Sunday, October 2, 2022

మంచి మాట.లు(29-09-2022)

గురువారం :-29-09-2022
నేటి AVB మంచి మాట.లు

జీవితంలో ఎప్పుడైనా సరే మనం నిరుపేదలం అని అనుకోవద్దు,,ధనం నిజమైన శక్తి కాదు, మంచి గుణమే నిజమైన శక్తి,, గుర్తుంచుకోండి.
ధనం అవసరమే కానీ దానికన్నా బందాలు ఇంకా అవసరం.. ఈ రోజు మన దేగ్గెర ఉన్నా రూపాయి 10 రోజుల తరవాత కూడా మన దేగ్గెరే ఉంటుందన్న నమ్మకం లేదు.. అది గుర్తేరుగుతే చాలు,,

మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో.. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం,,

కడివెడు గాడిద పాలకంటే గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును,, అట్లాగే మంచి మనసుతో పట్టెడు అన్నం పెట్టినా అది ఎంతో తృప్తిని కలిగిస్తుంది,, అందుకే అన్నారు పెద్దలు తన మనసుని తాను జయించిన వాడు ప్రపంచాన్ని జయించగలడు అని,,

మన ఇష్టాలు కూడా హద్దుల్లో ఉండాలి,, లేకుంటే కష్టంగా మారి మన వెంటే ఉంటూ బాధపెడతాయి,, అందుకే ఏదైనా సరే హద్దు మీరితే ప్రమాదమే,

సేకరణ ✒️AVB సుబ్బారావు, 💐🌹🤝

No comments:

Post a Comment