అరుణాచల శివ 🙏🏻
🔹🔸🔹🔸🔹🔸🔹
భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు. – రమణ మహర్షి.
కష్టాలలో ఉన్న భక్తులకు భగవంతుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మనిషి చేయవల్సినదంతా పరమేశ్వరునిపై నమ్మకం కలిగి ఉండడమే, మాధవా, మధుసూదనా అని మనసులో తలిస్తే చాలు భక్తులను కటాక్షిస్తాడు నారాయణుడు. తల్లీ, తండ్రి నారాయణుడే, గురువు, చదువు నారాయణుడే, యోగం, యాగం నారాయణుడే. ముక్తి దాత నారాయణుడే.
కష్టాలలో ఉన్న భక్తులను ఆదుకోవడానికి శ్రీహరి ఎన్నడూ ఆలస్యం చేయడు. జాతి బేధాలు మనుషులకే కానీ పరమేశ్వరుడికేలా!!!
నారాయణుడికి పరామభక్తుడైన ప్రహ్లాదుడు రాక్షస రాజు హిరణ్యకశిపుని పుత్రుడు. హిరణ్యకశిపుడు నారాయణుడినే అంతం చేయాలనీ పట్టుబట్టినవాడు, మునులను, దేవతలనూ, ఋషులనూ అనేక విధాలుగా బాధించాడు. కన్నబిడ్డను సైతం హతమార్చాలనుకున్న హిరణ్యకశిపుని అంతం చేయడానికి నృసింహ అవతారమెత్తాడు శ్రీహరి. బ్రహ్మ ఇచ్చిన వరంతో తనకు చావులేదని గర్వంతో ఉన్న హిరణ్యకశిపుణ్ణి మనిషి కాకుండా, మృగము కాకుండా, నరసింహ అవతారమునెత్తి పగలూ కానీ, రాత్రి కానీ సంధ్య సమయమున, ఇంటిలోనూ కాకుండా, బయటనూ కాకుండా గడప మీద ఏ ఆయుధమూ లేకుండా చేతి గోళ్ళతో పొడిచి హతమార్చాడు. భక్తితో శ్రీహరిని స్తుతించిన ప్రహ్లాదుని రక్షించాడు.
భగవంతుని లీల ఏమిటంటే నారాయణుడిని అంతగా ద్వేషించి, శ్రీహరిని అంతం చేయాలనుకున్న హిరణ్యకశిపుడు సైతం ముందు జన్మలో హరి భక్తుడే.
దేవతలకే అర్ధం కానీ నారాయణుడి లీలలు మనిషికి ఎలా అర్ధం అవుతాయి? తాను ఏ పని చేసినా ఏ అవతారమెత్తినా అది లోకకళ్యాణార్థమే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణ కోసమే నారాయణుడి దశావతారాలు.
సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవంతుని సేవ సులభమైన నావ. సుఖదుఃఖాల్లో మనసులో దైవ చింతన ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది.
ఆ రక్షణ ఏ రూపంలోనైనా కావచ్చు. మనిషి రూపంలో, గాలి, నీరు, పంచభూతాలు ఇలా ఏ రూపంలోనైనా మనల్ని నిరంతరం రక్షించేది ఆ భగవంతుడే.....
🔹🔸🔹🔸🔹🔸
No comments:
Post a Comment