Saturday, August 20, 2022

🕉దేనికైనా కాలం కలసి రావాలి.🕉

 🕉దేనికైనా కాలం కలసి రావాలి.🕉

అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
🙈🙈🙈🙈🙈
సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
🌧🌧🌧🌧🌧
ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.
🌊🌊🌊🌊🌊🌊
తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు
🌈🌈🌈🌈🌈
: తూట కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు
🌼🌼🌼🌼🌼🌼
మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..
🌺🌺🌺🌺🌺
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
⛈⛈⛈⛈⛈
నీవు సంతోషంగా ఉన్నావంటేనీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని…
🌤🌤🌤🌤🌤
స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.
🔥🔥🔥🔥🔥
చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.
🌙🌙🌙🌙🌙
: కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
🦑🦑🦑🦑🦑
ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు.
🦋🦋🦋🦋🦋
ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా…
🦆🦆🦆🦆🦆
గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకుదగ్గర చేసే సాధనాలు.
🌹🌹🌹🌹🌹
నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
🤝🤝🤝🤝
స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.

No comments:

Post a Comment