Wednesday, November 23, 2022

దుష్టులతో దూరంగా ఉండండి

 iv.i. 2-7.   231122-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


 దుష్టులతో దూరంగా ఉండండి 
              ➖➖➖✍️


ఎవరైనా కాళ్లకు ముళ్ల గుచ్చుకోకుండా నడవాలనుకుంటే.. పాదాలకు చెప్పులు ధరించాలి. 

అదే విధంగా ఎవరైనా దుర్మార్గులను నివారించాలనుకుంటే.. వారి లోపాలను ఎత్తిచూపుతూ.. పదిమందికి వారి గురించి తెలియజేయండి.. అప్పుడు వారు మీ ముందు తల ఎత్తడానికి ధైర్యం చేయరు.

సిగ్గులేని వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. తన గౌరవాన్ని పట్టించుకోని వ్యక్తి, అవతలి వారి గౌరవం,  విలువను అతను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే… మీ గౌరవం తగ్గించుకున్నట్లే.

ఎవరికైనా నాలుగు వేదాలు, ధర్మశాస్త్రాల గురించి జ్ఞానం ఉండవచ్చు. అయితే మీ గురించి మీకు పరిపూర్ణంగా తెలియకపోతే అవన్నీ వ్యర్థం..!    ఎలా అంటే.. జీవితం ఒక చెంచా లాంటిది. భోజనం చేసే సమయంలో అన్ని వంటకాలను తాకుతుంది. అయితే అది ఏ వంటని రుచి చూడలేదు.

ఏదైనా ముఖ్యమైన పనిని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రణాళికను ఎవరితోనూ పంచుకోకూడదు.  కొంచెం నిర్లక్ష్యం ఉంటే.. అప్పుడు శత్రువు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి    ప్రతి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు ప్రణాళిక ఫలించి పని పూర్తయ్యే వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది.

తప్పుడు పనులు చేసే, లేదా ఇతరులను అవమానించే వ్యక్తులకు దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. లేకుంటే మీరు వారికి ఎప్పుడు బలి అవుతారో కూడా మీకు తెలియదు. ఒకొక్కసారి మీ స్వంత ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

మీరు ఎంత బలహీనంగా ఉన్నా, మీ బలహీనతను ఎప్పుడూ అవతలివారికి తెలిసేలా ప్రవర్తించకూడదు.                                                                                                                             పాములాగా, అది విషపూరితం కానప్పటికీ..  బుసలు కొట్టడం ఆపదు.

ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలకులు ప్రజలకు చేయాల్సిన మేలుని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషయాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. ఈ నీతి శాస్త్రంలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తూ అనేక విషయాలను విశదీకరించారు. చాణక్యుడు  బహుముఖ ప్రజ్ఞాశాలి. సుసంపన్నడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పొందుపరిచాడు.  అవి నేటికీ ప్రజలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. 

ఈరోజు మనిషి మోసపోకుండా ఉంటాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాణిక్యుడు చెప్పిన విషయాలివి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment