Sunday, October 2, 2022

మంచి మాట.. లు(01-10-2022)

శనివారం --: 01-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు

మనల్ని పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది, కానీ తలచే మనసు మనకు ఎంత దూరంలో ఉన్నా కూడా మనల్ని నిరంతరం అభిమానిస్తూనే ఉంటుంది .

ప్రశ్నించే వ్యక్తిని చంపగలరెమో కానీ ప్రశ్నను మాత్రం చంపలేరు . మనం ఎక్కడ చనిపోతామో ఎలా చనిపోతామో నిర్ణయించడం మన చేతుల్లో లేదు,కానీ ! మనం ఎలా బతకాలి అనేది నిర్ణయించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది .

ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధలను లను అర్దం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్బుతంగా ఉంటుంది .

మనిషి అభిప్రాయం దేముంది రోజుకో రకంగా మారుతుంది, మొన్న మంచివారు అనే అభిప్రాయం ఉంటే నిన్నటికి చెడ్డవారుగా మారోచ్చు,నిన్న చెడ్డవారు అని అభిప్రాయం ఉంటే ఈ రోజు మంచివారు కావచ్చు,కానీ ఆభిప్రాయం మార్చుకున్నంత సులువుగా మనుషులు మారనప్పుడే బంధాలకు విలువ ఉంటుంది 🤝

సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు 🌷🤝🌹

No comments:

Post a Comment