భక్తిని కూడా బజార్లో కొనుక్కునే స్థాయికి దిగజారిపోవడం దారుణం! ఎంతో భక్తితో పూజ చేసి, పక్కవాడి ఇంట్లో వండిన ప్రసాదాన్ని దేవుడి ముందు పెడితే ఆ దేవుడు మెచ్చుతాడా? సమయం లేదు అనే సాకుతో దేవుడికి పెట్టే నైవేద్యాన్ని కూడా సుశీ, శుభ్రత లేకుండా స్నానం చేశారో లేదో తెలియదు మన కంటితో చూడని వ్యక్తులు వండిన ప్రసాదాలను దేవుడికి సమర్పించడం అచ్చమైన సోమరితనం. అమ్మేవాడిది తప్పు కాదు, స్వచ్ఛమైన భక్తిని కొనుక్కోవచ్చని అనుకునే కొనేవాళ్లదే పెద్ద తప్పు. దేవుడు ఆశించేది మన చేతులతో ప్రేమగా వండిన ఒక్క బెల్లం ముక్కనైనా సరే, అంతేకానీ కేజీల లెక్కన కొనుక్కొచ్చిన పిండివంటల బిల్లును కాదు. కొనుక్కొచ్చిన ప్రసాదాలు పెట్టి పూజలు చేస్తే ఫలితం రాకపోగా, అది నీ డొల్ల భక్తికి సాక్ష్యంగా మిగులుతుంది! ఈ వినాయక చవితి భక్తితో మన శక్తి కొలది చేసుకుందాం . ఎవరో ఇంట్లో ఉండిన ప్రసాదాలు కొని కాదు కే ఎస్ ఎన్ రెడ్డి న్యాయవాది
No comments:
Post a Comment