Friday, October 9, 2020

మంచి మాటలు

AVB సుబ్బారావు 🤝🕉️🌹💐
గురువారం --: 08-10-2020 :--ఈ రోజు మంచి AVB మాటలు ..

ప్రతీ సంవత్సరం కు ఒకసారి పండగ వస్తుంది పోతుంది కానీ ! మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మాట్లాడితే ప్రతి రోజు పండగ లా ఉంటుంది .

నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది , విధేయత ఉన్నచోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్నచోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది .

ప్రేమతో బంధాన్ని కలుపుకోవడానికి రక్త సంబంధమే కానక్కర్లేదు..? మంచి మనసుతో కలిసే ప్రతి బంధం గొప్పదే ...

మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు , అలా ఉంటారు అనుకోవడం మన భ్రమ , మనిషికి నిజంగా తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు.ఒకరిని కించపరచి తమని గొప్పగా చూపించుకోవటం బలహీనుల లక్షణం .ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతులు లక్షణం .

బంధం విలువ తెలియని వాళ్లు బాధ పెడుతూనే వుంటారు . బంధాన్ని విడతీసుకోలేని వాళ్ళు బాధ పడుతూనే వుంటారు . ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు ! అర్థం అయ్యే సమయానికి మనతో ఎవరు వుండరు .

✒️ సేకరణ మీ ... AVB సుబ్బారావు 💐🌹🤝🕉️

Source - Whatsapp Message

No comments:

Post a Comment