జీవిత సత్యo
జీవితంలో దేనికోసం ఎదురు చూడకు. ఎదురు చూడడం అంటే జీవితాన్ని, విలువైన సమయాన్ని వృధా చేయడమే.సంతోషం రెండు కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు. అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం. కలలని పరుగులెత్తిస్తే లాభం లేదు, వాస్తవాలను కలపాలి.శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య సంధి కాలం కాదు, యుద్ధం లేకపోవడమే శాంతి.ఆనందం ఉన్న చోట వినోదాలు అక్కర్లేదు. వినోదాలు ఉన్న చోట ఆత్మానందానికి తావు లేదు.సౌకర్యాలు పెరిగాయి, సదుపాయాలు పెరిగాయి, సౌఖ్యాలు పెరిగాయి. సంతోషమే సన్నగిల్లి పోయింది.ఒకరు మనపై జాలి పడడం మనకు గౌరవం కాదు. సానుభూతులు, సహాయాలతో జీవితం నిండదు. మనం మనంగా ఉన్నప్పుడే పదిమందిలో గౌరవం.ఇతరులతో నిన్ను పోల్చుకోవాలని చూడవద్దు. పోలిక విషం లాంటిది. వృద్ధిపై బుద్ధి పోనివ్వకుండా అడ్డుకునే దుర్మార్గపు లక్షణం పోలికలో ఉంటుంది.ప్రపంచం మారదు, మారాల్సింది నువ్వే.
ప్రేమించడం వేరు, ఒక వస్తువు కావాలనుకోవడం వేరు. కావాలనుకున్న ప్రేమ స్వార్థం అవుతుంది, అది బాధను మిగులుస్తుంది.ధ్యానం అంటే మన ఆలోచనలు, ప్రతిక్రియలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఆవేశాలు. వీటి స్వరూప స్వభావాలను, తత్త్వాలను అర్థం చేసుకుని అదుపు చేస్తేనే ధ్యానం సార్థకమవుతుంది.ఒకరివద్ద ఉన్నదేదో నీ వద్ద లేదు. అంటే నీ దగ్గర ఏదో లేదని కాదు, వాడి దగ్గర ఉంది కనుక నీకేదో లేదు అనిపిస్తోంది. ఇది కేవలం భావదారిద్య్రం మాత్రమే. ఉన్నదేదో ఉంది అని ఉన్నంతలో సరిపెట్టుకుంటే అంతకు మించిన ఆనందం లేదు.ఈ ప్రపంచానికి పెద్ద మార్పు అవసరం అని నువ్వు అనుకుంటే ఆ మార్పు ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని రాదు, నువ్వు మారితే ప్రపంచం దానంతట అదే మారుతుంది. కనుక మార్పు నీ నుంచే మొదలవ్వాలి.పరిపూర్ణమైన మౌనంలోనే వర్తమానం ఉంటుంది.సృష్టి అంటే ఉన్నదాన్ని కొనసాగించడం కాదు, కొత్త భవిష్యత్తుకు నాంది పలకడం. ఉన్నదానికి చిలవలు, పలవలు పెట్టడం కాదు, కొత్తదనాన్ని తీసు కురావడం.ఈ ప్రపంచం నీకు ఏమీ ఇవ్వదు. ఏది కావాలన్నా నువ్వే సంపాదించు కోవాలి. సంపాదన మొదలు పెట్టాలంటే అసలు నీకు ఏం కావాలో నీకే స్పష్టంగా తెలియాలి. లక్ష్యం నిర్ణయించుకున్నాకే వెతుకులాట మొదలు పెట్టు.పరమానందం కోసం వెతుకు, అది నీ జన్మ హక్కు. సుఖానుభూతుల అరణ్యంలో తప్పిపోకు.ధనం ఎప్పుడూ, ఎవ్వరినీ అధికారిని చెయ్యదు. అది మనిషిని బానిసను చేస్తుంది. చాకిరీ చేయిస్తుంది, నిర్మొహమాటంగా ఊడిగం చేయిస్తుంది. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా ఉండు. పరిసరాలు పాడయ్యాయని నువ్వు పాడైపోనక్కర్లేదు. ఇతరుల సుఖాలను బలి తీసుకుని బతకద్దు. అదే పవిత్రత అంటే. ఇతరుల సంతోషానికి చేయదగిన సాయం ఏదైనా ఉంటే రెండో ఆలోచన లేకుండా చేసిపెట్టు. అదీ పవిత్రతే. ధనికుడిని మించిన పేదవాడు ఎక్కడా లేడు. మామూలు పేదవాడికన్నా అతను రెండింతలు పేదవాడు. ధనికుడి దగ్గర డబ్బు మాత్రమే ఉంటుంది. దరిద్రుడి దగ్గర అభిమానం ఉంటుంది. ధనికుడు జీవిత కాలం భయపడుతూనే బతుకుతాడు. దరిద్రుడు నిర్భయంగా విహరిస్తాడు. ధనం – దాస్యం, దరిద్రం – స్వేచ్ఛ.
