అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ.
ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.
అద్భుతం!!
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గర్భగుడి లోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ “అసలేం జరిగింది" అని అడిగాడు.
పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురుంచి చెప్పారు.
అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నమాట.
ఆలయంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??
నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బంధీయే !!.
అరుణాచలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపంలో, కాంతి స్తంభం (bheem of light) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో కలవు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖
No comments:
Post a Comment