పరమహంస - శారదామణి
మీరు నన్ను ఏ దృష్టి - తో చూస్తున్నారు?' అని భార్య అడిగింది.
'దేవాలయంలో ఏ దేవి పూజలందుకుంటుందో, ఏ తల్లి శరీరం నన్ను కన్నదో, ఆమే నాకు ఇప్పుడు సేవ చేస్తున్నదని భావిస్తున్నాను'- ఇదీ భర్త జవాబు. అలా అడిగిన భార్య పేరు శారదామణి. జవాబిచ్చిన భర్త పేరు రామకృష్ణుడు. భార్యను జగన్మాతగా భావించిన ధీశాలి ఆయన. మొదట ఆయనను పిచ్చివాడిగా భావించింది లోకం. బాహ్య స్పృహ లేకుండా, నిరంతర ఆలోచనలతో గడపడమే అందుకు కారణం. ఆ ఆలోచనలన్నీ ఎప్పటికీ ప్రత్యక్షం కాని జగన్మాత గురించే. స్త్రీ అంటే, ఆయన దృష్టిలో జగన్మాతే. అది భార్య కావచ్చు. తల్లి కావచ్చు. మరే స్త్రీ అయినా కావచ్చు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన శారదామణిని పూజాపీఠం మీద కూర్చోబెట్టి, షోడశోపచారాలతో పూజించడమే దీనికి నిదర్శనం.
భావనాబలమే గొప్పది. దానికి మరేదీ సాటిరాదు. 'బంగారు నాణాన్నయినా, మట్టి బెడ్డనైనా ఒకే విలువ కలదానిగా భావించినవాడే గొప్పవాడు' అని బోధించారాయన. కులమతాలు అనేవి లేవని, ఉన్నతమైనదీ, అధమమైనదీ అనే భేదం దేవుడి దృష్టిలో లేనేలేదని భావించేవారు. లోకులు అధములుగా చూస్తుండేవారి ఇళ్లకు వెళ్లేవాడు. వారిళ్లను శుభ్రపరచేవాడు. అదంతా పిచ్చిగా భావించేవారు సామాన్యులు. ఆ చర్యలు తన భావనను ఆచరణాత్మకంగా బోధించడమేనని గ్రహించినవారు అతి తక్కువమంది. మాటలద్వారా కంటే, చేతల ద్వారా బోధించడమంటే అదేనని గ్రహించారు వారంతా.
మతం విషయంలోనూ అదే భావన. ఎక్కువ తక్కువలనేవి ఏ మతంలోనూ లేవని నమ్మినవాడు. చూడగలిగే సత్తా ఉంటే భగవంతుడు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడని భావించిన వ్యక్తి. కాబట్టే సూఫీ పద్ధతిలో ధ్యానంచేసి అల్లా రూపంలోను, క్రైస్తవ సన్యాసుల పద్ధతిలో సాధన చేసి ఏసుక్రీస్తు రూపంలోను భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్నాడని చెబుతారు.
'మీరు దేవుడిని చూశారా?' అని అడిగిన నరేంద్రుడి ప్రశ్నకు తడుముకోకుండా- 'చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. ఇంకా చెప్పాలంటే... అంతకంటే ఎక్కువ సన్నిహితంగా చూశాను' అని రామకృష్ణులు బదులిచ్చారంటారు. అంతటితో ఆగకుండా 'చూడగలిగే సత్తా ఉంటే నీకూ చూపించగలను' అని చెప్పారట. ఆ సమాధానం చెప్పిన తీరులోనే తన అన్వేషణ ఫలించిందని గ్రహించాడు నరేంద్రుడు. ఆ క్షణంలోనే ఆయనను తన గురువుగా నిర్ణయించుకున్నాడు.
రామకృష్ణుల బోధనా విధానం అత్యద్భుతమైనది. 'మానవుడై పుట్టినవాడు వినమ్రుడై, విశుద్ధుడై ప్రేమపూరిత హృదయంతో మెలగాలి' అని బోధించేవారు. భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి జీవి సాక్షాత్తు భగవత్స్వరూపమని తలచి సాటిజీవికి సాయం అందించాలని ఉద్బోధించేవారు.
బాధ్యతలనుంచి ఎవరూ తప్పించుకోకూడదని ఆయన చెప్పేవారు. ఇహలోక బంధాలను చూసి 'నిర్వికల్ప సమాధిలోకి వెళ్లిపోవాలని ఉంది' అన్న నరేంద్రుడితో- 'నువ్వు దీనజనుల సేవచేయడానికి, వారిని ఉద్ధరించడానికి జన్మించావు, నీ జీవిత పరమార్థం వేరే ఉంది' అని కర్తవ్యోన్ముఖుణ్ని చేశారు.
రామకృష్ణుల దృష్టిలో, బోధనలో స్పష్టత ఉండేది. నవ్వుతూ, పరిహాసాన్ని జోడిస్తూనే అతి గంభీరమైన విషయాలను, ఆధ్యాత్మిక అంశాలను బోధించేవారాయన.
'ఇంట్లోనివాళ్లు మెలకువగా ఉంటే దొంగలు చొరబడలేరు... నువ్వు సదా జాగరూకుడవై ఉంటే- చెడు తలంపులు నీ మనసులోకి చొరబడలేవు' అనేవారు.
'మానవ జీవితం దుర్లభమైనది. అది పొందినప్పుడే భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించని మనిషి జీవితం నిరర్థకం. ఆ ప్రయత్నం ముక్కుమూసుకుని మూలకూర్చుని కాదు. నలుగురి క్షేమం కాంక్షిస్తూ, అందరిలో ఒకడిగా మెలగుతూ, సాధ్యమైనంతగా ఇతరులకు సేవ చేస్తూ...' అంటారాయన.
రామకృష్ణుల బోధనలు నిత్యసత్యాలు. అన్ని కాలాలకూ అనుగుణమైనవి. వాటిని ఆకళింపు చేసుకుంటే మానవజన్మ సార్థకత పొందుతుంది. ఆచరిస్తే ఉత్తమ స్థితి లభిస్తుంది*
🙏🌹🌸💐🍂🌷🌼🌱🥀🌻🍃🍀🌺🍁🌾🌳💮☘️🌿☀️
Source - Whatsapp Message

No comments:
Post a Comment