Saturday, October 2, 2021

మంచి మాటలు

🔱శుభోదయం🔱

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ బతకటం అనేది ఎట్లైనా బతకవచ్చు అన్ని ప్రాణులు బతుకుతున్నాయి.. మనం పది మందికి ఉపయోగపడేలా జీవిస్తేనే మనకు లభించిన జన్మకు న్యాయం చేసినవారిమీ అవుతాం.. సాయం అంటే ధన వస్తూ సహాయాలు కాదు.. మనం చేసే పనులు ఏవైనా సరే నిబద్దత తో న్యాయంగా చేసిన కూడా ఇంకొకరికి సహాయపడినట్లే.మనం చేయవలసిన పనులు ఇంకొకరికి అప్పగించకుండా మనం సక్రమముగా నిర్వర్తించినా కూడా ఇంకొకరికి సహాయం చేసినట్లే..
మహాత్ములు జన్మించిన అక్టోబర్ నెలకు స్వాగతం చెపుతూ
01-10-2021:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాటలు
చూడు మిత్రమా!!
ఎవరెన్ని కుట్రలు చేసినా, చివరికి న్యాయమే గెలుస్తుంది, అన్యాయం కొంతమంది కి తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వొచ్చు, కానీ,, నీతి, నిజాయితీ అనేది శాశ్విత నిధి లాంటిది, అది ఎప్పుడు చెక్కుచెదరదు,, తప్పకుండా ఏదో ఒకరోజు గెలిచి దుర్మార్గుల గుండెల్లో ప్రళయతాండవం ఆడుతుంది,,

జీవితంలో,, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని అలవాట్లు మర్చిపోవాలి, కొన్ని అలవాట్లు వద్దనుకోవాలి, కొన్ని అలవాట్లు వదులుకోవాలి,, అప్పుడే సంతోషంగా ఉండగలం,,

జీవితంలో ఒక్కటే గుర్తుంచుకో,, ఒకరు మనల్ని అన్యాయంగా విమర్శిస్తున్నారు, మన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటే, మనం ఎదుగుతున్నాం అన్నట్టు లెక్క,, మన ఎదుగుదలను ఓర్వలేని వారే మన గురించి తప్పుగా ప్రచారం చేస్తారు,, అలాంటి వారికి మన మౌనమే చెప్పుదెబ్బ,,
సేకరణ 🖊️AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

No comments:

Post a Comment