Wednesday, October 19, 2022

నేర్చు కోవడం రెండు రకాలు.

 .......*నేర్చు కోవడం*.... 
నేర్చు కోవడం రెండు రకాలు.
1)మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం,వంట చేయడం నేర్చుకుంటాం.భాష నేర్చుకుంటాం.ఇలా జీవితంలో అనేకం నేర్చు కుంటాం.

2)జీవించడమే నేర్చుకోవడం.
   ఇక్కడ నేర్చు కునేది ఏమీ వుండదు . నేర్పుగా జీవించడం తప్ప ‌.
   జీవితం అంటే సవాళ్లు, ప్రేరణలు,వీటికి జవాబుగా స్పందించడం.
  సరిగ్గా స్పందించక పోతే సమస్య అవుతుంది.
జీవించే క్రమంలో అనుభవాలను నుండి,
ఆచరణ నుండి,  ఎదుగుతూ నేర్పుగా జీవించడం. ఇక్కడ జీవించడం, నేర్చు కోవడం వేరు వేరు కావు.
*ధ్యానం నేర్పుగా జీవింప చేస్తుంది* 
 ఇట్లు
జీవించే వాడు *లేని* జీవితం.

No comments:

Post a Comment