జిజ్ఞాసతో ఉన్న మనస్సును నాశనం చేస్తే అంతా నాశనమవుతుంది. మనసులేని మనిషి లేడు. మనస్సు లేకుంటే మానవత్వమూ లేదు. మనిషంటే జ్ఞానం. జ్ఞానం ఉంటేనే అన్వేషణ. అన్వేషణ అణగారి పోతే జీవితం సమాధి అవుతుంది. అందుకే జిజ్ఞాస బ్రతికుండాలి, ఏదో ఒకటి చేసి దాన్ని బ్రతికించాలి.
సహనం ప్రేమ కాదు. ప్రేమకు సహనం ఉండదు. ఆవేశం, ఆక్రోశం మాత్రమే ప్రేమ లక్షణాలు. భరించగల నేర్పు, ఓర్పు ప్రేమికులకు వరం. అవి ఉన్నవాడే ప్రేమించే సాహసం చేయాలి.
ఏదైనా కావాలనుకోవడం దు:ఖాన్ని పిలిచి తలకెక్కించుకోవడం. అన్ని బాధలకు ఆశే మూలకారణం. బతకడానికీ ఆశ కావాలి, ఉన్నతంగా ఎదగడానికీ ఆశ కావాలి. ఆశ నుంచి ఆశయం మొలకెత్తుతుంది. ఆశయం కోసం పాటు పడడం వేరు, ఆశతో కష్టాలు కొనితెచ్చుకోవడం వేరు.
ప్రపంచం మొత్తం తనకు విరుద్ధంగా ఉండాలని కోరుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలాంటి కోరిక అపాయకరం, ఎంతో ప్రమాదకరం. సంఘజీవనం, సామాజిక జీవనం, సహ జీవనం మనిషి మనుగడకు మూలం. వాటిని కాదంటే జీవితం చిందరవందర అవుతుంది.మనుషులు దేన్ని ద్వేషిస్తారో దాన్నే వెంట తెచ్చుకుంటూ ఉంటారు. ద్వేషంలోనే బ్రతుకుతుంటారు. ద్వేషం తెచ్చిపెట్టే గాయాలను మాన్చుకునే ప్రయత్నం చేయరు. మనస్సు ఒక క్రీడారంగం. అందులో అర్ధాంతరమైన ఆటల కన్నా బుద్ధిలేని ఆటలే ఎన్నో జరుగుతుంటాయి. ఆ బుద్ధిలేని ఆటలు కూడా సరిగ్గా అర్థం చేసుకుని జాలీ, దయ, క్షమా, కరుణలతో సహించగలిగితే అంతకు మించిన క్షమాపణ మరొకటి లేదు. క్షమాగుణం లేని మనిషి శత్రువులకు దాడి చేసే అవకాశం ఇస్తున్నాడన్నమాట.
-నీకు నిర్దిష్ట్టమైన స్వరూపం ఉంది, నీవు సమగ్రంగా పుట్టావ్. నీ సమగ్రతే ఈ దేశానికి ఇచ్చే సందేశం. వేరే సందేశాల కోసం ఎక్కడికీ పరుగులెత్తకు. నీ సమగ్రత చెదిరిపోకుండా కాపాడుకో. దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకో, అనుగుణంగా జీవించు. అదే నిన్ను కాపాడుతుంది.
మన దు:ఖానికి కారణాలు రెండు. ఒకటి నీ దు:ఖాన్ని పక్కవాళ్ళ మీదికి నెట్టివేయడం, రెండవది పరమానందం ఇతరుల నుంచి వస్తుంది అనే భావనతో బ్రతికివేయడం. రెండోది జరిగేది కాదు అందుకే నీవు కోరుకున్న సుఖం రాదు.
నీ జీవితం ఒక వస్తువు లాంటిది కాదు. సంతోషం కూడా ఒక వస్తువు లాంటిది కాదు. అది చేజారితే పగిలిపోదు, ఇతరులకు ఇచ్చేస్తే మనకు లేకుం డా పోదు. ఎవరి జీవితం వారిది.
Source - Whatsapp Message

No comments:
Post a Comment