Tuesday, October 5, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

చల్లని నీటి రుచి తెలియాలంటే..
విపరీతమైన దాహం వెయ్యాల్సిందే.!

గెలుపు గొప్పతనం తెలియాలంటే..
ఓటముల దెబ్బలు తగలాల్సిందే.!

సుఖం అనే అనుభవం తెలియాలంటే..
కష్టాల కుదుపును బరించాల్సిందే.!

అసలు నిజమైన నీ వారు ఎవరో..
తెలియాలంటే సమస్యలు చుట్టూ
ముట్టాల్సిందే.. ఆలోచించుకో..
అంత నీ మంచికే..!

జీవితంలో మొదట ఒంటరిగానే ముందుకు సాగండి. గంగోత్రి నుంచి ఒక్క బిందువే మొదటగా తన ప్రయాణం ప్రారంభిస్తుంది, అది అప్పుడు కేవలం ఒకే ఒక్క నీటిబిందువు. కానీ ఆ తర్వాత ఒక్కొక్క బిందువు దానిలో కలిసి పెద్ద ప్రవాహమై గంగానదిగా మారి, పవిత్రతకు మారుపేరుగా నిలుస్తుంది.

అలాగే మనం కూడా ఒంటరిగానే జీవితం ప్రాంభించవలసి ఉంటుంది. మంచి నిర్ణయంతో, నిర్భయంగా, నిస్సంకోచ ఆలోచనతో, సాహసంతో, నమ్మకంతో మరియు ఆత్మ విశ్వాసంతో. అప్పుడే నువ్వనుకున్నది సాధిస్తావు. నువ్వేంటి అన్నది ఈ ప్రపంచానికి తెలియజేస్తావు...✍️


శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment