Tuesday, October 5, 2021

ఎంత చిత్రమో ఈజీవిత సత్యాలు

ఎంత చిత్రమో ఈజీవిత సత్యాలు
-
మెట్టెలవిలువ వేలల్లోఉంటుంది-కానీ వేసేదికాళ్ళకి
కుంకుమవిలువ రూపాయల్లో ఉంటుంది-కానీ నుదుటిన పెట్టుకుంటాం.విలువ ముఖ్యంకాదు ఎక్కడ పెట్టుకుంటాం అనేదే ముఖ్యం.
ఉప్పులాగ కటువుగా మాట్లాడేవాడు నిజమైన మితృడు...చక్కెరలాగ మాట్లాడి మోసగించేవాడు నీచుడు.
ఉప్పులో యెప్పుడు పురుగులుపడ్డ దాఖలాలులేవు—తీపిలో పురుగులు పట్టనిరోజంటులేదు.....!
-
ఓమనిషీ!-
ఈజీవితం అంత విలువైనదేమీకాదు-ఏడుస్తూ ఈలోకంలోకి అడుగుపెడతాము-ఏడిపిస్తూ-ఈలోకాన్ని వదలి వెళ్ళిపోతాము....!
రమ్మన్నా సన్మార్గము(మంచిదారి)లోకి ఎవరుా రారు.చెడుమార్గమునే యెంచుకుంటారు.
పాలు అమ్మేవాడు ఇల్లిల్లుతిరగాలి.సారాయి అమ్మేవాడి దగ్గరికీ అందరూ వెళ్తారు.-పాలల్లో నీళ్ళుకలిపావా అని అడుగుతారు-ఖరీదైన సారాయిలో నీళ్ళుకలుపుకునితాగుతారు.

ఆహాహా యేమిలోకం తీరు.....!
పెళ్ళి ఊరేగింపులో బంధుమితృలుముందు వరుడు వెనకాల ఉంటాడు.అదే చావులో శవం ముందుంటుంది బంధుమితృలు వెనకాల నడుస్తారు.
శవాన్ని ముట్టుకున్నందుకు స్నానంచేస్తారు.మూగప్రాణులను చంపి శవాన్ని పీక్కుతిన్నట్టుగా భుజిస్తారు.-
కొవ్వొత్తులని వెలిగించి చనిపోయినవారిని గుర్తుచేసుకుంటారు.అదే కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తున్నారు....!
ఓమనిషీ!
ఆకలి విలువ పేదవానికి తెలుసు కష్టము విలువ కర్షకునికి తెలుసు-
ఇదే పచ్చి నిజం
పుట్టినపుడు జాతకం
నడిమధ్యలో నాటకం
చావగానే సుాతకం
ఐనా ఆగదు జనాలమధ్య కౌతుకం.!

సకలజీవులకు అన్నమే పరబ్రహ్మమని అన్నాడు బసవన్న
అది తెలుసుకోకుండా మూఢులైనారు ఎంతోమంది మనుషులు
కళ్ళతో ఈజగత్తునిచూస్తే కనిపించేవిదృశ్యాలే...హృదయంతో చూడగలితే జగత్తంతా సుందరమే,,,,!

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment