Monday, November 7, 2022

మంచి మాట...లు(07-11-2022)

సోమవారం -: 07-11-2022 :-
ఈరోజు AVB మంచి మాట...లు

నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారనేది ముఖ్యం కాదు అది ఎంత మందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం

ఉదయానికి సూర్యుడు అందం, రాత్రికి చంద్రుడు అందం, మనిషికి వ్యక్తిత్వం అందం, మంచి మనసు గల మంచి మనిషికి మీలాగా మంచి స్నేహితులు ఉండటం అందం.

కాలం విచిత్రమైనది తొందర పడకు వేచిచూడు ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు,

కష్ట కాలంలో సహనాన్ని, కలిసివచ్చే కాలంలో వినయాన్ని కోల్పోని వారు గొప్పవారు,

. ఎదుటి వారి స్థాయిని బట్టి మాట్లాడే వారి కన్నా ఏ స్థాయికి వెళ్లినా ఒకేలా మాట్లాడేవారు గొప్పవారు

నీలో ఉన్న భయాన్ని తాకట్టుపెట్టి దైర్యాన్ని కొనుక్కు , నిరాశ ను వదిలేసి ఆశ తో జీవించు,ఆశాంతి నీ పక్కనపెట్టి శాంతి తెచ్చుకో , దుఃఖాన్ని సంతోషం తోనూ కోపాన్ని క్షమ తోను మార్ఫిడి చేసుకో ఆశ్చర్యంగా నీ వద్ద ఉన్న వాటితో పైసా ఖర్చు లేకుండా ట్రేడింగ్ చేసి లైఫ్ ని సంతోషంగా ఎలా మర్చుకోవచ్చో చూడు .

సేకరణ 🖊️ AVB సుబ్బారావు

No comments:

Post a Comment