https://youtu.be/tteM1DFITx8
ఈ వీడియో దయచేసి అందరూ చూడగలరు
నవ విధ భక్తి మార్గాలు అంటే ఏమి..? అవి ఏవి..?
.
భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీత లో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.
భక్తి చేయడం అనేది వారి వారి అనుకూలత / అభిప్రాయాలు లేక వారివీలును బట్టి ఉంటుంది. ఏ విధంగా చేసినా రోజులో అధికసమయం దైవనామస్మరణ చేయడం, ప్రతీదానిలో ఆనందం అనుభవించడం ముఖ్యం, ఆ భక్తి చేయడం అనేది కొందరు భజనలు చేస్తారు, కొందరు జపం చేస్తూంటారు, మరికొందరు ధ్యానం చేస్తారు. ఆ విధంగా పలురకాలుగా దేవుడిని ఆరాధించే మార్గాలు తొమ్మిది. వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు.
శ్రీ రామచంద్రుడు ఈ "నవ విధ భక్తి మార్గములు" గురించి లక్ష్మణునికి వివరించినట్లు వాల్మీకి మహాముని వ్రాసారు... అంతే కాక భాగవతం (శ్రీమద్భాగవతం 7.5.23) లో కూడా ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపునికి ఈ నవ విధ భక్తి మార్గముల గురించి ఈ విధంగా వెల్లడిస్తాడు...
" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్ "
శ్రవణం :
ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలోనే దైవత్వమును గ్రహించి కేవలం శ్రవణం ద్వార భక్తితత్వాన్ని గ్రహించాడు. మనకు ఉన్న సమయాన్ని దైవిక విషయాలు వినటానికి అది ఏ రూపంలోనైనాసరే (ఇప్పుడు అందరి ఇళ్ళలో సిడి ప్లేయర్స్, టేపిరికార్డ్లు ఉంటున్నాయి కదా) పొద్దున్నే సుప్రభాతం, విష్ణు, లలితా సహస్రనామములు, వారి ఇష్టదేవతా స్తోత్రములు వినడం ద్వారా ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభించడం మంచిది.
కీర్తనం :
మనందరికి తెలిసిన అన్నమ్మయ్య, త్యాగయ్య, భక్త రామదాసు మొదలైన వాగ్గేయకారులంతా భక్తి చేసినది 'కీర్తనం' ద్వారానే. అందరికి అష్టోత్రాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, వారు అలా బాధపడకుండా, కీర్తనల రూపంలో ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు.
స్మరణం :
కార్తీకపురాణం, విష్ణుపురాణం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం మొదలైనవి అన్ని 'స్మరణ' మార్గంగా చెప్పవచ్చు. అంజనేయస్వామి కూడ ఎప్పుడూ రామ నామస్మరణలోనే ఉంటాడు.
పాదసేవ :
పాదసేవ కంటే మించినదిలేదు. గురువుగారి కి పాదసేవ, పాదపూజ చేయడం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలము. భక్తుడెల్లప్పుడూ భగవంతుని దివ్యచరణాలను తన మనోనేత్రంతో చూస్తూ వాటినే పూజిస్తూ ఉంటాడు. ఈ భక్తిపద్ధతిని పాదసేవనమంటారు. ప్రహ్లాదుడు పులకించిన శరీరంతో అరవిచ్చిన కన్నులతో శ్రీహరి పాదాలను సేవిస్తూ ఉంటాడని భాగవతం చెబుతోంది. రామచంద్రుని పాదుకలనే అతని దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ నందిగ్రామంలో గడుపుతూ ఉంటాడు భరతుడు.
అర్చనం :
మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. శ్రీరామచంద్రుడే సింహాసనంపై కూర్చున్నట్టుగా భావించి ఆయన పాదుకలకు భరతుడు ఛత్రం(గొడుగు) పడతాడు.చామరం(వీవన)తో వీస్తాడు.
వందనం :
ఇష్టదైవానికి / గురువుకి మనస్పూర్తిగా నమస్కరించడం. రామచంద్రుని చూడగానే పులకితగాత్రుడైన భరతుడు ఆనందబాష్పాలు రాలుస్తూ రాముని పాదాలమీదపడి వందనమాచరిస్తాడు .
సఖ్యం :
భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ. గోపాలునితో స్నేహమొనరించి, ఆ స్నేహమాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు.
ఆత్మనివేదనం :
కామ క్రోధ మద మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో ఆ దేవదేవుడిని పూజింపాలి.
దాస్యం :
సర్వం ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. లక్ష్మణుడు ప్రతీక్షణం శ్రీరామచంద్రుడికి కావలసినవి అమర్చడం, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించడం మొదలైనవి దాస్య భక్తిప్రవృతి గా చెప్పవచ్చు.
మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు.
పూజచేయడానికి అంత సమయం లేదు అంటున్న ఈ యాంత్రికకాలం లో పైన చెప్పిన శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం చేయడంద్వార భగవత్ నామస్మరణ చేయొచ్చు. ఇవి చేయడానికి సమయం సంధర్భం అవసరంలేదు. మీకు ఒక్కనిమిషం సమయం ఉన్నా, ఇష్టమైన నామాన్ని స్మరించండి చాలు
.
నవవిధ భక్తులు
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం.
ఇవి శ్రీమద్భాగవతాంతర్గతముగా చెప్పబడిన భక్తిమార్గములు .
శ్రీమదాంధ్రభాగవతం లో పోతన గారు దీని యొక్క ఆంధ్రానువాదం చేస్తూ ఈ క్రింది పద్యాన్ని ఇచ్చారు.
తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిదిభక్తిమార్గముల సర్వాత్మునున్ హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
1. భగవంతుని లీలలను వినడం (“శ్రవణం”)
2. ఆయన లీలలను “కీర్తించడం”
3. అదే పని గా భగవంతుని నమ”స్మరణ” చేయడం
4. స్వామివారి “పాదసేవనము” చేయడము
5. స్వామిని “అర్చించడం”
6. భక్తి తో “వందనము” చేయడము
7. దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే భావము తో “దాస్యము” చేయడం
8. స్వామి నా చెలికాడు అనే భావన తో “సఖ్యము” చేయుట
9. స్వామీ నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో “ఆత్మ నివేదన” చేయడం
ఈ తొమ్మిందింటినీ నవవిధ భక్తులు అని అంటారు . ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొంది పునరావ్రుత్తి రహిత స్థితి ని పొందవచ్చు.
ఇక్కడ ఒక్కో భక్తి మార్గం లో తరించిన మహానుభావుల గూర్చి మనం తెలుసుకోవాలి.
1. శ్రవణం —– పరీక్షిత్ మహారాజు (భాగవతాన్ని (భగవత్ భక్తుల కధలను)విని తరించాడు )
2.కీర్తనం —– శుక బ్రహ్మ (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు) .
3.స్మరణం —– ప్రహ్లాదుడు .(ఎప్పుడూ స్వామి నామం చెప్తూ తరించిన మహనీయుడు)
4.పాదసేవనం — లక్ష్మీదేవి (అమ్మ గూర్చి ఏమని చెప్పేది.. అమ్మ భక్తి తెలియనిదెవరికి )
5.అర్చనం —— పృధు మహారాజు (ఈయన కధ కూడా భాగవతం లో వస్తుంది.)
6.వందనం——- అక్రూరుడు (భాగవతం లో దశమస్కంధం లో శ్రీ కృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు , శ్రీ కృష్ణుని పరమ భక్తుడు ,ఈయన చేసే వందనానికి శ్రీ కృష్ణుదు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్ధం చేసుకోవాలి.)
7.దాస్యం —— ఆంజనేయ స్వామి (స్వామి హనుమ యొక్క దాస భక్తి ,వారు శ్రీ రామ చంద్రమూర్తి ని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు)
8.సఖ్యం —— అర్జునుడు (శ్రీ కృష్ణార్జునల బంధము లోకవిహితమే కదా)
9.ఆత్మనివేదనం — బలిచక్రవర్తి (వామనావతరం లో స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు. )
.
https://youtu.be/tteM1DFITx8
సేకరణ

No comments:
Post a Comment