🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"297"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మనసును ఆత్మభావం నుండి దూరంచేసే దేహాత్మబుద్ధికి కారణం ఏమిటి ?"*
*************************
*"ఇంద్రియాలే ! మనలోని ఆత్మ పరిపూర్ణ శాంతితోనే ఉంటుంది. కానీ మన మనసు ఆ ఆత్మ శాంతిని పొందలేక పోతుంది. అందుకు కారణం ఇంద్రియాలు అందించే అనుభవాలు. అవే మనసు ఆత్మభావన నుండి దూరంచేసి శరీర భావన కలిగిస్తున్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక అనే ఐదు బాహ్యేన్ద్రియాలు. ఇది మనకు రూపాన్ని, వాసనను, శబ్దాన్ని, స్పర్శను, రుచిని అందించే పరికరాలు. మన శరీరానికి కష్టసుఖాలు, మనసుకు సంతోష, దుఃఖాలు కలిగేది ఈ ఇంద్రియాల వల్లే ! మనం నిద్రించేటప్పుడు ముందుగా బాహ్యేన్ద్రియాలు సద్దుమణిగి అంతరేంద్రియాల భావన మిగిలి ఉంటుంది. అదే కొంతసేపు స్వప్నంగా నిలిచి ఉంటుంది. ఆ తర్వాత గాఢనిద్రలో ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయి. అక్కడ ఏ భావనలేని శాంతి స్థితి మాత్రమే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవం లోనిదే !ఈ శాంతిని నిత్యజీవితంలో కూడా సాధించటమే ఆధ్యాత్మిక జీవనం "!*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
🌼💖🌼💖🌼
🌼🕉🌼
No comments:
Post a Comment