Saturday, October 2, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

లేక పోవడం పేదరికం. ఉన్నా చాలదు అనుకోవడం ధరిద్రం. మరి మనం ఎక్కడున్నామో చూసుకుందాం.ప్రశ్నలోనే జవాబు దాగి వుంటుంది.అది తెలుసుకోవడమే జ్ఞానం.తెలియక పోవడమే అజ్ఞానం.

మనందరి ఉమ్మడి శత్రువులు నిర్లక్ష్యం,కోపం.మనకు వుండ కూడనివి రాగద్వేషాలు.రాగం అంటే అతిగా ఇష్టపడటం.చెడు చేస్తేనే చెడుకాదు.చెడు చేయాలనే తలంపు అంటే ఆలోచన కూడా చెడే.

సత్యంగా వుండటానికి శ్రమ అవసరం లేదు.ధర్మంగా బ్రతకడానికి డబ్బుతో పని లేదు.డబ్బులు వుండటం గొప్ప కాదు,జబ్బులు లేక పోవడమే గొప్ప.అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.

ఏదో ఒకటి మాట్లాడటం గొప్పకాదు,అసలు మాట్లాడక పోవడమే వుత్తమం.పొదుపు జీవితానికి అదుపు.ఆడంబరం కన్నా నిరాడంబరం మిన్న.( గాంధీ మార్గం )ఇరుకు (చిరుగు )బట్టల కన్నా మురికి బట్టలు మిన్న.

మాంసాహారం సున్న ,శాకాహారం మిన్న.మౌనం గొప్పది,ధ్యానం మహా గొప్పది.విగ్రహారాధన కన్నా ఆత్మారాదన మరింత గొప్పది .🙏

శుభోదయంతో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment